Posts

Showing posts with the label పిల్లలు

ఇష్టం అంటే...

Image
"నాన్నంటే నాకిష్టం" "నాకు కూడా శ్రీహర్షబాబంటే బోలెడంత ఇష్టం" "నాన్నా.." "ఊ..." "ఇష్టం అంటే?" ".................. ఇష్టం అంటే, నువ్వు ఎప్పుడైనా తమ్ముని కొట్టడం, తోసెయ్యడం చేస్తావు కదా.. అప్పుడు నాన్న 'హన్నా.. అలా చెయ్యకూడదు' అని కేకలేస్తారు కదా.. కాని వెంటనే ఇలా పట్టేసుకుంటారు - అదీ ఇష్టం అంటే" నాన్నకి ఏమి చెప్పాలో తెలియలేదు. "ఓహో...." శ్రీహర్ష బాబుకి మాత్రం చక్కగా అర్ధం అయింది!! :).

అమ్మ

అమ్మ... సృష్టిలో హాయైన పదం.. అర్ధం చెప్పాలనుకుంటే ఏమీ తోచని పదం... తన త్యాగాలు రాయాలంటే పేజీలే సరిపోని పదం.... కలతనిదురలో లేచి ఏడిస్తే ఎంతటి నిద్రలోనైనా టక్కున లేచి గుండెలకు హత్తుకుంటుంది. అల్లరి చేస్తే మందలిస్తుంది, తరువాత తనే దగ్గరకి వచ్చి ముద్దు చేస్తుంది. తొలి గురువు తానై పాఠాలు చెబుతుంది, పెద్ద చదువులు చదివి ఎదిగితే తనకన్నా కాస్త పొడవున్న ఆ బిడ్డని తలపైకి ఎత్తి చూసుకుంటూ గర్వంగా మురిసిపోతుంది. కాస్త తొందరగా లేస్తే 'కాసేపు పడుకోకపోయావా?' అంటూ దగ్గరకొస్తుంది.. నేనూ ఒక తల్లినని, ఆవిడ తెల్లవారుఝామునే లేచి తన పిల్లలకోసం చేసినవి నేనూ నా పిల్లలకి చెయ్యాలి అన్న విషయం మరచిపోతుంది. చిన్నప్పుడు నా బట్టలు అన్నీ తనే ఉతికిపెట్టింది, ఇప్పుడు పుట్టింటికి వెళ్తే నా పిల్లల బట్టలు ఉతకడానికి పనిమనిషిని పెట్టింది. అప్పడాలు, వడియాలు, ఊరగాయలు అంటూ మాకిష్టమైనవి చేస్తూ పరుగులు పెడుతుంది, అవి ఎండబెట్టడానికి డాబా ఎక్కుతుంటే కాలికి తగిలిన దెబ్బకి రాత్రి మేమందరం పడుకున్నాక చీకటిలో కొబ్బరినూనె రాసుకుంటుంది. పొద్దుటి అన్నం పెట్టుకుంటే 'హన్నా.. అరగదు' అంటూ మందలిస్తుంది, నేను చూడకుండా ఆ అన్నం మజ్జ...

ముంగండ గ్రామము ఎక్కడ ఉన్నది?

Image
ఇదిగో ఇక్కడ.. లేకపోతే.. ఇక్కడ.. ఆసియాఖండంలో భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో ముంగండ గ్రామము ఉన్నది :)

పిల్లలకి దంతాలు వచ్చే క్రమం.

Image
పిల్లలకి పళ్ళు ఏవి ఎప్పుడు వస్తాయి అనే విషయం మీద (ముఖ్యం గా మొదటి పిల్లవాళ్ళకి ఐతే ఏమి expect చెయ్యాలో తెలియదు కాబట్టి) మాలాగే చాలామందికి అవగాహన తక్కువ ఉంటుంది అనే ఉద్దేశ్యంతో ఇది రాస్తున్నాను. ముఖ్యంగా అదే వయసుకి చెందినా వేరే పిల్లల్ని కూడా చూస్తూ ఉంటే, మన వాళ్లకి అదే వేగంతో పళ్ళు కనిపించకపోతే కొంచెం ఖంగారు పడడం సహజం. ఈ మధ్య మా పెద్ద పిల్లవాడిని దంత వైద్యుని దగ్గరకి తీసుకొని వెళ్ళినప్పుడు ఈ చార్ట్ ఇచ్చారు. ఎవరికీ వారు దీనిని తమ పరిస్థితి కి అన్వయించుకోవచ్చు.

మా వూరి వంట ఫ్యాన్.

అన్నట్టు, ఈ నూనె లో కొలెస్ట్రాల్ లేదు అని ఊదరగొడుతున్నారు కాని, అసలు ఏ నూనె లోను, కొవ్వే తప్ప కొలెస్ట్రాల్ ఉండదని వీళ్ళకి ఎవరైనా చెబితే బాగుండును.

స్ట్రా లు శుభ్రం చెయ్యడం (How to clean straws)

పిల్లలకి ఒక ఏడాది వయసు వచ్చేసరికి మొదట నెమ్మదిగా కప్ లోనుంచి తాగడం అలవాటు చేస్తాము. చిన్న నోళ్ళు కాబట్టి పీల్చుకోవడానికి చాలా సార్లు కప్ కి స్ట్రా కలిసి ఉండే విధంగా వాళ్ళు అమ్మడం, మనం కొనడం పరిపాటి. దీనితో పిల్లలకి స్ట్రాతో కావలసినంత పీల్చుకోవడం, సొంతంగా తాగడం అలవాటు అవుతుంది. ఐతే చాలాసార్లు ఈ స్ట్రాలు స్ట్రైట్ గా కాకుండా మధ్యలో డిజైన్లు ( ఇక్కడ చూపించిన విధం గా ) ఉంటాయి. దానివల్ల స్ట్రా సులువుగా వంగుతుంది కాని, వాడేకొద్దీ (ముఖ్యంగా పాలతో) దానిలో "మోల్డ్" చేరి అనేక అనారోగ్యాలకి కారణం అవుతుంది. మరి స్ట్రా లోపల శుభ్రం చెయ్యడం ఎలా? దానికోసం మాకు ఈ మధ్య ఒక పరికరం దొరికింది. "Babys R Us", అమజాన్ లాంటి చోట్ల దొరుకుతుంది. (bRUs లో ఖరీదు ఎక్కువ అన్న విషయం మళ్ళీ నేను చెప్పనక్కర్లేదు). దీనితో స్ట్రా లు శుభ్రం గా శుభ్రం అయిపోతాయి.

మన పిల్లలు - వాళ్ళ పిల్లలు..

Image
ఈ మధ్య పిల్లల మీద పోస్టులు ఎక్కువ అయ్యాయి కదా? నాకు కూడా అలాగే అనిపించింది.. కాని తప్పదు :). ఈ టపా కి ఇన్స్పిరేషన్ తల్లిదండ్రులే. "doting parents" అని అంటారు కదా.. అలా అన్నమాట. ఇలాంటి వాళ్ళు - ఎవరైనా తమ ఇంటికి వచ్చారు అనుకోండి, వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి కొత్తగా నేర్చుకున్న మాటలు, పాటలు, ఆటలు చూపిస్తారు. వాళ్ళు మన ఇంటికి వచ్చారు అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి కొత్తగా నేర్చుకున్న మాటలు, పాటలు, ఆటలే చూపిస్తారు. రెంటిలోనూ తప్పు లేదు కాని, చాలా మంది వాళ్ళ పిల్లలే పిల్లలని, మిగిలిన వాళ్ళు ఎవరూ తమ అనుగ్రహ వీక్షణాలకి పాత్రులు కారనీ అన్నట్టు ప్రవర్తిస్తారు. పిల్లలు అందరూ పిల్లలే కదా? వాళ్ళ పిల్లలతో బాటు వేరే పిల్లల వైపు కూడా ఒక సారి చూస్తే పోయేదేముంది? అదీ, మనం మన పిల్లల్ని పక్కన పెట్టి వాళ్ళ పిల్లల్ని ముద్దు చేసినా కూడా!. పిల్లలతో నాకు బాగా నచ్చే నానుడి ఒకటి ఉంది (మా అమ్మగారు చెప్పినది) - "పిల్లల్ని చేరదీస్తే వస్తారు, కసిరితే పోతారు" అని. వాళ్లకి ఏమి తెలియదు కదా.. ఒక సారి తిట్టినా, వెంటనే పిలిస్తే భేషజాలు లేకుండా చిరునవ్వు మొహాలతో దగ్గరకి వచ...

పిల్లల్ని నిద్రపుచ్చడం

చంటి పిల్లలు సాధారణంగా రోజుకి ఇరవై గంటలు పడుకుంటారు (అది average అనుకోండి - కొందరు తక్కువ పడుకుంటారు. వాళ్ళ శరీరధర్మాన్ని బట్టి ఇది మారుతుంది). అందుకని వాళ్ళని పడుకోబెట్టడం అనేది సాధారణంగా మనం ప్రత్యేకించి చెయ్యాల్సిన పనిగా ఉండదు. నిద్రపోకుండా ఉంటే (ఒకటి-రెండు నెలలు ఉన్న పిల్లలు) కాళ్ళూ చేతులూ కదుపుతూ ఆడుకోవడమో, కబుర్లు చెబుతూ ఉండడం (ఉక్కు, ఉంగా లాంటివి), వస్తువులని చూస్తుండడం, మనుషులని ఫాలో అవుతూ ఉండడం చేస్తూ కాలక్షేపం చేస్తారు. ఐతే, కొన్నిసార్లు వాళ్లకి నిద్ర వచ్చినా తిక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు పడుకున్నంత సేపు ఎక్కడ ఉన్నారు అనేది తెలియదు కాని, ఏడిస్తే మాత్రం టాపు లేపెయ్యడం ఖాయం. వాళ్ళ ఏడుపులో "treble" పాలు ఎక్కువ ఉండడం వల్ల అది వినేవాళ్ళకి ఒక లెవెల్లో ఇరిటేషన్ కలిగిస్తుంది (మరి "bass" లో ఏడిస్తే ఎవరికీ వినిపించదని దేముడు ఆ సెట్టింగ్ ఇచ్చాడు అని మనం అర్ధం చేసుకోవాలి). ఇలా తిక్క ఏడుపు తీర్చడానికి మామూలు లాలిపాటలు, ఉయ్యాలల కంటే దగ్గరకి తీసుకొని పట్టుకోవడం ఉత్తమమని మా అనుభవం. మాకు పని చేసిన రెండు మూడు కిటుకులు: ఎత్తుకున్నప్పుడు మన మోచేతి ఒంపులో వాళ్ళ మెడ పైభా...

"అగులు" చెయ్యడం

Image
మనలో చాలా మందికి చిన్నప్పటి ఫోటోలలో ఒకటి కామన్ గా ఉంటుంది. అది - అబ్బాయైనా, అమ్మాయైనా, పాలుగారే పసిమోము మీద కనుబొమ్మల మధ్యలో పెట్టే నల్లటి అగులుచుక్క. దానిని మరి అందరూ అగులు అంటారో లేదో తెలియదు కాని, తూ గో లో మాత్రం అంటారని తెలుసు. పేరు ఏదైనా, అందాలొలికే ముద్దుల పాప మీద నుంచి దృష్టి మరల్చడానికి కొందరు, అలంకారం కింద కొందరూ, రెంటికిందా మరి కొందరు పిల్లలకి చుక్కపెడతారు. ఇప్పుడు కొంతమంది దానిమీద (చర్మానికి పడదు అనే) సందేహంతోనో, అగులు దొరక్కో, అది చెయ్యడం తెలియకో బొట్టుబిళ్ళలు, తిలకం వంటివి పెడుతున్నారు. సహజసిద్ధంగా తయారుచేసే అగులు చేసే హాని ఏమీ లేకపోగా, ఈ కెమికల్స్ తో చేసిన జిగుర్లు, తిలకాలు చర్మానికి చేటుచేస్తాయి. అందుకని అగులు చెయ్యడం ఎలాగో తెలుసుకుందాము. కావలసిన వస్తువులు: సగ్గుబియ్యం, మూకుడు (స్టైల్ గా "బాండీ"), అగ్గిపెట్టె, నీళ్ళు, టీ వడకొట్టుకునే చిక్కం (మెత్తటి (ఫైన్) జల్లెడ కూడా వాడవచ్చు). ముందుగా కొంచెం సగ్గుబియ్యం తీసుకొని, దానిని మూకుట్లో వేసి, చిన్న సెగమీద కలుపుతూ వేయించాలి. అది నల్లగా అయే వరకూ వేయించి, మూకుడుకి అంటుకుపోతుంది అనిపించే ముందు పొయ్యిమీదనుంచి దించాలి. ఆ త...

మనకి నోబుళ్ళు రావా?

మొన్న నోబెల్ ప్రైజులు ఒకటొకటిగా అనౌన్స్ అవుతూ ఉంటే "నోబెల్ ప్రైజులు అన్నీ అమెరికా వాళ్ళకీ యూరోప్ వాళ్ళకే వస్తాయేమో" అని మా నాన్నగారు అనడం నన్ను ఆలోచింపజేసింది. అదే సమయంలో శ్రీ వేమూరి వెంకటేశ్వర రావు గారు వ్రాసిన " భవిష్యత్తులో భారత దేశానికి మరో స్వర్ణ యుగం ఉందా? " అనే వ్యాసం చదవడం కూడా జరిగింది. అందులో ప్రస్తుత స్థితి కి కారణాలని చాలా బాగా విశ్లేషించారు. వాతావరణం తేలిక చెయ్యడానికీ కాదు కాని, ఇక్కడ ఒక సరదా జోక్ గుర్తుకి వస్తుంది: Sometimes I lie awake at night, and I ask, "Where have I gone wrong?"/ Then a voice says to me, "This is going to take more than one night." -Charles M. schulz ఈ జోకులో లాగా, కర్ణుడి చావు లాగా, దీనికి కోటి కారణాలు.వేమూరి గారు చెప్పిన విధం గా మన విద్య ఉద్యోగాలు సంపాదించడానికి, ఉన్న దానిని వాడుకోవడానికి (లాంగ్వేజ్ ఉపయోగించి ప్రోగ్రాం రాసినట్టు (vs. లాంగ్వేజ్ నే కనిపెట్టకుండా)) పనికొస్తోంది తప్ప, కొత్తది కనిపెట్టే దిశగా ప్రోత్సాహం మన దగ్గర తక్కువ. సమాజం లో కూడా ఎవరైనా ఏ డాక్టరేట్ ఓ చేస్తాను అంటే, అలాంటి వ్యక్తిని ఏదో ఇతరగ్ర...

"చైత్రా"గమనం - "హర్షా"తిరేకం.

Image

Breakfast that kids love:

Image
Here is something that worked with our 15 month old. We tried various recipes for breakfast - but one thing that kids always want is "change". If you try to give them something without a break, they turn away and you can never force them to eat - that is the rule. But well, there are exceptions to rules - such as this. Whole grains is always good, both for you and your kid. We took a couple of whole grain cereals - Raisin Bran and Honey Bunches of Oats. Mix them in equal amounts (dont worry if you dont stock up on both, it will work even if you choose one of these - but usually, the taste of "honey" in the Bunches of Oats helps them adapt to this quickly). Remove raisins from the Raisin Bran and Almond pieces from the Honey Bunches if you think he can't chew on them. Crush the cereal with your fingers so that it turns into little pieces (not so much as to make a powder). Add Soy Milk (Natural Silk, for example, as shown, which is available everywhere, need not n...

పిల్లలకి ఎత్తు మప్పడం, పేర్లు పెట్టడం

మప్పడం = నేర్పడం (అటూ ఇటూ గా) ఇది ఈమధ్యే మాకు అనుభవంలోకి వస్తోంది. పిల్లవాడిని తీసుకొని (అంటే ఎత్తుకొని) ఎక్కడికి వెళ్ళినా, ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలూ అయ్యాక, చాలా మంది (particular గా ఇప్పటికే మూడు నాలుగు ఏళ్ళ వయసు గల పిల్లలు వున్నవాళ్ళు) అడుగుతూ వుంటారు.. "ఆ .. ఏమిటీ.. మీ వాడికి ఎత్తు అలవాటు అయిపోయిందా" అంటూ. మొదట, ఎత్తు అలవాటు అయిందో లేదో మనం కలిసిన పది పదిహేను నిముషాలలో ఎలాగూ తెలియదు (అది వాళ్ళ గెస్ మాత్రమె) - రెండోది, ఎత్తుకోవడం ఏదో పెద్ద అపరాధం అయినట్టు, వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ పిల్లలని ఎత్తుకొని మొయ్యనట్టూ, ఎత్తుకోవడం అంటే వాళ్ళకి దొంగతనం నేర్పడం అంత పాపం అయినట్టూ అడుగుతారు :). ఎవరో మావాడు పుట్టిన మొదట్లో అన్నారు, కొంచెం వయసు వస్తే పిల్లలకి వ్యాపకాలు ఎక్కువ అయి (ఇది మంచిదే మరి) మన దగ్గర ఎక్కువసేపు కుదురుగా ఎలాగూ కూర్చోరు.. ఈ మొదటి ఒకటి రెండు ఏళ్ళలోనే వాళ్ళని తనివి తీరా దగ్గరకి తీసుకొని ఉంచుకోవాలి అని. అందులో నిజం ఎంత వున్నా, ఈ వయసులో తల్లితండ్రులే కాకుండా ఎవరు ఎత్తుకున్నా ఆ మానవ స్పర్శ వాళ్ళలో సురక్షాత్మక భావనను కలిగిస్తుంది. అంతవరకు ఎందుకు? మేమిద్దరం కూర్చొని వాడిని మధ్యలో వు...

తల్లి పాలు.

(ఈ టపా కి వ్యాఖ్యలు వ్రాసినవారందరికీ కృతజ్ఞతలు. వారి వ్యాఖ్యల వల్ల మరిన్ని అంశాలు జోడించడం జరిగింది)కిందటి సంవత్సరం జూన్ లో ప్రసారం చేసిన బాలు గారి పాడాలని వుంది రికార్డింగ్ చూస్తూ వుంటే ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. తల్లి పాలు అప్పుడే పుట్టిన పిల్లలకి చాలా మంచివి అనీ, మన వాళ్ళు (చాలా మంది) ఆ విషయం తెలుసుకోకుండా, పిల్లలు పుట్టిన వెంటనే తల్లి దగ్గర పాలు తాగనివ్వరనీ, దీనిని నిరోధించాల్సిన అవసరం ఉంది అని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నా మొట్ట మొదటి రియాక్షన్ ఏమిటంటే, అలా చేసే వాళ్ళని ఒక గది లో వేసి బంధించి "మా తప్పు తెలిసింది మహాప్రభో" అనేవరకూ రోజూ రెండు పూటలా ఇంత పచ్చగడ్డి పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది అమృతతుల్యమై, రోగ నిరోధక శక్తి ని కలిగించే తల్లి పాలు దూరం చేసి పిల్లలకి పోత పాలు పోస్తే వాళ్ళకి ఎలా వుంటుందో!!. అసలు బిడ్డ పాలు తాగకపోతే ఆ తల్లి కి ఎదురయే కష్టం కూడా (engorgement (పాలిండ్లలో పాలు నిండిపోయి నెప్పి పుట్టడం) వల్ల) వర్ణించనలవి కాదు. సృష్టి లో జరిగే ప్రతీ విషయం కూడా పరస్పర ఆధారితం గా జరుగుతుంది (Symbiosis). పురుడు వచ్చే సమయానికి తల్లికి పాలు ఉత్పత్తి కావడం, అప్పు...

పిల్లల బొమ్మల ఎక్సేంజ్

ఎప్పటినుంచో అనుకుంటున్న ఇలాంటిది ఏదో ఎక్కడో వుండాలి అని (మా పిల్లవాడు పుట్టిన మొదట్లో నేనే ఒక సైట్ పెట్టేద్దామా అని కూడా అనుకున్నా). ప్రపంచం లో ఫ్యాషన్ ల కంటే తొందరగా మారిపోయే వస్తువులు ఏమైనా వున్నాయి అంటే అవి తప్పకుండ పిల్లల బొమ్మలే. అప్పుడే పుట్టిన పిల్లలకి బొమ్మలు వేరు, నెల వయసు వారి బొమ్మలు వేరు, కొద్దిగా ఎదిగి రంగులు, జంతువులు గుర్తు పట్టే వయసు వచ్చే వారి బొమ్మలు వేరే, ఆడపిల్లల బొమ్మలు వేరు, మగ పిల్లల బొమ్మలు వేరు. పిల్లలు చూస్తుండగానే ఎదిగిపోయే లక్షణం కలవారు అవటం వల్ల, ఇవాళ కొన్న బొమ్మలు నెల రోజుల్లో (రంగు, షైనింగు చెడకుండానే) పాతబడిపోయి మళ్ళీ బొమ్మల దుకాణానికి వెళ్ళే పని పెడతాయి. అలా ప్రతీ తల్లితండ్రులు పదుల కొద్దీ (కొండొకచో వందల కొద్దీ) బొమ్మలు కొని ఇల్లు నింపుతూ వుంటారు. జ్ఞాపకాలు గా దాచుకుందామన్నా, కొద్ది రోజులు పోయేసరికి అవి కాలికి అడ్డం గాను, జేబుకి చిల్లు పెట్టిన శత్రువులు గాను కనిపించడం మొదలు పెట్టి వాటిని నెమ్మదిగా బయటకి తరలించడమో, లేక రీసైకిల్ వారికి ఇచ్చేయ్యడమో జరుగుతుంది. ఎవరికైనా ఇద్దామన్నా, వాళ్ళు వాడేసిన బొమ్మలు ఇస్తున్నారు అనుకుంటారు, "మా పిల్లలకి మేము కొనలేమ...

వ్యాయామ కండూతి

కండూతి అనే మాట ఈ వ్యవహారం లో వాడొచ్చో లేదో తెలియదు గాని, జంధ్యాల చెప్పినట్టు "మాట బాగుంది అని వాడేసాను". చాల ఆశ్చర్యం అనిపిస్తుంది. మా శ్రీహర్ష గాడు పుట్టి నాలుగు నెలలయింది. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, తిక్క వచ్చినా, తోచకపోయిన సరే, అప్రతిహతం గా కాళ్ళు, చేతులు అలా కొట్టేసుకుంటూనే వుంటాడు. చూడబోతే దేముడు మన శరీరం లో వ్యాయామానికి కావాల్సిన instinct అంతా program చేసి పంపిస్తాడు కామోసు. అందుకే (వీడే కాదు.. అందరు) పిల్లలూ ఇలా వీర లెవెల్లో కాళ్ళు చేతులు వూపేస్తూ మొత్తం శరీరాన్ని వ్యాయామం చేయిస్తూ వుంటారు :). కాలం గడిచే కొద్దీ (అంటే exercise అవసరం అయ్యే కొద్దీ) మనకి ఇహ లోక వ్యవహారాలు ఎక్కువ అయి, వ్యాయామానికి తిలోదకాలు ఇచ్చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాము అనిపిస్తుంది.