Sunday, May 8, 2011

అమ్మ

అమ్మ...
సృష్టిలో హాయైన పదం..
అర్ధం చెప్పాలనుకుంటే ఏమీ తోచని పదం...
తన త్యాగాలు రాయాలంటే పేజీలే సరిపోని పదం....

కలతనిదురలో లేచి ఏడిస్తే ఎంతటి నిద్రలోనైనా టక్కున లేచి గుండెలకు హత్తుకుంటుంది.
అల్లరి చేస్తే మందలిస్తుంది, తరువాత తనే దగ్గరకి వచ్చి ముద్దు చేస్తుంది.
తొలి గురువు తానై పాఠాలు చెబుతుంది,
పెద్ద చదువులు చదివి ఎదిగితే తనకన్నా కాస్త పొడవున్న ఆ బిడ్డని తలపైకి ఎత్తి చూసుకుంటూ గర్వంగా మురిసిపోతుంది.

కాస్త తొందరగా లేస్తే 'కాసేపు పడుకోకపోయావా?' అంటూ దగ్గరకొస్తుంది..
నేనూ ఒక తల్లినని, ఆవిడ తెల్లవారుఝామునే లేచి తన పిల్లలకోసం చేసినవి నేనూ నా పిల్లలకి చెయ్యాలి అన్న విషయం మరచిపోతుంది.
చిన్నప్పుడు నా బట్టలు అన్నీ తనే ఉతికిపెట్టింది,
ఇప్పుడు పుట్టింటికి వెళ్తే నా పిల్లల బట్టలు ఉతకడానికి పనిమనిషిని పెట్టింది.
అప్పడాలు, వడియాలు, ఊరగాయలు అంటూ మాకిష్టమైనవి చేస్తూ పరుగులు పెడుతుంది,
అవి ఎండబెట్టడానికి డాబా ఎక్కుతుంటే కాలికి తగిలిన దెబ్బకి రాత్రి మేమందరం పడుకున్నాక చీకటిలో కొబ్బరినూనె రాసుకుంటుంది.
పొద్దుటి అన్నం పెట్టుకుంటే 'హన్నా.. అరగదు' అంటూ మందలిస్తుంది,
నేను చూడకుండా ఆ అన్నం మజ్జిగలో కలిపేసుకుంటుంది.
'ఇక చాల్లే చేసిన పనులు, నిద్దర సరిపోదు, పడుకో' అంటూ నా చేతిలో పని లాక్కుంటుంది,
ఎన్ని ఏళ్ళు వచ్చినా సేవలు చేస్తూ తన మీద పడ్డ వయసును, తనకు కరువు అయిన నిద్దరను మరచిపోతుంది.

మన కష్టం తీర్చేది అమ్మ,
తన ఆనందం పంచేది అమ్మ,
తప్పుకి దండించేది అమ్మ,
దానికి మందువేసేది తన కంటి చెమ్మ.
ఇంతకంటే ఇంకేమి కోరగలదు ఈ మానవ జన్మ?

6 comments:

Madhuri said...

suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuper

Lakshmi Prasanthi said...

ఓ శాం'తమ్మా', "అమ్మ" అంటూ మా కంటికి పెట్టించావు చెమ్మ ..
నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే,
తల్లిని అన్న సంగతి మర్చిపోయి పుట్టింటికి వెళ్ళగానే మనం పిల్లలమైపోతాము
వయసు మీద పడ్డా పిల్లలోచ్చారు అన్న ఆనందం తో ఆవిడలోని తల్లి నిద్రలేస్తుంది.
ఆరోగ్యం కూడా చూసుకోకుండా పిల్లలకి అన్నీ చేసి పెట్టేయ్యాలనే అత్యాశకు పోతుంది.

అమ్మ ప్రేమకు ఒక మచ్చుతునక లాగ బాగా రాశావు.

Madhuri said...

suuuuuuper prasanthi nee kavitha kuda

Vani said...

Kavitha chala bagundi. Naaku baga nacchinadi edi.

"తప్పుకి దండించేది అమ్మ,
దానికి మందువేసేది తన కంటి చెమ్మ.
ఇంతకంటే ఇంకేమి కోరగలదు ఈ మానవ జన్మ?"

chala chala bagunde ee line.

Vani said...
This comment has been removed by a blog administrator.
గాయత్రి said...

chaala bagundi..