Posts

Showing posts with the label సినిమా

వేటూరి కి నివాళి.

ఈ రోజే వేటూరి గారి మరణ వార్త తెలిసింది. వరుడు ఆడియో రిలీజ్ లో, ఆ తరవాత మా టీవీ ఇంటర్వ్యూ లో ఆయన ఇంకా మాట్లాడుతున్నట్టే ఉంది - ఇంతలో ఎంత పని జరిగింది!. ఆయన పాట ఏది విన్నా "ఇది వేటూరి పాట" అని యిట్టె తెలిసిపోయే ముద్రలు ఆయన పాటల నిండా ఎన్నో. ముఖ్యం గా ఒకే పదానికి రెండు అర్ధాలు వచ్చేలా వెంట వెంటనే రెండు లైన్స్ లో రాయడం.. ఎన్ని వేల పాటలు రాసిన, ఎన్ని విధాలుగా ఎన్నో పదాలని వాడినా, ప్రతీ కొత్త పాటలోనూ మళ్ళీ ఇంకో కొత్త పద ప్రయోగం తో ముందుకొచ్చి మనల్ని ఆశ్చర్యపరచం ఆయనకీ వెన్నతో పెట్టిన విద్య. కోరుకునే వాళ్ళ అభిరుచి, విజ్ఞత లని అనుసరించి ఎవరు ఏది అడిగితే వారికి అది రాసిపెట్టే లక్షణం ఆయన సొంతం. అందుకే కొన్ని పాటలు వింటే "ఈయన ఇలాగే రాస్తాడు" అని విసుక్కున్నా, వెంటనే మరో ఆణిముత్యం లాంటి పాటతో మనల్ని మురిపించి "ఆ ముందు పాట పాపం నాతో రాయించుకున్న వాళ్ళదే కాని నాది కాదర్రా" అంటూ చెబుతున్నట్టు అనిపిస్తుంది. నిన్నే ఈ మధ్య ప్రసారం అయిన "పాడుతా తీయగా" చూస్తుంటే అందులో "యమహా నగరి" పాట గురించి మణిశర్మ చెప్పారు - ఆ పాట ని ముందుగా రెండు చరణాలు గానే రాసారనీ, రి...

మా ఊరిలో చంద్రబోస్ గారు

Image
జూలై నాలుగున జరిగిన తానా సభలకి వచ్చిన శ్రీ చంద్రబోస్ గారు మా ఊరు (డేటన్) కి నిన్న (7/6/2009) విచ్చేశారు. ఇక్కడ ఉండేది పన్నెండో తారీఖు వరకు మాత్రమే అయినా, మధ్యలో మళ్ళీ వేరే ఊర్లలో మరిన్ని ప్రోగ్రాములున్నా, ఒక్క రోజే నోటీసు ఇచ్చి తొందర పెట్టినా సరే, పెద్దమనసు చేసుకొని మాదగ్గరకి రావడం మాకు సంతోషం కలిగించింది. మా ఊరి మొనగాళ్ళు, ముఖ్యంగా విజయ్ బొర్రా, శ్రీనివాస్ భవనం, ఫణి తెల్లా ఒక పట్టుపట్టి, ఒక్కరోజులో మొత్తం ఊరిలో ఉన్న చాలామందికి ఈ విషయాన్ని చేరవేసి, సాహిత్యాభిమానుల్ని బాగానే కూడగట్టారు. చంద్రబోస్ గారు పాటల రచయితగానే కాకుండా, ఈమధ్య ఐడియా సూపర్ సింగర్ లో న్యాయనిర్ణేతగా మనటీవీల ద్వారా ముందు మన ఇళ్ళలోకి, తరవాత ఆ కార్యక్రమంలోని తన సహజ, సుతిమెత్తని ప్రవర్తనద్వారా మా హృదయాలలోకి చొచ్చుకొని రావడం కూడా ఎక్కువమంది ఈ ప్రోగ్రాంకి రావడానికి సహాయం చేసింది. వారిని మంగళ వారం పొద్దున్నే ఊరికి తీసుకొని వచ్చి మా ఊరిలో ఉన్న ఏకైక ఆకర్షణ ఐన ఎయిర్ ఫోర్స్ మ్యూజియంకి తీసుకొనివెళ్లి (తెలియదు కాని, లోపల అంతాకలిపి ఒక రెండు మూడు మైళ్ళు నడక ఉంటుంది) బాగా తిప్పి తీసుకొనివచ్చాడు భవనం. మరి సాయంత్రం ప్రోగ్రాంకి భోజనాలు అ...

బిర్యానీ పాటలు..

ఈ మధ్య నాకు బాగా నచ్చిన పాటల్లో ఈ ఆవకాయ్ బిర్యాని పాటలున్నాయి. ముందు విన్నప్పుడు సంగీతం బాగుందనీ, పాటలు బాగా పాడారు (ముఖ్యం గా కార్తీక్ వల్ల) అని అనిపించింది - కానీ, వినేకొద్దీ ఈ పాటల లోతు మరింత తెలవడం మొదలు పెట్టింది. సంగీత దర్శకుడు మణికాంత్ saxophone ప్లేయర్ ఏమో తెలియదు - మరి అలా కావడం వల్లో, లేదా, తన తండ్రి (కద్రి గోపాలనాధ్) saxophone విద్వాంసుడు కావడం వల్లో తెలియదు.. చాలా పాటల్లో రాగాలన్నీ (రాగం అంటే, పాట base అయిన రాగం కాదు - పాటలో గాయకులు "తీసే" రాగం) ఎంతో చక్కగా, సాఫ్ట్ గా, saxophone తో వాయించినట్టు వీనులవిందు గా వున్నాయి. ఇంకొన్ని సార్లు వినేకొద్దీ ఈ tunes అన్నీ కూడా చాలా కాంప్లెక్స్ గా అనిపించడం మొదలు పెట్టాయి. అంటే, సంగీత పరం గా కాదు (అవునేమో నాకు తెలియదు), సాహిత్యాన్నీ ఎంతో చక్కగా, ముందు రచయితకి చాలా స్వతంత్రం ఇచ్చి రాయించినట్టు, తరవాత ఆ సాహిత్యాన్ని, భావం కోల్పోకుండా tunes లో అత్యంత ప్రతిభ తో సర్దినట్టు, ఇంక ఏమేమో!!. అప్పుడు ఈ సాహిత్యాన్నీ మరికొంచెం క్లోజ్ గా వినడం మొదలు పెట్టాను.. వనమాలి పాటలు ఇదివరకు విన్నాము కానీ, ఇంట భావగర్భితం గా వ్రాయడం చూడలేదు.. భవిష్యత్తుల...

బొమ్మన చందన..

(ఇది వ్రాసి చాలా రోజులు అయిపొయింది కానీ, అభిప్రాయం మాత్రం మారలేదు). వీకెండ్ లో బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ సినిమా చూసాము. EVV సమర్పించేసుకున్నాడు అని తెలియగానే కొంచెం ఖంగారు పడిన మాట వాస్తవమే కాని, ఇతర ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరూ లేకుండా మేమిద్దరమే చూడడం వల్ల ప్రమాదం ఏమి లేదు అని సమాధానపడి కూర్చున్నాము. సినిమాని కొంచెం నెమ్మదిగా మొదలు పెట్టినా, మధ్య మధ్యలో కొంచెం బోర్ కొడుతోందేమో అని అన్పించినా, మొత్తానికి కామెడీతో చాల బాగా నెట్టుకొని వచ్చేసాడు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి. అల్లరి నరేష్ శ్రీరామదాసు పేరడీ కొంచెం తగ్గించినా పెద్ద ప్రాబ్లం ఏమి అయి వుండేది కాదు. కొంచెం శ్రుతి మించుతోంది అనిపించగానే అది వదిలేసి కధలోకి వచ్చాడు. కృష్ణ భగవాన్ ఎప్పటిలాగే సంభాషణల రచయిత బలం మీద నెగ్గుకొని వచ్చేసాడు. ఐతే, కొన్ని పంచ్ లు ముందుగా వ్రాస్తారో లేక కృష్ణ భగవాన్ అప్పటికప్పుడు పుట్టిస్తాడో తెలియదు గాని, చెవులు రిక్కించి వింటే తప్ప వినపడని పంచులు చాల వాడేడు సినిమాలో. కోవై సరళ ఓవర్ ఆక్షన్ చెయ్యకుండా భరణి successful గా అడ్డు పడ్డాడు అనే చెప్పాలి. సినిమా చివర్లో మాత్రం ఆవిడ కామెడీ బాగా చేసింది. రెగ్యులర్ కమెడియన్...

కొత్త బంగారు లోకంలో..

నాకైతే ఇందులో పాటలు వింటుంటే భలే నిద్ర వస్తుంది. ముఖ్యం గా, "నిజంగా నేనేనా", "నేనని నీవని", "నీ ప్రశ్నలు" పాటలు వింటుంటే, అందులోనూ "నేనని నీవని" తో ఐతే మరీను. (ఈ పాటలు ఎలా వుంటాయో చాలామందికి ఈ పాటికి తెలిసి వుండడం, ఎక్కడైనా అప్లోడ్ చేయడం వల్ల పైరసీ ని పెంచిపోషించడం అవడం వల్ల ఆ mp3 లు ఇవ్వడం లేదు - రాగలహరి లాంటి చోట్ల ఎలాగు రియల్ ప్లేయర్ వెర్షన్ లు వున్నై కదా). "నీ ప్రశ్నలు" లో ఐతే బాలు గారు "బతుకంటే బడి చదువా..." అంటూ దీర్ఘం తీస్తుంటే అప్పుడే నిద్ర లేచిన వాడు కూడా మళ్ళీ deep sleep లో పడిపోయే అవకాశం ఎంతైనా వుంది. మొత్తానికి మిక్కి J మాయర్ నిలదొక్కుకునే మ్యూజిక్ డైరెక్టర్ లాగానే కనిపిస్తున్నాడు నాకు. హ్యాపీ డేస్ లో కొన్ని పాటలకి ఒకే బాణీని ఉపయోగించినా వెరైటీ చూపించాడు. కొత్త బంగారు లోకంలో మాత్రం అన్ని పాటలు వినసొంపుగానే వున్నాయి (కొన్ని సంగీతం, సాహిత్యం రెండూ బాగుంటే, మరికొన్ని సంగీతమే). "కళాశాలలో" పాట ఏ అనంతశ్రీరాంకో, రామజోగయ్యశాస్త్రికో ఇవ్వాల్సింది అనిపించింది. డైరెక్టర్ తన సినిమాలో పాటలు తనే రాసెయ్యడం అనే ప్రయత్నం ...

సెన్సార్ కత్తెర

సెన్సార్ కత్తెరని ఈమధ్య మార్కెట్ లోకి తీసుకొని వెళ్లి పదును పెట్టించి తీసుకొని రావడానికి ప్రయత్నాలు జరిగాయని తెలిసి సంతోషించాను. దాని వల్ల ఏమి ఒరుగుతుంది, ఏమి ఒరగదు అనేదానికన్నా ముందు, ప్రయత్నం జరగడం హర్షణీయం. అందులో నాకు నచ్చినవి రెండున్నాయి. ఒకటి కులం పేరు మీద వ్యంగ్యం, లేదా కులానికి సంబంధించిన రెఫెరెన్సుల మీద సీరియస్ గా వుండాలి అని నిర్ణయించుకోవడం. బయట కొట్టుకు చచ్చేది కాక మళ్ళీ సినిమాలలో కూడా కులం గోల ఎందుకు? మనం సినిమాలలో చూపించేది (చెడు మాత్రం) తు.చ. తప్పకుండ పాటించడానికి ఏళ్ళనుంచీ అలవాటు పడ్డాము. మంచి చెప్పకపోతే పోయే, చెడు నేర్పకుండా వుంటే చాలు అనుకునే టైం వచ్చింది. ఇది కొంచెం స్లో పాయిసన్ లాంటిది. వెంటనే effect చూపించకపోయినా, సమాజంలో మనం ప్రవర్తించే తీరుని తప్పక ప్రభావితం చేస్తుంది. అందుకని, దానిని కొంచెమైనా కంట్రోల్ చేద్దామని అనుకోవడం మంచిదే. రెండోది వ్యక్తుల physical disabilities ని వెక్కిరించే పిలుపులు, తిట్లు. "పోట్టోడా, గుడ్దోడా, కుంటోడా, ముసలోడా" లాంటి పిలుపులు. ఎవడైనా ఇంకొకడిని వాడి రూపు రేఖలని, అవిటి తనాన్ని బట్టి పిలవడం ఒక మానసికరుగ్మత!. ఏం? ఇవాళ చక్కగా ఉన్...

సిరివెన్నె(ఎ)లా?

ये जिंदगी నడవాలంటే हस्ते हस्ते నదిలో దిగీ ఎదురీదాలి అంతే అంతే హిరోషిమా ఆగిందా ఆటం బాంబేస్తే चल चकदे चकदे అంటే పడినా లేచొస్తామంతే హకూనా మటాటా అనుకో తమాషగా తలవూపీ వెరైటీగా శబ్దం విందాం అర్ధం కొంచెం సైడ్ కి జరిపి అదే మనం తెలుగు లో అంటే, dont worry bee haapee మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి ... ఆగండాగండి.. సీతారామ శాస్త్రి గారు.. ఏమిటండీ ఇది? "dont worry be happy" అనే వాక్యాన్ని తెలుగు అనుకోమంటారా (మళ్ళీ "మన" తెలుగు అని కూడా అన్నారు)? మీరు రాసింది త్రివిక్రమ్ తిరగారాశాడా లేక దేవిశ్రీ దిద్దుబాటు చేశాడా లేక మీకే అలా అనిపించిందా?? బాగుంది!! :).

బాలు పుట్టిన రోజు

ప్రేమ రసాంత రంగ హృదయంగమ సుంగ సుభంగ రంగ బహు రంగధ భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప ప్రుదు సంఘ విభంగా.. దీనిని అంతటినీ ఒకే గుక్కలో మధ్యలో ఊపిరి తీసుకోకుండా చదవండి చూద్దాం? కొంచెం కష్టం అయినా చదివేసారు కదా? సరే.. ఇప్పుడు రామదాసు సినిమా లో "దాశరథీ! కరుణా పయోనిధీ" పాటలోలా పాడడానికి ప్రయత్నించండి. "అబ్బో" అంటారా? ఐతే మరి దానిలో భగవంతుడినే నిలదీస్తున్నట్టు అనిపించే భావాన్ని కూడా పొందు పరచి, రాగా తాళ యుక్తంగా పాడడం అనేది ఊహకి కూడా అందదు. అందులోనూ, 62 ఏళ్ళ వ్యక్తి ఆపని చేసాడు అంటే, అతనికి తన వృత్తి పట్ల ఎంత అంకిత భావం వుంటే, పాడుతున్న పాటలో ఎంత మనసు లగ్నం చేస్తే అది సాధ్యం అవుతుంది? ఎవరి గురించి చెబుతున్నానో తెలిసిందిగా? తన వయసులో సగం కూడా లేని కుర్ర హీరో లకి కూడా తన "లేత" గొంతు తో పాడిన చక్కటి పాటతో అందాన్ని అద్దగలిగే "మన" SP బాలసుబ్రహ్మణ్యం గురించి. ఎవరికి వారికి "ఇతను నా గొంతుతోనే పాడేడు" అనిపించినా, సినిమా లలో కమెడియన్ వేషాల నుంచి విలన్ వేషాల వరకు వేసి శహభాష్ అనిపించుకున్నా, మ్యూజిక్ డైరక్షన్ చేసినా, ప్రయోక్తగా పని ...

డాన్ - మిస్టర్ మేధావి - అత్తిలి సత్తిబాబు LKG

లాంగ్ వీకెండ్ కావడం వల్ల కిందటి వారాంతం లో మూడు సినిమా లు చూడడం తటస్థించింది. మేము అనుకొని చూడలేదు గాని, మూడూ మూడు రకాలైన సినిమా లు దొరికాయి. డాన్ లో చెప్పుకోడానికేమీ పెద్దగా కనిపించలేదు. లారెన్స్ స్టైల్ లో పగలు రాత్రీ తేడా లేకుండా సినిమా లో ప్రతీ పాత్రధారీ (హీరోయిన్ లు తప్ప) "చలవ" కళ్ళజోళ్ళు వాడేస్తూ ప్రాణం అంటే లెక్క లేనట్టు ఒకళ్ళని ఒకళ్ళు తుప్పు తుప్పుమని కాల్చేసుకుంటూ వుంటారు (తుపాకీ లతో). నాగార్జున వెనకాలే వున్నట్టు కనిపిస్తున్నా, అవకాశం వచ్చిన ప్రతీ సారి (కొండొకచో అవకాశం సృష్టించుకున్న ప్రతీ సారీ) లారెన్స్ ముందుకు వచ్చి తన నేటివిటి కి సంబంధించిన ఓవరాక్షన్ తో మనల్ని అలరించడానికి ప్రయత్నించాడు. నాగార్జున జుట్టు దువ్విన విధానం వల్లనో ఎందుకో, కొంచెం వయసు, నుదుటి మీద ముడతలు కన్పించాయి (నాకు తెలియదు. మరి డాన్ అంటే అలాగే వుండాలేమో!!). ఈ సినిమా అంతటిలోకి మాకు నచ్చిన వ్యక్తీ విలన్ గా నటించిన కెల్లీ జార్జి. "నటుడు అనే వాడికి భాషా బేధాలు లేవండి.. వాళ్ళని ఏదో భాషలో నోరు కదపమని చెప్పండి.. మనం డబ్బింగ్ లో చూసుకుందాము" అని అనే భావ దారిద్ర్యం తో కొట్టు మిట్టాడే ప్రొడ్యూసర్ లు...

భలే భలే ఇలియానా

నిన్న రాత్రి వచ్చింది ఈ ప్రోగ్రాం. ఏంఖర్: ఈ సినిమా లో మీ క్యారెక్టర్ ఏమిటి? ఇలియానా: నాది చాల బబ్లి క్యారెక్టర్ (సైడ్ లో వ్రేలాడుతున్న జుట్టు మొహం మీద పడకపోయినా సరే చేతితో వెనక్కి తోసుకుంటూ.. మళ్ళీ గట్టిగా తోస్తే ఎక్కడ వెనక్కి వెళ్ళిపోయి ముందరకి రాదో అన్నట్టు, కొంచెం తోసీ తోయ్యనట్టు గా లైట్ గా). ఏం: How did you enjoy acting in the movie? ఇలి: I enjoyed a lot. ఏం: మీరు తెలుగు లో చాలా సినిమాలు చేసేసారు కదా.. మరి తెలుగు లో ఎప్పుడు మాట్లాడడం మొదలు పెడతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.. ఇలి: (English లో నే లెండి) ఒకప్పుడు నేర్చుకుందాము అనుకున్నాను కాని, (తెలివైన ప్రేక్షకులు) ఖతర్నాక్, ఆట ఫ్లాపు చెయ్యడం తో ఇంట్రస్టు పోయింది. మళ్ళీ ఇప్పుడు జల్సా ఆడుతోంది కదా నేర్చుకోడానికి ట్రై చేస్తా. ఏం: How did you enjoy acting with lover boy Tarun? ఇలి: Lover boy ఆ.. ("ఇంకా ఈ జుట్టు మీద పడదేమిటీ? - నేను వెనక్కి నెడదాము అనుకుంటుంటే" అనుకుంటూ) ఏం: అదేనండీ.. ఇక్కడ అందరికీ తరుణ్ లవర్ బాయ్ కదా!. ఇలి: I enjoyed a lot. ఏం: ఇప్పుడు మీరు తెలుగు లో అందరికంటే ఎక్కువ రేమునేరషన్ తీసుకుంటున్నారు కదా.. ఇలి: wo...

జల్సా ఖర్చు

నిన్నటి ఐడిల్ బ్రెయిన్ లో శ్రీనివాస్ కంచిభొట్ల వ్రాసిన వ్యాసం లోంచి ("GRE English" పదాలు ఉపయోగించి రాసే చాలా పొడవైన వాక్యాలని మినహాయిస్తే ఇతడు వ్రాసే ఆర్టికల్స్ నాకు నచ్చుతాయి :) ): "The producer needs to be rapped on the knuckles for letting the production run amuck." అంటే, ఏమంటున్నారంటే, అల్లు అరవింద్ ని మాస్టారు బల్ల దగ్గర కి రమ్మని, చెయ్యి తిరగవేసి వుంచి, వేళ్ళ మీద బెత్తం తో (లేదా స్కేల్ తో) "ఈ సినిమా కి ఇన్ని కోట్లు పెట్టడం తప్పేనా?" అంటూ రెండు మూడు వెయ్యమని. ఊహించుకుంటే భలే నవ్వు వస్తుంది. అరవింద్ అన్నాను కాబట్టి నవ్వుతున్నాం కాని, చిన్నప్పుడు కొంతమంది శాడిస్ట్ మాస్టర్లు మా క్లాస్ లో పిల్లల్ని ఇలా శిక్షిస్తే నాకు పిచ్చ కోపం వచ్చేది. తలుచుకుంటే ఇప్పటికీ వస్తుంది. మనసు లో నే శాపనార్ధాలు పెట్టేవాడిని. కొంతమందికి తగిలే వుండొచ్చు. ఐతే ఇప్పుడు అలాంటి వాళ్ళు తగ్గారు అనే అనుకుంటాను. Figurative గా రాసేరు కాబట్టి కంచిభొట్ల మీద కోపం లేదు లెండి :).

మంత్ర - ఎ ఫిల్మ్ బై అరవింద్?

మొత్తానికి మొన్న మంత్ర చూశాము. "ఇన్నాళ్లకా" అనుకోకండి. ఏ వంట చేసుకుంటూనో, పిల్లాడిని అడిస్తూనో సినిమా లు చప్పరించెయ్యడం కంటే, కాస్త తీరిక దొరికినప్పుడు, చక్కగా కూర్చొని, దృష్టి పెట్టి చూడడం అంటే మాకిష్టం వల్ల డీవీడీ వచ్చే వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. అందులోనూ, హారర్ సినిమా లు ఫుల్ సౌండ్ తో భయపడుతూ చూస్తే బాగుంటుంది కదా! ... (మీరు ఇప్పటికీ చూడకపోతే కింది పేరా చదవద్దు). ఈ సినిమా కి, ఇదివరలో వచ్చిన "ఎ ఫిల్మ్ బై అరవింద్" కి పోలికలు కనిపించాయి (క్లైమాక్స్ లో ఐతే తప్పకుండా). ఐతే ఈ సినిమా లో ఎవరు చేసారో చెప్పి, ఎందుకు చేసారో విశదం చెయ్యడం వల్ల సినిమా ని పూర్తి గా చూసి, ఆ మిస్టరీ ఏదో మనమే సాధించిన ఫీలింగ్ వచ్చింది. (అరవింద్ లో చివర్లో విలన్ ఫలానా అని చూపించారు కాని, అలా ఎందుకు జరుగుతోంది అన్న విషయం మీద వివరణ లేదు). దానికి తోడు, సంగీత పరంగా, నటన పరంగా కూడా ఈ సినిమా ఒక ఆకు ఎక్కువ చదివింది అని చెప్పవచ్చు. కధ జరుగుతున్నంత సేపూ, అత్మహత్యలని కూడా "దెయ్యమే" చేసింది అనుకోవడం, చివర్లో ఆ మిస్టరీ ని చేదించడం కూడా బాగుంది. ఒక దశలో మంత్రే దెయ్యమని మనల్ని ఆల్మోస్ట్ నమ్మిస్తా...

మేము పోటీ లో లేము!.

మా టీవీ సినిమా అవార్డ్స్ ప్రోగ్రాం చూసి, అనురూప్ గారి బ్లాగ్ చదివిన తరవాత ఇది రాయాలనిపించింది. ఎన్టీఆర్ చేసిన పని కొంచెం అనాలోచితం గా అనిపించినా, ముందు అసలు చిరంజీవి, నాగార్జున లు "మేము మా టీవీ యాజమాన్యం లో వుండడం వల్ల మా సినిమా లను పోటీలో వుంచవద్దని నిర్ణయించుకున్నాము" అని చెప్పడం ఎంత వరకు సమంజసమో చూడాలి. ఇదేమైనా పట్టు చీరాల షో రూం లో సంక్రాంతి బంపర్ ప్రైజ్ మారుతి కార్ గురించో, ఒక లక్ష రూపాయల నగదు గురించో అయితే "ఈ షాప్ లో పని చేసే వాళ్ళు పోటీ కి అనర్హులు" అని చెబుతారు. ఐతే ఈ అవార్డు లు నిజం గా ప్రజలు వోట్ చెయ్యడం వల్ల ఇచ్చేవే అయితే ఇంక సమస్య ఏమి వుంది? అంతగా కావలిస్తే ఏ సినిమా/హీరో కి ఎన్ని వోట్లు వచ్చాయో ప్రకటిస్తే పోయేది!. అన్ని సినిమా లు పోటీ లో వుంటే, ఇచ్చే వాళ్ళకి, తీసుకునే వాళ్ళకి ఆ "తుత్తి" దక్కి వుండేది :). ఇది చదివినందుకు బోనస్: హేమంత్ (మా టీవీ లో భలే ఛాన్స్ నుంచి) షో లోని ఒక పోటీదారు తో "చూడమ్మ.. ఇప్పుడు ఇదే పాటని, మన దగ్గర బనీను లాంటి పొడుగు షర్టు లు వేసుకొని, మెళ్ళో కుక్క గొలుసులు కట్టుకొని వుంటారు చూడు, వాళ్ళ లాగ - rap స్టైల్ లో పాడాలి...

జల్సా ఆడియో సంరంభం

నిన్న రాత్రి మధుమాసం (ఈ సినిమా గురించి చూసిన తరువాత రాస్తాను) చూసిన తరువాత ఏమి లేస్తాములే అని టీవీ ముందర కూర్చునేసరికి జల్సా సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షను రావడం మొదలు అయ్యింది "మా" లో.. ఈ మధ్య ఆడియో ఫంక్షన్స్ కూడా శతజయంతి ఉత్సవాలలాగా జరగడం (అందులో పెద్ద హీరో లవి అయితే మరీను) సాధారణం అయింది కాబట్టీ ఇది కూడా ఇంచు మించు అలాగే వుంటుంది అని అనుకున్నాను. దానికి తగ్గట్టు గానే అభిమానులు, సినిమారంగ ప్రముఖులతో బాటు చిరు, ఆయన కుటుంబ సభ్యులు కూడా అందరూ హాజరయ్యారు. కొన్ని డాన్సులు, మధ్య మధ్య లో అలీ, సునీల్ ల కబుర్లతో కార్యక్రమం నడిచింది. సునీల్ ఎందుకో (అంటే మరీ అసాధారణం కాదు గానీ ఆయన ఎప్పుడూ బయట వుండేప్పుడు సినిమాల లో వుండేంత ఫ్రీ గా, కామెడి గా వుండడం చూడలేదు - ఎందుకో చాల uncomfortable గా వుంటాడు వేదికలపై (నేను కూడా సునీల్ ఫ్యాన్ నే నండీ.. కాకపోతే మరి నిజం చెప్పాలి కదా)) కొంచెం out of place గా కనిపించాడు. అలీ పాత్ర ఏమిటంటే ఈ సినిమా గురించి నెగటివ్ గా మాట్లాడడం ( కావాలనే అనుకోండి) - మిగిలిన వాళ్లు వచ్చి ఆయనకీ సమాధానం చెప్పడం లాగ design చేసారు ప్రోగ్రాం ని. కొన్ని సందర్భాల్లో (ఈ సినిమా తియ్యడ...