Posts

Showing posts with the label అభిప్రాయాలు

బొడ్డుతాడు లో బంగారం

Image
చాలా మంది మిత్రులతో, తెలిసినవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం దొర్లుతూ వుంటుంది - ముఖ్యంగా ఇక్కడ (అమెరికా లో). "పిల్లలు పుట్టినప్పుడు మూలకణాలు (స్టెం సెల్స్) దాచాలా వద్దా అని ఆలోచిస్తున్నాము" అని, "మీరు దాచారా" అనీ. తెలియని వాళ్ళ కోసం (మళ్ళీ తర్జుమా లో అర్ధం మారిపోకుండా చూసింది చూసినట్టు) - courtesy http://www.cordblood.com/cord_blood_faqs/cord_blood.asp : Cord blood is the blood that remains in your newborn's umbilical cord after birth. Cord blood, like bone marrow, is an invaluable source of a type of stem cell that can be used in a variety of medical treatments. Stem cells are the body's "master cells" because they are the building blocks of organ tissue, blood, and the immune system. Stem cells from bone marrow were first used to regenerate blood and immune cells for patients who had received chemotherapy for cancer. In the late 1980s, doctors started using cord blood stem cells to treat diseases that had previously been treated with bo...

6:21 కారు.

6:21 కారు అంటే ఇదేదో ఫస్ట్ బస్సు టైం కాదు (మా నాయనమ్మ గారు బస్సు ని "కార్" అనేవారు - ఆ కాలం నాటి చాలామంది లాగే). మేము ఉన్న కమ్యూనిటీ లో ఒక పొరుగాయన ఉన్నాడు. వాన రానీ, మంచు పడనీ, కొంపలు మునిగిపోనీ - వీకెండ్ ఐతే తప్ప, ప్రతీ రోజూ పొద్దున్న ఆరుగంటల ఇరవై ఒక్క నిముషం అయ్యేసరికి కార్ స్టార్ట్ చేసి, గరాజ్ లోంచి బయటకి తీస్తాడు (6:21 ఏమిటో పెళ్లి ముహూర్తం లాగ అనిపిస్తుంది నాకు - అలా అనుకుందాము అంటే, ఇండియా వాడు కూడా కాదు). ఆ కార్ స్టార్ట్ చేసింది మొదలు, మఫ్లర్ (మనం సైలెన్సర్ అంటాము కదా - అదేలెండి - పొగ గొట్టం) చిల్లులతో జల్లెడ అయిపోయినట్టు ఉంది - గుర్రు మంటూ మంచి కోపం మీద ఉన్న కుక్కలాగా శబ్దం చేస్తూ ఉంటుంది. మనం ఇంట్లో ఎక్కడ ఉన్నా, అన్ని తలుపులూ, కిటికీ లు వేసి ఉన్నా సరే అది వినిపిస్తుంది. అది వినిపిస్తే 6:21 అయినట్టు లెక్క - 6:21 అయితే అది వినిపించాలని లెక్క. నేను కొన్ని ఏళ్ళ నుంచి 6:15 కి లేచి ఆఫీసు కి ఎనిమిదింటికల్లా వెళ్లాలని ప్రయత్నిస్తున్నాను కదా ("ఇదెప్పుడు చెప్పావు" అంటారా? ఇప్పుడే). అందుకని 6:21 కి పక్క మీద దొర్లుతూ "ఆ 8 కి ఆఫీసు కి వెళ్ళే పని రేపటినుంచి మొదలు ప...

"స్వరపేటిక" మీద అదుపు

కొంతమంది ఏమి అంటున్నామో అని చూసుకోకుండా ఎంతొస్తే అంత గబుక్కున అనేస్తుంటారు. అవతలి వారి మీద అది ఎలా పని చేస్తుందో అని ఒక్కసారైనా ఆలోచిస్తే వాళ్లకి ఈ మాటల వల్ల కలిగే బాధని కొంతైనా నివారించవచ్చు. మనిషికి దేముడిచ్చిన పెద్ద ఆయుధం నోరే. రాయిని ఎలాగైతే దేముడి బొమ్మ చెయ్యడానికీ, ఇంకోడి తల బద్దలు కొట్టడానికీ వాడొచ్చో అలాగే, దీనిని కూడా ఇంకొకళ్ళని ఆహ్లాదపరచడానికీ (ఫీల్ గుడ్ చెయ్యడానికి), బాధ పెట్టడానికీ సమానంగా వాడొచ్చు. విషయం ఏమిటంటే కిందటి శనివారం ఒక స్నేహితుల ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి అని పిలిచేరు, వెళ్ళాము. పదిన్నరకి వ్రతం అని పిలిస్తే చాలామంది భోజనానికి మాత్రమే పిలిచినట్టుగా నెమ్మదిగా లేచి పన్నెండు అయిందో లేదో చూసుకొని మరీ వచ్చారు అనుకోండి. అందులో కొంతమంది ఆస్తికులు వస్తూనే , "వ్రతం అయిపోయిందా (లేదా)" అని కూడా confirm చేసుకోవడానికి ప్రయత్నించారు. మా మటుకు మాకు ఎవరైనా ఇటువంటి సందర్భాలలో పిలిస్తే వాళ్ళు పీటల మీద కూర్చొనే సమయానికి వెళ్ళి కాస్త వాళ్ళని సంతోషపెట్టాలని వుంటుంది. ముఖ్య కార్యక్రమం వ్రతం కదా!. బిక్కుబిక్కుమంటూ భార్య, భర్త కూర్చుని ఒక పక్క "ఎవరూ రావట్లేదు" అన...

మనకి నోబుళ్ళు రావా?

మొన్న నోబెల్ ప్రైజులు ఒకటొకటిగా అనౌన్స్ అవుతూ ఉంటే "నోబెల్ ప్రైజులు అన్నీ అమెరికా వాళ్ళకీ యూరోప్ వాళ్ళకే వస్తాయేమో" అని మా నాన్నగారు అనడం నన్ను ఆలోచింపజేసింది. అదే సమయంలో శ్రీ వేమూరి వెంకటేశ్వర రావు గారు వ్రాసిన " భవిష్యత్తులో భారత దేశానికి మరో స్వర్ణ యుగం ఉందా? " అనే వ్యాసం చదవడం కూడా జరిగింది. అందులో ప్రస్తుత స్థితి కి కారణాలని చాలా బాగా విశ్లేషించారు. వాతావరణం తేలిక చెయ్యడానికీ కాదు కాని, ఇక్కడ ఒక సరదా జోక్ గుర్తుకి వస్తుంది: Sometimes I lie awake at night, and I ask, "Where have I gone wrong?"/ Then a voice says to me, "This is going to take more than one night." -Charles M. schulz ఈ జోకులో లాగా, కర్ణుడి చావు లాగా, దీనికి కోటి కారణాలు.వేమూరి గారు చెప్పిన విధం గా మన విద్య ఉద్యోగాలు సంపాదించడానికి, ఉన్న దానిని వాడుకోవడానికి (లాంగ్వేజ్ ఉపయోగించి ప్రోగ్రాం రాసినట్టు (vs. లాంగ్వేజ్ నే కనిపెట్టకుండా)) పనికొస్తోంది తప్ప, కొత్తది కనిపెట్టే దిశగా ప్రోత్సాహం మన దగ్గర తక్కువ. సమాజం లో కూడా ఎవరైనా ఏ డాక్టరేట్ ఓ చేస్తాను అంటే, అలాంటి వ్యక్తిని ఏదో ఇతరగ్ర...

తెలుగునాడి

మే-జూన్ 2009 తెలుగునాడి సంచిక సంపాదకీయం చూసి ఖంగారుపడ్డాను. అందులో, తెలుగునాడి వచ్చేనెల నుంచి రాదనీ, ఇంత తక్కువ ఆదరణతో పత్రిక నడపడం సాధ్యం కాదనీ తెలియజేసారు. ఐదేళ్ళ క్రితం మొదలు అయినప్పటినుంచీ తెలుగునాడి పత్రికను (చందా చెల్లించే) చూస్తున్నాను. ఏదో ఒక థీమ్ కింద కాకుండా, అందరికీ నచ్చే అన్ని అంశాలు (పాత కాలపు పద్యాల మొదలుకొని, అలనాటి కధ, సీరియల్, పిల్లల సెక్షన్, కార్టూన్లు, ప్రత్యేక వ్యాసాలూ, అలనాటి సినిమా, ఈనాటి సినిమా ల వరకు) గుదిగుచ్చి అందిస్తూ వచ్చారు. ఏ దశలోను కూడా పత్రిక క్వాలిటీ పెరిగిందనే తప్ప తగ్గిందని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఐతే, మొదటినుంచీ కూడా, సరిపడినందరు చందాదారులు లేకపోవడం అనేది ఈ పత్రికకి ఉన్న ఎటర్నల్ సమస్యగా కనిపించింది. అంటే, అమెరికాలో ఒక తెలుగు పత్రిక survive అవడానికి సరిపడినంతమంది తెలుగువాళ్ళు లేరా? (ఇది వరకు ఎప్పుడో 1000 మంది చందా దారులు ఉన్నట్టు పత్రికలో ప్రచురించిన నోటీసులో చూసిన గుర్తు). ఇన్ని వేలమంది తెలుగు కుటుంబాల్లో ఒక్క వేయి మనదేనా? సిగ్గు కదూ? ప్రతీ వాళ్ళు, "ఇండియాని మిస్ అయిపోతున్నాము, తెలుగుని, పండగలని, సరదాలని కోల్పోతున్నాము" అనే వాళ్ళే తప్ప (అ...

"సత్తా" చూపాలి.

ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలిచినా, ఓడినా, లోక్సత్తా నుండి జయప్రకాశ్ నారాయణ్ గారు గెలవడం నాకు చాల సంతోషం కలిగించింది. రాజకీయాలంటే మురికి కూపాలని, రాజకీయ నాయకులంటే (సినిమాలలో చూపించినట్టు హత్యలు, నేరాలు చేస్తూ బ్రతికే) క్రిమినల్స్ తప్ప వేరెవ్వరూ కాదనే జనాల నమ్మకం విశ్వాసం గా మారడానికి ఇంకెంతో దూరం లేదనిపిస్తున్న ఈ కాలం లో, రాజకీయాల్లోకి చదువుకున్నవాళ్ళు/సత్చరిత్రులు కూడా రావాలని, వస్తే ఎలా ఉంటుందో చూపించాలని, వచ్చి వ్యవస్థ ని మార్చడానికి ప్రయత్నించాలని, వాళ్ళు అది చెయ్యడం చూడాలని నాకెప్పటి నుంచో కోరిక. అలా అనుకోవడమే తప్ప, ఆ మొదటి అడుగు వెయ్యలేకే, నాలాంటి వాళ్ళు వేలమంది ఎదురు చూడడం తప్ప వేరే ఏమి చెయ్యకపోవడం వల్ల ఇవాళ మనం ఈ స్థితి లో ఉన్నాము - అది వేరే విషయం అనుకోండి. ఐతే ఒక సారి ఇటువంటి మార్పు రావడం మొదలు పెడితే అది ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అవుతుంది. ఆయన ఒక దారి చూపించాడు కాబట్టి, అది మరీ చెయ్యకూడని పని కాదనీ, కొంతమందికే (డబ్బు, దన్ను ఉన్న వాళ్ళకే) పరిమితం కాదనీ వేలమంది ఈ పాటికి గ్రహించి ఉంటారు. ఆయన ఎన్నిక కావడం అనేది, సొంతం గా ఆయనకి ఎంత ఉపయోగిస్తుందో ("ఉపయోగం" అంటే, మిగిల...

ఆయన స్టైలే వేరు

కలెక్టర్ కూడా సామాన్య ఆసుపత్రికే (ఈనాడు తూర్పు గోదావరి లో ఈ రోజు వచ్చిన కధనం - కొంచెం కూర్పు జరిగింది - విషయం మాత్రం అదే)." అది కాకినాడ సర్వజన ఆసుపత్రి. సమయం మధ్యాహ్నం 12:30జిల్లా కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేది వాహనం మెయిన్ గేటు ద్వారా ఆసుపత్రి ఔట్ పేషెంట్ విభాగం వద్దకు వచ్చి ఆగింది. ఇది గమనించిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పరుగులు తీసారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలకు వచ్చారేమోనని బెంబేలెత్తారు. ఇంటికి వెళ్ళిపోదామని సిద్ధమవుతున్న వైద్యులు, సిబ్బంది కూడా లోపలకి వెనుదిరిగారు. ఇంతలొ ఆ వాహనం నుంచి కలెక్టర్తో సహా మరో వృద్ధ జంట దిగింది. కలెక్టర్ వెంటే నడుస్తూ 18 వ నెంబర్ లో వున్న కంటి చికిత్సా విభాగానికి చేరుకున్నారు.మరోపక్క ఆసుపత్రి అధికారులు కలెక్టర్ ఎక్కడున్నారోనని వెదుకులాట మొదలుపెట్టారు. కలెక్టర్ మాత్రం తన వెంట వచ్చిన వృద్ధ దంపతులకు వైద్య పరీక్షలకోసం ఔట్ పేషెంట్ లో పేర్లు నమోదు చెయ్యాలని సిబ్బందిని కోరారు. ఆ దంపతులు తమపేర్లు హరివంశి ద్వివేది, తారాదేవి ద్వివేది గా వైద్యులకు తెలిపారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కలెక్టర్ తమ తల్లితండ్రులనే ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలుస...

పిల్లలకి ఎత్తు మప్పడం, పేర్లు పెట్టడం

మప్పడం = నేర్పడం (అటూ ఇటూ గా) ఇది ఈమధ్యే మాకు అనుభవంలోకి వస్తోంది. పిల్లవాడిని తీసుకొని (అంటే ఎత్తుకొని) ఎక్కడికి వెళ్ళినా, ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలూ అయ్యాక, చాలా మంది (particular గా ఇప్పటికే మూడు నాలుగు ఏళ్ళ వయసు గల పిల్లలు వున్నవాళ్ళు) అడుగుతూ వుంటారు.. "ఆ .. ఏమిటీ.. మీ వాడికి ఎత్తు అలవాటు అయిపోయిందా" అంటూ. మొదట, ఎత్తు అలవాటు అయిందో లేదో మనం కలిసిన పది పదిహేను నిముషాలలో ఎలాగూ తెలియదు (అది వాళ్ళ గెస్ మాత్రమె) - రెండోది, ఎత్తుకోవడం ఏదో పెద్ద అపరాధం అయినట్టు, వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ పిల్లలని ఎత్తుకొని మొయ్యనట్టూ, ఎత్తుకోవడం అంటే వాళ్ళకి దొంగతనం నేర్పడం అంత పాపం అయినట్టూ అడుగుతారు :). ఎవరో మావాడు పుట్టిన మొదట్లో అన్నారు, కొంచెం వయసు వస్తే పిల్లలకి వ్యాపకాలు ఎక్కువ అయి (ఇది మంచిదే మరి) మన దగ్గర ఎక్కువసేపు కుదురుగా ఎలాగూ కూర్చోరు.. ఈ మొదటి ఒకటి రెండు ఏళ్ళలోనే వాళ్ళని తనివి తీరా దగ్గరకి తీసుకొని ఉంచుకోవాలి అని. అందులో నిజం ఎంత వున్నా, ఈ వయసులో తల్లితండ్రులే కాకుండా ఎవరు ఎత్తుకున్నా ఆ మానవ స్పర్శ వాళ్ళలో సురక్షాత్మక భావనను కలిగిస్తుంది. అంతవరకు ఎందుకు? మేమిద్దరం కూర్చొని వాడిని మధ్యలో వు...

బొమ్మరిల్లు లో ఆంగ్లగోల

చూసే వుంటారు "మా" లో సుహాసిని నడిపిస్తున్న బొమ్మరిల్లు వస్తోంది కదా. నాకు ఎందుకో సుహాసిని వి ఈ మధ్య సినిమాలు చూసి ఆవిడ అంటే కొంచెం భయం కలిగిన మాట వాస్తవం ("నువ్వు నాకు నచ్చావు" లో బరువు డైలాగులు, "రాఖీ" (ఇది చూడలేదులెండి కానీ, చూసిన యాడ్లే చాలు) లో కొంచెం ఓవర్ గా కన్పించే నటన చూసి). కానీ, ఈ షో చూసాక, నాకు అలా అనిపించడానికి ఆయా సినిమాలలో ఆవిడ పాత్రల్ని దిద్దిన డైరెక్టర్లు, మాటలు వ్రాసిన రచయితలూ కారణం అని అనిపించింది. రూల్స్ మరీ "ఎవరికీ మేము ఏమీ ఇవ్వం" టైపులో వున్నా, ఈ ప్రోగ్రాం జనరల్ నాలెడ్జ్ వరకు ఐతే పరవాలేదు. సుహాసిని కూడా "ప్రశ్న అడిగామా, ఆన్సర్ చెప్పారా" అన్నట్టు కాకుండా, వీలు ఐన చోట్ల సమాచారం ఇస్తూ, కబుర్లు చెబుతూ బాగానే నడిపిస్తోంది అనే అనిపించింది. కానీ, నాకు ఈ ప్రోగ్రాం లో చిర్రెత్తుకొని వచ్చే అంశం ఒకటి వుందండోయ్. అదే "మన" వాళ్ల ఆంగ్ల భాషా దుర్వినియోగం (అంటే, అవసరం అయిన దానికంటే, చాల ఎక్కువగా మాట్లాడడం). ఏదో కొంచెం ఇస్త్రి చేసిన షర్టు వేసుకొని కాస్త ప్యాంటు, బూట్ వేసుకొని, మరకలు లేని కళ్ళజోడు మొహానికి తగిలించుకోగానే, ఎక...

సెన్సార్ కత్తెర

సెన్సార్ కత్తెరని ఈమధ్య మార్కెట్ లోకి తీసుకొని వెళ్లి పదును పెట్టించి తీసుకొని రావడానికి ప్రయత్నాలు జరిగాయని తెలిసి సంతోషించాను. దాని వల్ల ఏమి ఒరుగుతుంది, ఏమి ఒరగదు అనేదానికన్నా ముందు, ప్రయత్నం జరగడం హర్షణీయం. అందులో నాకు నచ్చినవి రెండున్నాయి. ఒకటి కులం పేరు మీద వ్యంగ్యం, లేదా కులానికి సంబంధించిన రెఫెరెన్సుల మీద సీరియస్ గా వుండాలి అని నిర్ణయించుకోవడం. బయట కొట్టుకు చచ్చేది కాక మళ్ళీ సినిమాలలో కూడా కులం గోల ఎందుకు? మనం సినిమాలలో చూపించేది (చెడు మాత్రం) తు.చ. తప్పకుండ పాటించడానికి ఏళ్ళనుంచీ అలవాటు పడ్డాము. మంచి చెప్పకపోతే పోయే, చెడు నేర్పకుండా వుంటే చాలు అనుకునే టైం వచ్చింది. ఇది కొంచెం స్లో పాయిసన్ లాంటిది. వెంటనే effect చూపించకపోయినా, సమాజంలో మనం ప్రవర్తించే తీరుని తప్పక ప్రభావితం చేస్తుంది. అందుకని, దానిని కొంచెమైనా కంట్రోల్ చేద్దామని అనుకోవడం మంచిదే. రెండోది వ్యక్తుల physical disabilities ని వెక్కిరించే పిలుపులు, తిట్లు. "పోట్టోడా, గుడ్దోడా, కుంటోడా, ముసలోడా" లాంటి పిలుపులు. ఎవడైనా ఇంకొకడిని వాడి రూపు రేఖలని, అవిటి తనాన్ని బట్టి పిలవడం ఒక మానసికరుగ్మత!. ఏం? ఇవాళ చక్కగా ఉన్...

తల్లి పాలు.

(ఈ టపా కి వ్యాఖ్యలు వ్రాసినవారందరికీ కృతజ్ఞతలు. వారి వ్యాఖ్యల వల్ల మరిన్ని అంశాలు జోడించడం జరిగింది)కిందటి సంవత్సరం జూన్ లో ప్రసారం చేసిన బాలు గారి పాడాలని వుంది రికార్డింగ్ చూస్తూ వుంటే ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. తల్లి పాలు అప్పుడే పుట్టిన పిల్లలకి చాలా మంచివి అనీ, మన వాళ్ళు (చాలా మంది) ఆ విషయం తెలుసుకోకుండా, పిల్లలు పుట్టిన వెంటనే తల్లి దగ్గర పాలు తాగనివ్వరనీ, దీనిని నిరోధించాల్సిన అవసరం ఉంది అని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నా మొట్ట మొదటి రియాక్షన్ ఏమిటంటే, అలా చేసే వాళ్ళని ఒక గది లో వేసి బంధించి "మా తప్పు తెలిసింది మహాప్రభో" అనేవరకూ రోజూ రెండు పూటలా ఇంత పచ్చగడ్డి పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది అమృతతుల్యమై, రోగ నిరోధక శక్తి ని కలిగించే తల్లి పాలు దూరం చేసి పిల్లలకి పోత పాలు పోస్తే వాళ్ళకి ఎలా వుంటుందో!!. అసలు బిడ్డ పాలు తాగకపోతే ఆ తల్లి కి ఎదురయే కష్టం కూడా (engorgement (పాలిండ్లలో పాలు నిండిపోయి నెప్పి పుట్టడం) వల్ల) వర్ణించనలవి కాదు. సృష్టి లో జరిగే ప్రతీ విషయం కూడా పరస్పర ఆధారితం గా జరుగుతుంది (Symbiosis). పురుడు వచ్చే సమయానికి తల్లికి పాలు ఉత్పత్తి కావడం, అప్పు...

పిల్లల బొమ్మల ఎక్సేంజ్

ఎప్పటినుంచో అనుకుంటున్న ఇలాంటిది ఏదో ఎక్కడో వుండాలి అని (మా పిల్లవాడు పుట్టిన మొదట్లో నేనే ఒక సైట్ పెట్టేద్దామా అని కూడా అనుకున్నా). ప్రపంచం లో ఫ్యాషన్ ల కంటే తొందరగా మారిపోయే వస్తువులు ఏమైనా వున్నాయి అంటే అవి తప్పకుండ పిల్లల బొమ్మలే. అప్పుడే పుట్టిన పిల్లలకి బొమ్మలు వేరు, నెల వయసు వారి బొమ్మలు వేరు, కొద్దిగా ఎదిగి రంగులు, జంతువులు గుర్తు పట్టే వయసు వచ్చే వారి బొమ్మలు వేరే, ఆడపిల్లల బొమ్మలు వేరు, మగ పిల్లల బొమ్మలు వేరు. పిల్లలు చూస్తుండగానే ఎదిగిపోయే లక్షణం కలవారు అవటం వల్ల, ఇవాళ కొన్న బొమ్మలు నెల రోజుల్లో (రంగు, షైనింగు చెడకుండానే) పాతబడిపోయి మళ్ళీ బొమ్మల దుకాణానికి వెళ్ళే పని పెడతాయి. అలా ప్రతీ తల్లితండ్రులు పదుల కొద్దీ (కొండొకచో వందల కొద్దీ) బొమ్మలు కొని ఇల్లు నింపుతూ వుంటారు. జ్ఞాపకాలు గా దాచుకుందామన్నా, కొద్ది రోజులు పోయేసరికి అవి కాలికి అడ్డం గాను, జేబుకి చిల్లు పెట్టిన శత్రువులు గాను కనిపించడం మొదలు పెట్టి వాటిని నెమ్మదిగా బయటకి తరలించడమో, లేక రీసైకిల్ వారికి ఇచ్చేయ్యడమో జరుగుతుంది. ఎవరికైనా ఇద్దామన్నా, వాళ్ళు వాడేసిన బొమ్మలు ఇస్తున్నారు అనుకుంటారు, "మా పిల్లలకి మేము కొనలేమ...

బాలు పుట్టిన రోజు

ప్రేమ రసాంత రంగ హృదయంగమ సుంగ సుభంగ రంగ బహు రంగధ భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప ప్రుదు సంఘ విభంగా.. దీనిని అంతటినీ ఒకే గుక్కలో మధ్యలో ఊపిరి తీసుకోకుండా చదవండి చూద్దాం? కొంచెం కష్టం అయినా చదివేసారు కదా? సరే.. ఇప్పుడు రామదాసు సినిమా లో "దాశరథీ! కరుణా పయోనిధీ" పాటలోలా పాడడానికి ప్రయత్నించండి. "అబ్బో" అంటారా? ఐతే మరి దానిలో భగవంతుడినే నిలదీస్తున్నట్టు అనిపించే భావాన్ని కూడా పొందు పరచి, రాగా తాళ యుక్తంగా పాడడం అనేది ఊహకి కూడా అందదు. అందులోనూ, 62 ఏళ్ళ వ్యక్తి ఆపని చేసాడు అంటే, అతనికి తన వృత్తి పట్ల ఎంత అంకిత భావం వుంటే, పాడుతున్న పాటలో ఎంత మనసు లగ్నం చేస్తే అది సాధ్యం అవుతుంది? ఎవరి గురించి చెబుతున్నానో తెలిసిందిగా? తన వయసులో సగం కూడా లేని కుర్ర హీరో లకి కూడా తన "లేత" గొంతు తో పాడిన చక్కటి పాటతో అందాన్ని అద్దగలిగే "మన" SP బాలసుబ్రహ్మణ్యం గురించి. ఎవరికి వారికి "ఇతను నా గొంతుతోనే పాడేడు" అనిపించినా, సినిమా లలో కమెడియన్ వేషాల నుంచి విలన్ వేషాల వరకు వేసి శహభాష్ అనిపించుకున్నా, మ్యూజిక్ డైరక్షన్ చేసినా, ప్రయోక్తగా పని ...

మాష్ ఆ స్మాష్ ఆ (Mash or Smash)?

ఈ మధ్య మన వాళ్లు ఇలా మొదలెట్టారేమో తెలియదు గాని, మాటీవీ లో మాఊరివంట చూస్తుంటే బాగా తెలుస్తోంది.. "ఇప్పుడు మనం ఈ ఉడికిన బంగాళదుంపల్ని బాగా స్మాష్ చేసుకోవాలి" అంటూ :). "అవును.. అందులో తేడా ఏమి వుంది?" అంటారా? అనొచ్చు. ఎందుకంటే అది ఈ మధ్య బాగా అలవాటు అయిపోతే వాళ్ళు దేని బదులు స్మాష్ అంటున్నారో మరిచిపోయే అవకాశం కూడా వుంది. స్మాష్ అంటే (మరీ Webster పదకోశం అవీ తిరగెయ్యకండి గాని) స్థూలం గా "నాశనం చెయ్యడం" లాంటి అర్ధం వస్తుంది. మీకు తెలిసే వుంటుంది. ఆంగ్ల భాష లో "మాష్" అని వేరే పదం వుంది.. "చిదమడం" అనే అర్ధం లో. ఇప్పుడు అర్ధం అయింది కదా.. బంగాళ దుంపని స్మాష్ చేస్తే పెద్దగా ఏమీ మిగలదు తినడానికి అని :).అలాగే ఈ వంటల కార్యక్రమాల్లో "ఉప్పు", "పంచదార" అనే మాటలు విని చాల కాలం అయింది. అందరూ "సాల్టు", "సుగరు" (అహ నా పెళ్ళంట లో జంధ్యాల గారు వ్రాసినట్టు "సాల్టూ.. సాంబారు - నువ్వు కలుపుకోరా వెంకన్నా!" అన్నట్టు). ఇంగ్లీష్ లో ఒక వాక్యం మొదలు పెట్టడం.. మధ్యలో మిడిల్ డ్రాపు అయిపోవడం (ఆ వాక్యాన్ని పరాయి భాష లో ఎ...

మంచు తుఫాను - మనకి పాఠం

కిందటి వీకెండ్ (ఇంచుమించు శుక్ర వారం సాయంత్రం మొదలుకొని ఆదివారం వరకు) కొందరికి ఒక రోజు అటూ, కొందరికి ఒక రోజు ఇటూ గా, ఒహాయో రాష్ట్రం మొత్తం అంతా స్నో తో నిండిపోయింది (మిగిలినవి కూడా నిండే వుంటాయి గాని, నాకు ఇదమిత్థం (ఈ పదాన్ని ఇంకా కొంతమంది వాడుతున్నారు అనే అనుకుంటున్నాను) గా తెలియదు). మా ఇంటికి బంధువుల రాక కూడా అదే వీకెండ్ జరగడం వల్ల నాకు ఆ స్నో అంతటినీ పూర్తి గా experinece చేసే అవకాశం దక్కింది (ఇంటికి, విమానాశ్రయానికీ మధ్య డ్రైవ్ చేస్తూ). రెండు రోజులూ కలిసి ఒక 16-18 అంగుళాల మందాన మంచు పేరుకుపోవడం తో పెద్దల సంగతేమో తెలియదు గాని, పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేసారు. సిటీ ప్రభుత్వం వారు ఆఘ మేఘాల మీద (మంచు ice గా మారకుండా) దాని మీద వుప్పు జల్లించడం, రాకపోకలు ఆగకుండా యుద్ధ ప్రాతిపదిక మీద రోడ్లని శుభ్రపరచడం చెయ్యడం చూసి నాకు అనిపించింది.. "ఔరా!! ఇంత ఖర్చు, శ్రమ తో కూడిన పని ఐనా, ప్రతీ ఏడాది తప్పని పని ఐనా వీళ్ళు పట్టుదలతో ప్రకృతి ని ఎదిరించడానికి కూడా వెనకాడకుండా ఎంత కష్టపడుతున్నారు" అని. ఇన్ని ఖర్చులు వున్నా (ప్రతీ ఇల్లు, ఆఫీసు, పాఠశాల , గొడ్ల సావిళ్ళతో సహ అన్నీ చలి కాలం అంతా కూడా ...

నా తప్పు కాదు అనుకుంటున్నా!!

నిన్న వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకోడానికి దుకాణానికి వెళ్ళా.. (ఇక్కడ ఇంతే లెండి .. ఆది వారమే అన్నీ తెచ్చేసుకోవాలి.. సోమ వారం వెళ్ళాము అంటే, కుంగి, కృశించి, ఆల్మోస్ట్ నశించిపోడానికి రెడీ గా వున్నా కూరలే దొరుకుతాయి :) ). సరే.. రెండు సంచీల నిండా కూరలు నింపామా? నా వెనక ఒక నలుగురు చేరారు చెక్ ఔట్ లైన్ లో. వెనక్కి చూద్దును కదా ఒకాయన చిన్న నూనె డబ్బా పట్టుకొని వున్నాడు.. సరే కదా.. కుర్రోడు (పెద్దోడే లెండి) నాది అయ్యే వరకు వెయిట్ చెయ్యాలి అని "అయ్యా.. మీరు గాని మీ పని కానిచ్చుకుంటారా ముందు?" అని ఆఫర్ చేశా. అది నేను చేసిన పాపమేమో తెలియదు గాని, ఆ మానవుడు నన్ను "ఛీ.. పీనుగా.. ఈ ప్రపంచం లో వున్న కష్టాలన్నింటికీ నువ్వే కారణం" అన్నట్టు ఒక ఛీత్కారపు చూపు చూసి ముందుకెళ్ళి నూనె డబ్బా బిల్ చేయించుకొని లాగించేసాడు !! కనీసం ఒక థాంక్ యు ("కుదిరితే ఒక కప్పు కాఫీ" ఎలాగు లేదు :) ) కూడా చెప్పకుండా కాటు మొహం పెట్టుకోవడం ఎందుకో నాకు అర్ధం కాలేదు.. పోనీ ఆయన ముందుకి వెళ్లేటప్పుడు నేను కాలు ఏమైనా అడ్డం పెట్టానా అంటే అలా ఏమి గుర్తు లేదు.సీరియస్లీ, మన వాళ్ళు (అంటే నేను కూడా - నేనేదో ...