చంటి పిల్లలు సాధారణంగా రోజుకి ఇరవై గంటలు పడుకుంటారు (అది average అనుకోండి - కొందరు తక్కువ పడుకుంటారు. వాళ్ళ శరీరధర్మాన్ని బట్టి ఇది మారుతుంది). అందుకని వాళ్ళని పడుకోబెట్టడం అనేది సాధారణంగా మనం ప్రత్యేకించి చెయ్యాల్సిన పనిగా ఉండదు. నిద్రపోకుండా ఉంటే (ఒకటి-రెండు నెలలు ఉన్న పిల్లలు) కాళ్ళూ చేతులూ కదుపుతూ ఆడుకోవడమో, కబుర్లు చెబుతూ ఉండడం (ఉక్కు, ఉంగా లాంటివి), వస్తువులని చూస్తుండడం, మనుషులని ఫాలో అవుతూ ఉండడం చేస్తూ కాలక్షేపం చేస్తారు. ఐతే, కొన్నిసార్లు వాళ్లకి నిద్ర వచ్చినా తిక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు పడుకున్నంత సేపు ఎక్కడ ఉన్నారు అనేది తెలియదు కాని, ఏడిస్తే మాత్రం టాపు లేపెయ్యడం ఖాయం. వాళ్ళ ఏడుపులో "treble" పాలు ఎక్కువ ఉండడం వల్ల అది వినేవాళ్ళకి ఒక లెవెల్లో ఇరిటేషన్ కలిగిస్తుంది (మరి "bass" లో ఏడిస్తే ఎవరికీ వినిపించదని దేముడు ఆ సెట్టింగ్ ఇచ్చాడు అని మనం అర్ధం చేసుకోవాలి). ఇలా తిక్క ఏడుపు తీర్చడానికి మామూలు లాలిపాటలు, ఉయ్యాలల కంటే దగ్గరకి తీసుకొని పట్టుకోవడం ఉత్తమమని మా అనుభవం. మాకు పని చేసిన రెండు మూడు కిటుకులు: ఎత్తుకున్నప్పుడు మన మోచేతి ఒంపులో వాళ్ళ మెడ పైభాగం, తల ఉంచి (దాని వాళ్ళ మెడకి కూడా సపోర్ట్ ఉంటుంది) ఛాతీకి దగ్గరగా తీసుకొని (మన ఊపిరి తగిలేలా), రెండో చేతిని నడుము కింద పోనిచ్చి ఉంచి దగ్గరకి అదుముకుంటే వాళ్ళకి బోలెడంత secure ఫీలింగ్ వస్తుంది. దానితో బాటు చిన్నగా bass వాయిస్ లో రిథమిక్ గా ఏదో ఒకటి అంటూ ఉంటే ఆ రిథం కి నెమ్మదిగా దారిలో పడతారు. దాంతో బాటు, కూచొని ఎత్తుకునే కంటే, ఇలా పట్టుకొని నడుస్తూ ఉంటే, ఆ "gliding motion" కి చాలా చురుగ్గా నిద్ర పట్టేస్తుంది (ఇది "అమ్మ చేతుల ఉయ్యాల" అన్నమాట - actually, నాన్న కూడా చెయ్యచ్చు ఈ పని). వాళ్ళని అదిమి పట్టుకోమన్నానని మరీ నొక్కేస్తే ఫ్రీగా లేక ఏడుపు నెక్స్ట్ లెవెల్ కి వెడుతుంది. కొంచెం flexible గా పట్టుకుంటే కదలడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సార్లు ఎత్తుకున్నప్పుడు వాళ్ల తల మీద వ్రేళ్ళతో సన్నగా రాస్తూ ఉంటే అది కూడా వాళ్ళని శాంతపరుస్తుంది. ఇంకా, చాలా సార్లు ఏడుపు కి ముఖ్య కారణం ఆకలి వెయ్యడమో, wet /dirty diaper ఓ, విరేచనం అవకపోవడం వల్ల వచ్చిన కడుపు నొప్పో (ఇది కొంచెం అరుదు - అందులోనూ, తల్లి పాలు తాగే పిల్లల్లో - వాళ్ళు ఒక్క రోజు "ఇంకా కాలేదేమిటి" అనుకొనేసరికి వెంటనే కడుపు ఖాళీ చేసేసుకుంటారు) - కొన్ని సార్లు వాళ్ళు వేసుకున్న దుస్తుల్లో ఉండే "టాగ్" ఓ కారణం అవుతుంది (అనుకోము కాని, మనకే చిరాకు పుట్టించేస్తుంది - వాళ్ళైతే ఇంక డైరెక్ట్ గా ఏడుపే). ఒక్కో సారి పాలు తాగేక, తేనుపు వెంటనే రాకపోతే అది వచ్చే వరకూ ఏమి చేసినా ఏడుపు ఆపరు. అటువంటప్పుడు ఇందాక చెప్పినట్టు అడ్డంగా కాకుండా, మెడ మీద చెయ్యి వేసి నిలువుగా పట్టుకొని భుజం మీద వేసుకొని, నడుము కింది భాగంలో చిన్నగా తడుతూ ఉంటే కాసేపట్లో తేనుపు వచ్చేసి సుఖంగా పడుకుంటారు (మా అమ్మగారు చెప్పడం, ఇదివరలో పిల్లల్ని మూడు నెలలైనా వచ్చేవరకూ భుజంమీద వేసుకునేవారు కాదుట. కాని, మా చిన్నోడు అప్పుడప్పుడు భుజంమీద వేసుకుంటే తప్ప మానడు - ఒక్క సారి భుజంమీద పెట్టుకుంటే ఇంక అక్కడ నుంచి ఏడుపు మానేసి, పిట్ట గోడ అవతలి నుంచి చూస్తున్నట్టు వింతగా గమనించేస్తూ ఉంటాడు :). ఇంకా, తేనుపు తెప్పించడం కోసం భుజాల మధ్యలో తట్టడం మంచిది కాదు అని ఈ మధ్యే చదివాను. logically కూడా, బొజ్జ ఉండేది మొండెం కింది భాగంలో కాబట్టి గాలి ఇరుక్కునేది అక్కడే - అందుకని అక్కడ తడితే తొందరగా తేనుపు వస్తుంది).
పిల్లల్ని నిద్ర పుచ్చడానికి చెయ్యకూడనిది: కొందరు ఏ సోఫాలోనో కూర్చొని పిల్లల్ని వొళ్ళోపెట్టుకొని, వాళ్ళ మెడ/తల తమ మోకాలి మీద ఆన్చి, ఆ కాలి వేళ్ళు నేలమీద ఉంచి, మడమని నేలమీద కొడుతూఉంటారు (అర్ధం అవకపోతే పిక్చర్ చేసుకొంటూ మళ్ళీ చదవండి). అలా అరికాలు కొడుతున్న ప్రతీసారీ ఆ పిల్లల తల గమనిస్తే అది అదిరి అదిరి పడుతూ ఉంటుంది. ఈ చర్యతో పిల్లలు ఏడుపు మానొచ్చేమోకాని, అది మాత్రం చాలా తప్పు. ఇది చాలా సార్లు చంటి పిల్లలతోనే జరుగుతుంటుంది. పిల్లలు పుట్టిన తరువాత కనీసం ఒక ఏడాది వరకు వాళ్ళ తలలో బ్రెయిన్ పూర్తిగా సెటిల్ అవదు. ఊహించుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెబుతున్నా: ఎండు వేరుసెనక్కాయలో గుండు ఎలాగో, పండు వెలక్కాయలో గుంజు పార్ట్ ఎలాగో అలా అన్నమాట (అవి రెండూ చేతితో పట్టుకొని ఆడిస్తే లోపల గుండు కదలడం వినిపిస్తుంది కదా.. అంటే, లోపల ఉన్న వస్తువు దాని షెల్ల్ కి పూర్తిగా తాటించి లేదు అని అర్ధం). అది పిల్లల మెదడు ఐతే, ఇటువంటి motion వల్ల పుర్రె గోడలకి తగిలి rupture అయ్యే ప్రమాదం చాలా ఉంది. పడుకోబెట్టడం ఇంట్రెస్ట్ లేకపోతె ఇంకొకళ్ళకి ఇచ్చి పడుకోబెట్టమనడం ఉత్తమం. లేదా, వాళ్ళని చేతిలో తీసుకొని నెమ్మదిగా మనం ఊగుతూ వాళ్ళకి ఆ స్వింగింగ్ motion ని పాస్ చెయ్యడం బెస్ట్ పద్ధతి. అలాగే, పిల్లలకి రాత్రి, పగలు తెలియదు. వాళ్ళకి వచ్చిన ఒకే భాష ఏడుపు. పగలు పరవాలేదు కాని, రాత్రి నిద్ర లేచి ఏడుస్తుంటే మనకి నిద్ర మెలకువ వచ్చి కొంచెం iritate అవడం సహజం. ఐతే, దానిని వాళ్ళ మీద చూపించి, ముఖ్యంగా మనం ఏమి చేసినా వాళ్ళు ఏడుపు మానకపోతే వాళ్ళని కొంతమంది "shake" (రెండు చేతులతో పట్టుకొని గట్టిగా ఊపెయ్యడం) చెయ్యడం ద్వారా ఏడుపు మానిపించడానికి ప్రయత్నిస్తారు. పైన చెప్పిన కారణం వల్ల ఇలా చేసినపుడు వాళ్ళ మెదడు శాశ్వతంగా damage అయ్యే అవకాశం ఉంది. ఏడుస్తున్న పిల్లాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయినా తప్పు లేదు కాని, గట్టి గా ఊపెయ్యడం ద్వారా వాళ్ళని ఏడుపు మానిపించడం క్షమించరాని నేరం. వందకి తొంభై తొమ్మిది సార్లు రాత్రి నిద్ర లేచిన పిల్లలు పాలు పడితే చప్పుడు చెయ్యకుండా పడుకుంటారు. అలాగే కొంతమందికి ఒక అంగ్లె లో పట్టుకుంటేనే ఇష్టం. మా పెద్దవాడు కొంచెం మెడ నిలబెట్టడం మొదలు పెట్టాక, చేతుల్లో కూర్చోబెట్టుకొని, దేముడిని ఊరేగించినట్టు తిప్పుతూ ఉంటే ఏడుపు మానేసి చక్కగా చూసుకుంటూ కూర్చునేవాడు. అది మళ్ళీ చిన్నాడికి పనిచెయ్యలేదు. చెప్పోచ్చేదేమింటంటే అది ఒక్కొకరికీ ఒక్కో విధం గా సెట్ అవుతుంది. అది తెలిసే వరకు (తొందరలోనే తెలుస్తుంది గాని) కొంచెం ఇబ్బందే, ఒక సారి తెలిస్తే ఇక వాళ్ళని ఎత్తుకునే వాళ్ళు అందరూ ఆ ట్రిక్కు వాడొచ్చు.
లోతైన భావాలు – ఆధునిక వ్యక్తీకరణల ‘జెన్నీ’!
1 week ago
No comments:
Post a Comment