కండూతి అనే మాట ఈ వ్యవహారం లో వాడొచ్చో లేదో తెలియదు గాని, జంధ్యాల చెప్పినట్టు "మాట బాగుంది అని వాడేసాను". చాల ఆశ్చర్యం అనిపిస్తుంది. మా శ్రీహర్ష గాడు పుట్టి నాలుగు నెలలయింది. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, తిక్క వచ్చినా, తోచకపోయిన సరే, అప్రతిహతం గా కాళ్ళు, చేతులు అలా కొట్టేసుకుంటూనే వుంటాడు. చూడబోతే దేముడు మన శరీరం లో వ్యాయామానికి కావాల్సిన instinct అంతా program చేసి పంపిస్తాడు కామోసు. అందుకే (వీడే కాదు.. అందరు) పిల్లలూ ఇలా వీర లెవెల్లో కాళ్ళు చేతులు వూపేస్తూ మొత్తం శరీరాన్ని వ్యాయామం చేయిస్తూ వుంటారు :). కాలం గడిచే కొద్దీ (అంటే exercise అవసరం అయ్యే కొద్దీ) మనకి ఇహ లోక వ్యవహారాలు ఎక్కువ అయి, వ్యాయామానికి తిలోదకాలు ఇచ్చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాము అనిపిస్తుంది.
లోతైన భావాలు – ఆధునిక వ్యక్తీకరణల ‘జెన్నీ’!
1 week ago
9 comments:
your son is very cute.... :)
so sweet :)
very cute!
వాడు "రా... ఎత్తుకొ"మ్మని సందడి చేస్తుంటే మీరు వ్యాయామం అంటారు! భలే ఉన్నాడు మీ బుడుగు.
భలే
అయ్యా ఇంకో నాలుగు నెలలాగండి,శిశువుతో పాటు మీరూ బలవర్ధకాహారం తీసుకోవాల్సిన అవసరం,ఉరకలు,పరుగులు అంటే ఏమిటో బాగా తెలుస్తుంది.మీఇల్లు పొడవు,వెడల్పులు,వగైరా జాగ్రఫీ వివరాలు వీడికి వయసు పెరిగే కొద్దీ మీకు బాగా తెలుస్తాయి.చిన్నారి శ్రీహర్ష మీకు వ్యాయామం అంటె ఏమిటో పూర్తి స్థాయిలో నేర్పిస్తాడు.
బావుందండీ. మీకు ఆవిడియో తీసి ఇక్కడ పెట్టాలని తోచినందుకు మెచ్చుకోక తప్పదు. వ్యాయామకండూతి అన్న పేరుని కూడా గొప్పగా వాడుకున్నారు :)
వ్యాఖ్యలు పంపించిన వారందరికీ ధన్యవాదములు. రాజేంద్ర కుమార్ గారు.. ఇప్పటికే, చిన్న పిల్లలు కలిగిన మా స్నేహితులు ఇంటికి రావడం ద్వారా, మా ఇంటి పొడుగు, వెడల్పు (కొన్ని సార్లు లోతు కూడా :) ) ల మీద, మా ఇంట్లో పగిలిపోయే వస్తువులు ఎక్కడ ఎక్కడ వున్నాయి అన్న విషయం మీద కొంచెం ఐడియా వచ్చింది. మా వాడు పాకడం/పరుగులు పెట్టడం మొదలు పెట్టాక, మీరు చెప్పినట్టు, ఆయా వస్తువుల మీర మరింత సాధికారత వస్తుంది అనుకుంటాను :). అలాగే, పగిలే వస్తువులు కొన్ని తగ్గుతాయి (పగలడం ద్వారా) అని కూడా అనిపిస్తోంది :).
మీ అబ్బాయి ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటే, మీరేమిటండీ వాడిని పాపం ఇలా కాలచట్రంలో భంధీ చేసేసారు .. అదేదో ఆంగ్ల joke (తెలుగు లో ఏమంటారో గుర్తుకురాలేదు, మన్నించగలరు) చెప్పినట్లు..
ఒక చేప మరిక చేపతో ఈవిధంగా అంటోందట.. "మనదీ ఒక జీవితమే .. ఒక ప్రేమ లేదు.. ఒక ఎదుగుదల లేదు.. ఒక స్నేహితుడు లేడు.. నీకు నేను నాకు నువ్వు తప్ప.. మనం ఎప్పటికి ఈ స్క్రీన్ సేవర్ నుంచి బయట పడతామో గానీ.. అప్పటి వరకూ మన జీవితాలు ఇంతే.."
కాబట్టి.. మీరు త్వరత్వరగా .. ఎప్పటికప్పుడు, లేటెస్టుగా మీవాడు చేసే పనులన్నీ ఒకదాని తరువాత ఒకటిగా పేర్చి మా అందరికి తెలియజేయగలరని మనవి. లేదనుకోండి, మీవాడిని ఎప్పటికీ ఇలాగునే మేమందరమూ మది గదిలో ఇక్కడున్నట్లుగా భంధించుకోవలసి వస్తుంది.. మీ వాడు ఎప్పటికీ నాలుగునెలల వాడిగానే ఉండిపోతాడు .. తస్మాత్ జాగ్రత్త..
Post a Comment