Posts

Showing posts with the label కబుర్లు

మంచి మనిషి.

Image
ఇంజనీరింగ్ అయిన వెంటనే ఏమి చెయ్యాలా అన్న విషయం ఇంజనీరింగ్ చేస్తున్నన్నాళ్ళూ పెద్దగా ఏమి అనుకోలేదు. అందరూ గేటు రాస్తున్నారంటే నేను కూడా రాసా.. ఏదో జరిగి మార్కులూ బాగానే పడ్డాయి - ఐ ఐ టీ మిస్ అయి మద్రాస్ లో అన్నా యూనివర్సిటీ లో చేరాను కంట్రోల్ సిస్టమ్స్ లో. అసలే ఇంటి బయట ఉండడం మొదటి సారి, మన భాష/ఊరు కాని ప్రదేశం, ముఖ్యం గా ముందు గా తెలిసి ఉన్న స్నేహితులు లేకపోవడం (అందుకే తరవాత ఇంకా ఎక్కువ దూరం అయిన అమెరికా వచ్చినా కూడా ఇక్కడ అప్పటికే తెలిసిన స్నేహితులు ఉండడం తో అస్సలు ఇబ్బంది లేకుండా కలిసిపోయాను), నన్ను అక్కడ ఉండనివ్వలేదు. దానికి తోడు చీకటి గుయ్యారాల లాంటి హాస్టల్ రూములు, రోజుకొకసారి కనిపించే ఈనాడు పేపర్, రుచీ పచీ లేని హాస్టల్ భోజనం - మనకి ఒకటి నచ్చక పొతే అన్నీ భూతద్దాలలోంచి కనిపిస్తాయి కదా - మొత్తానికి ఈ కాలేజీ మనకోసం కాదు అన్న విషయం నిర్ణయం అయిపొయింది. దానికి తోడు, అక్కడ చేరిన ఒక వారం రోజులకి విశాఖపట్నం గీతం లో నాతో చదివిన స్నేహితుడు అమెరికా వీసా కి రావడం, అతని ద్వారా జీ ఆర్ ఈ కి ఎలా తయారవాలి తదితర విషయాలు తెలుసుకోవడం వల్ల అమెరికా పురుగు గట్టిగా కుట్టింది. మనం ఏదైనా పని చెయ్యడానికి...

చర్చి దర్శనం.

Image
నిన్న చర్చి కి వెళ్ళాము. అమెరికా లో చాలా కాలం నుంచీ ఉన్నా, ఎందుకో వెళ్ళడానికి సమయం సందర్భం కలిసి రాలేదు. పెళ్ళికాకముందు ఒకసారి మా మేనేజర్ గారు చర్చి కోరస్ లో పాటలు పాడతాను అంటే వెళ్ళాము కాని, ఆ కోటి మంది కోరసుల్లో ఆయన గొంతు గుర్తు పట్టలేదు. ఇన్నాళ్ళకి మళ్ళీ నా పక్కసీటు లో పాలు గారు ("కే. ఏ." కాదు) చర్చి లో మత ప్రవచనం ఇవ్వడానికి ఏవో కోర్సులు చేసి, పరీక్షలు రాసి పాసై, అర్హత సంపాదించి మొదటి సారి ప్రవచిస్తున్నా మీరందరూ రావాలి అని అనేక విధాల (మౌఖికం గా, ఈమైలికం గా, ముఖపుస్తక రూపకం గా) చెప్పడం తోను, ఎన్నాళ్ళ నుంచో శాంతి కోరుతూ ఉండడం తోను ఇక బయల్దేరాము. ఇక్కడ మా పాలు గారి గురించి కొంచెం చెప్పుకోవాలి. ఏభై ఏళ్ళ మనిషి అయినా ఇంటా బయటా అన్ని వయసుల వాళ్ళతోనూ కలసి మెలసి తెగ హడావిడి గా ఉంటాడు. ఆయన చెప్పే కబుర్లు విని నేనే "నీ జీవిత చరిత్ర రాస్తే చెప్పు - మొదటి పుస్తకం నేనే కొంటా" అని కూడా హామీ ఇచ్చాను (ఆయన ఇంకా మొదలు పెట్టినట్టు లేదు అనుకోండి). విధి వశాన నాలుగు పెళ్ళిళ్ళు, బోలెడు పిల్లలు, అప్పులు, అనేక జీవితానుభవాలు పుష్కలం గా ఉన్న వ్యక్తి పాల్. దానికి తోడు తన ఇరవై ఆరో ఏట మాని వేస...

ఇష్టం అంటే...

Image
"నాన్నంటే నాకిష్టం" "నాకు కూడా శ్రీహర్షబాబంటే బోలెడంత ఇష్టం" "నాన్నా.." "ఊ..." "ఇష్టం అంటే?" ".................. ఇష్టం అంటే, నువ్వు ఎప్పుడైనా తమ్ముని కొట్టడం, తోసెయ్యడం చేస్తావు కదా.. అప్పుడు నాన్న 'హన్నా.. అలా చెయ్యకూడదు' అని కేకలేస్తారు కదా.. కాని వెంటనే ఇలా పట్టేసుకుంటారు - అదీ ఇష్టం అంటే" నాన్నకి ఏమి చెప్పాలో తెలియలేదు. "ఓహో...." శ్రీహర్ష బాబుకి మాత్రం చక్కగా అర్ధం అయింది!! :).

నీళ్ళెలా తాగాలి?

Image
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి విమానం మారుతున్నప్పుడు ఈ వాటర్ ఫౌంటెన్ నాకు స్వాగతం చెప్పింది. చూడబోతే ఇది ఫౌంటెన్ (నీళ్ళు కింద నుంచి పైకి చిమ్మే)లా కాకుండా "కుళాయి" (నీళ్ళు పై నుంచి కిందకి పడే)లాగ ఉంది. కళ్ళతో చుట్టూ వెదికాను దగ్గరలో కాగితం గళాసులు ఏమైనా ఉన్నాయేమో అని. కనిపించలా. పక్కన కాసేపు నక్కి గమనించాను ఎవరైనా దానితో తాగడం చూసి ఎలా తాగాలో నేను కూడా నేర్చుకుందామని. అందరూ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు వెళ్ళిపోతున్నారు తప్ప ఆగి అది వాడడం లేదు. పక్కనే ఒకాయన ఇద్దరు పిల్లలతో వెడుతూ నాలాగే అనుమానం గా దానికేసి చూస్తున్నాడు. "ఇదెలా..." అని నేను పూర్తి చేసేలోగా "హి హ్హి" అని మల్లిక్ కార్టూన్ లో లాగ నవ్వి మౌనం వహించాడు. అప్పుడు ఇంక లాభం లేదు అని, అటుగా వెడుతున్న ఒక ఎయిర్ పోర్ట్ ఉద్యోగినిని అడిగా "దీనిలో నీళ్ళు తాగడం ఎలాగండి" అని - ఆవిడ ప్రశ్న ని తెలుగు లో అర్ధం చేసుకొని ఇంగ్లీష్ లో సమాధానం చెప్పడానికి ప్రయత్నించింది. "You put head under" అంటూ.. నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఎందుకంటే, సామాన్య పీక నిర్మాణం కలిగిన మానవుడు ఎవడూ నేల మీద రెండు కాళ్ళూ...

(మా) రాజమండ్రి విమానాశ్రయం.

Image
చిన్నప్పుడెప్పుడో ఒకసారి (అంటే ఇంచుమించు 1986 అనుకుంటా) - రాజమండ్రి నుంచి వాయుదూత్ విమానంలో హైదరాబాద్ వెళ్ళాము. విమానం ఎక్కడం అదే మొదటిసారి - ఆ వాయుదూత్ లో అంత ప్రమాదం ఉంటుంది అని తెలియదు - విమానం ఎక్కాలి అనే సరదాయే తప్ప. ప్రమాదం అని ఎందుకు అన్నానంటే మేము ఎగిరిన చాలా రోజుల తరువాత వేరే వాయుదూత్ విమానం కూలి పాపం అందులో వాళ్ళు అందరూ పోయారు. వెంటనే ప్రభుత్వం వారు మేల్కొని మొత్తం వాయుదూత్ నే రద్దు చేసారు అనుకోండి అది వేరే విషయం. అప్పుడు ఇప్పటిలా విరివిగా విమాన సర్వీసులు, వాటిమీద ప్రభుత్వ నిఘా ఉండేది కాదు. రాజమండ్రి విమానాశ్రయానికి బయల్దేరి, సగం దూరంలో మా వాహనం (ఆటో లెండి) చెడిపోతే అటుగా వెడుతున్న విమానాశ్రయం వారి జీప్ లో ఎక్కడం, అందులో ఉన్న ఆఫీసర్ - ఎంత పెద్ద ఉద్యోగమో మనకి తెలియదు కాని, ఆ ఎయిర్ పోర్ట్ అంతా తనదేననీ, విమానాలు ఎక్కడానికి వచ్చేవాళ్ళకి తను విమానం ఎక్కే అవకాశం ఉచితం గా ఇస్తూ మహా సేవ చేసేస్తున్నాననీ - అందువలన గారంటీ గా స్వర్గానికే వెడతాననీ నమ్మకం పెట్టుకున్నవాడిలా మొహం వేసుకొని మా వైపు మహా చిరాకుగా చూడడం ఇంకా గుర్తు :). అన్నట్టు ఆ ఫ్లైట్ లో కూర్చొని ఆ విశేషాలు వర్ణిస్తూ మా అమ్మగార...

ముంగండ గ్రామము ఎక్కడ ఉన్నది?

Image
ఇదిగో ఇక్కడ.. లేకపోతే.. ఇక్కడ.. ఆసియాఖండంలో భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో ముంగండ గ్రామము ఉన్నది :)

మా వూరి వంట ఫ్యాన్.

అన్నట్టు, ఈ నూనె లో కొలెస్ట్రాల్ లేదు అని ఊదరగొడుతున్నారు కాని, అసలు ఏ నూనె లోను, కొవ్వే తప్ప కొలెస్ట్రాల్ ఉండదని వీళ్ళకి ఎవరైనా చెబితే బాగుండును.

6:21 కారు.

6:21 కారు అంటే ఇదేదో ఫస్ట్ బస్సు టైం కాదు (మా నాయనమ్మ గారు బస్సు ని "కార్" అనేవారు - ఆ కాలం నాటి చాలామంది లాగే). మేము ఉన్న కమ్యూనిటీ లో ఒక పొరుగాయన ఉన్నాడు. వాన రానీ, మంచు పడనీ, కొంపలు మునిగిపోనీ - వీకెండ్ ఐతే తప్ప, ప్రతీ రోజూ పొద్దున్న ఆరుగంటల ఇరవై ఒక్క నిముషం అయ్యేసరికి కార్ స్టార్ట్ చేసి, గరాజ్ లోంచి బయటకి తీస్తాడు (6:21 ఏమిటో పెళ్లి ముహూర్తం లాగ అనిపిస్తుంది నాకు - అలా అనుకుందాము అంటే, ఇండియా వాడు కూడా కాదు). ఆ కార్ స్టార్ట్ చేసింది మొదలు, మఫ్లర్ (మనం సైలెన్సర్ అంటాము కదా - అదేలెండి - పొగ గొట్టం) చిల్లులతో జల్లెడ అయిపోయినట్టు ఉంది - గుర్రు మంటూ మంచి కోపం మీద ఉన్న కుక్కలాగా శబ్దం చేస్తూ ఉంటుంది. మనం ఇంట్లో ఎక్కడ ఉన్నా, అన్ని తలుపులూ, కిటికీ లు వేసి ఉన్నా సరే అది వినిపిస్తుంది. అది వినిపిస్తే 6:21 అయినట్టు లెక్క - 6:21 అయితే అది వినిపించాలని లెక్క. నేను కొన్ని ఏళ్ళ నుంచి 6:15 కి లేచి ఆఫీసు కి ఎనిమిదింటికల్లా వెళ్లాలని ప్రయత్నిస్తున్నాను కదా ("ఇదెప్పుడు చెప్పావు" అంటారా? ఇప్పుడే). అందుకని 6:21 కి పక్క మీద దొర్లుతూ "ఆ 8 కి ఆఫీసు కి వెళ్ళే పని రేపటినుంచి మొదలు ప...

అట్ల పెనం

Image
మాకైతే ఇప్పుడే జ్ఞానోదయం అయిందేమో తెలియదు మరి, చాలా మందికి ఇప్పటికే తెలిస్తే మాకు ఇప్పటికైనా తెలిసినందుకు (, లేకపోతె అందరికీ తెలియజేసే అవకాశం మాకు వచ్చినందుకు) సంతోషిస్తూ ఈ పోష్టేస్తున్నా. ఇండియా లో మన అందరి ఇళ్ళలో అట్లు వెయ్యాలి అంటే ప్రత్యేకం గా అట్ల పెనం ఉంటుంది కదా.. నిఖార్సైన ఇనుముతో, చక్కటి నగిషి (స్మూత్ సర్ఫేసు అన్నమాట) తో, చిన్న దొన్నె లా మధ్యలో కొంచెం కిందకి వంచబడిన పోత తో. దానిని చక్కగా ఇటక పొడి పెట్టి తోమి, వేడెక్కించి, ఒక అర చెంచాడు నూనె జల్లి దానిమీద దోసో, మజ్జిగ అట్టో వేసుకుంటే మరి పండగే. ఐతే, అమెరికా లో ఇలాంటివి చెయ్యాలి అంటే కరెంటు తో నడిచే నాన్ స్టిక్ పెనాలు దొరుకుతాయి. ఐతే, ఇనప పెనం మీద అట్టు వేసుకోవడానికి అలవాటు పడిన ప్రాణం దాని మీద వేసుకున్న అట్టు తింటేనే లేచి వస్తుంది (ముఖ్యం గా మజ్జిగ అట్టు). ఎవరో చెప్పగా విన్నాను - మన మెదడుకి కావాల్సి వచ్చే ఇనుము, ఈ అట్టు పెనం తయారు చేసే ఇనుము ఒకటే అని, ప్రతీ అట్టులోను కొన్ని ఇనుము రేణువులు ఈ రూపేణా మింగేస్తే మనకి కావాల్సిన ఇనుము అదే వచ్చేస్తుంది అనీను (సిటేషన్ నీడెడ్డు). ఆ మాట ఎలా ఉన్నా, మందపాటి ఇనుప పేనాలు వేడిని ఎక్కువ దాచుక...

మన పిల్లలు - వాళ్ళ పిల్లలు..

Image
ఈ మధ్య పిల్లల మీద పోస్టులు ఎక్కువ అయ్యాయి కదా? నాకు కూడా అలాగే అనిపించింది.. కాని తప్పదు :). ఈ టపా కి ఇన్స్పిరేషన్ తల్లిదండ్రులే. "doting parents" అని అంటారు కదా.. అలా అన్నమాట. ఇలాంటి వాళ్ళు - ఎవరైనా తమ ఇంటికి వచ్చారు అనుకోండి, వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి కొత్తగా నేర్చుకున్న మాటలు, పాటలు, ఆటలు చూపిస్తారు. వాళ్ళు మన ఇంటికి వచ్చారు అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి కొత్తగా నేర్చుకున్న మాటలు, పాటలు, ఆటలే చూపిస్తారు. రెంటిలోనూ తప్పు లేదు కాని, చాలా మంది వాళ్ళ పిల్లలే పిల్లలని, మిగిలిన వాళ్ళు ఎవరూ తమ అనుగ్రహ వీక్షణాలకి పాత్రులు కారనీ అన్నట్టు ప్రవర్తిస్తారు. పిల్లలు అందరూ పిల్లలే కదా? వాళ్ళ పిల్లలతో బాటు వేరే పిల్లల వైపు కూడా ఒక సారి చూస్తే పోయేదేముంది? అదీ, మనం మన పిల్లల్ని పక్కన పెట్టి వాళ్ళ పిల్లల్ని ముద్దు చేసినా కూడా!. పిల్లలతో నాకు బాగా నచ్చే నానుడి ఒకటి ఉంది (మా అమ్మగారు చెప్పినది) - "పిల్లల్ని చేరదీస్తే వస్తారు, కసిరితే పోతారు" అని. వాళ్లకి ఏమి తెలియదు కదా.. ఒక సారి తిట్టినా, వెంటనే పిలిస్తే భేషజాలు లేకుండా చిరునవ్వు మొహాలతో దగ్గరకి వచ...

పిల్లల్ని నిద్రపుచ్చడం

చంటి పిల్లలు సాధారణంగా రోజుకి ఇరవై గంటలు పడుకుంటారు (అది average అనుకోండి - కొందరు తక్కువ పడుకుంటారు. వాళ్ళ శరీరధర్మాన్ని బట్టి ఇది మారుతుంది). అందుకని వాళ్ళని పడుకోబెట్టడం అనేది సాధారణంగా మనం ప్రత్యేకించి చెయ్యాల్సిన పనిగా ఉండదు. నిద్రపోకుండా ఉంటే (ఒకటి-రెండు నెలలు ఉన్న పిల్లలు) కాళ్ళూ చేతులూ కదుపుతూ ఆడుకోవడమో, కబుర్లు చెబుతూ ఉండడం (ఉక్కు, ఉంగా లాంటివి), వస్తువులని చూస్తుండడం, మనుషులని ఫాలో అవుతూ ఉండడం చేస్తూ కాలక్షేపం చేస్తారు. ఐతే, కొన్నిసార్లు వాళ్లకి నిద్ర వచ్చినా తిక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు పడుకున్నంత సేపు ఎక్కడ ఉన్నారు అనేది తెలియదు కాని, ఏడిస్తే మాత్రం టాపు లేపెయ్యడం ఖాయం. వాళ్ళ ఏడుపులో "treble" పాలు ఎక్కువ ఉండడం వల్ల అది వినేవాళ్ళకి ఒక లెవెల్లో ఇరిటేషన్ కలిగిస్తుంది (మరి "bass" లో ఏడిస్తే ఎవరికీ వినిపించదని దేముడు ఆ సెట్టింగ్ ఇచ్చాడు అని మనం అర్ధం చేసుకోవాలి). ఇలా తిక్క ఏడుపు తీర్చడానికి మామూలు లాలిపాటలు, ఉయ్యాలల కంటే దగ్గరకి తీసుకొని పట్టుకోవడం ఉత్తమమని మా అనుభవం. మాకు పని చేసిన రెండు మూడు కిటుకులు: ఎత్తుకున్నప్పుడు మన మోచేతి ఒంపులో వాళ్ళ మెడ పైభా...

"అగులు" చెయ్యడం

Image
మనలో చాలా మందికి చిన్నప్పటి ఫోటోలలో ఒకటి కామన్ గా ఉంటుంది. అది - అబ్బాయైనా, అమ్మాయైనా, పాలుగారే పసిమోము మీద కనుబొమ్మల మధ్యలో పెట్టే నల్లటి అగులుచుక్క. దానిని మరి అందరూ అగులు అంటారో లేదో తెలియదు కాని, తూ గో లో మాత్రం అంటారని తెలుసు. పేరు ఏదైనా, అందాలొలికే ముద్దుల పాప మీద నుంచి దృష్టి మరల్చడానికి కొందరు, అలంకారం కింద కొందరూ, రెంటికిందా మరి కొందరు పిల్లలకి చుక్కపెడతారు. ఇప్పుడు కొంతమంది దానిమీద (చర్మానికి పడదు అనే) సందేహంతోనో, అగులు దొరక్కో, అది చెయ్యడం తెలియకో బొట్టుబిళ్ళలు, తిలకం వంటివి పెడుతున్నారు. సహజసిద్ధంగా తయారుచేసే అగులు చేసే హాని ఏమీ లేకపోగా, ఈ కెమికల్స్ తో చేసిన జిగుర్లు, తిలకాలు చర్మానికి చేటుచేస్తాయి. అందుకని అగులు చెయ్యడం ఎలాగో తెలుసుకుందాము. కావలసిన వస్తువులు: సగ్గుబియ్యం, మూకుడు (స్టైల్ గా "బాండీ"), అగ్గిపెట్టె, నీళ్ళు, టీ వడకొట్టుకునే చిక్కం (మెత్తటి (ఫైన్) జల్లెడ కూడా వాడవచ్చు). ముందుగా కొంచెం సగ్గుబియ్యం తీసుకొని, దానిని మూకుట్లో వేసి, చిన్న సెగమీద కలుపుతూ వేయించాలి. అది నల్లగా అయే వరకూ వేయించి, మూకుడుకి అంటుకుపోతుంది అనిపించే ముందు పొయ్యిమీదనుంచి దించాలి. ఆ త...

అదృష్టం (ఎవరికో కాని, ఇది మన దురదృష్టం)

కొన్ని వారాల నుంచి "మా" లో (ఆ ఛానల్ వాళ్ళు సినిమా ప్రకటనలు, కొత్త సినిమా వాళ్ళతో ఇంటర్వ్యూలు అవీ వెయ్యడానికి ఏదో ప్రొబ్లెంస్ వచ్చీ అనేకానేక వింత కార్యక్రమాలతో ప్రేక్షకుల మనసుల్ని దోచేసుకుందామని ప్రయత్నిస్తునడంతో) "అదృష్టం" అని ఒక ప్రోగ్రాం మొదలు అయింది. మా అదృష్టం అడుగంటి, అమెరికాలో ఉండిపోవడం, వచ్చే నాలుగు చానెళ్ళలో (ఆ మిగిలినవి జెమిని, తేజ మరియు "దృశ్య శ్రవణ యంత్రం - తొమ్మిది" (tv9) - వీటి సంగతి ఇంకెప్పుడైనా చెప్పుకుందాము) ఇదే కొంచెం బెటర్ అనిపించడంతో, అప్పుడప్పుడు ఈ షోకి దొరికిపోతున్నాము. ఇది అమెరికాలో NBC అనే ఛానల్లో చాలా పాపులర్ అయిన " Deal Or No Deal " అనే కార్యక్రమానికి చాలా పేద (పూర్) కాపీ. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి "ఓంకార్" అనే కుర్రాడిని తీసుకొచ్చారు (ఈ టీవీ లో ఏదో ప్రోగ్రాంలో దుమ్ము దులిపిన కారణంగా అతడిని ఇందులో ఇరికించారు అని ఎక్కడో చదివా). ఉండడానికి ఆ కుర్రాడు బాగానే ఉన్నాడు, భావవ్యక్తీకరణ, భాష అన్నీ బాగానే ఉన్నాయి కాని - "ఇలాంటి షోలు నడపాలి అంటే నువ్వు పిచ్చ సీరియస్ గా ఉండాలిరా అబ్బాయి" అని ఎవరో తప్పుదారి ...

ఐడియా సూపర్ సింగర్ కాలక్షేపం

మామూలుగా మనం "కాలక్షేపం" అంటే, పాజిటివ్ అర్ధంలో వాడుతూఉంటాము. "పురాణ కాలక్షేపం" అనో, "బాగా కాలక్షేపం అయింది" అనో, "ఏదో అలా కాలక్షేపం అయిపోతోంది" అన్నట్టు.. ఐతే, ఈ కాలక్షేపం మాత్రం తప్పకుండ నేగటివ్ అర్ధంలోనే (అందులో నాకు ఏమాత్రం అస్పష్టత లేదు). ఇంచుమించు ఆరునెలల నుంచి సాగదీస్తున్నారు. మొదటినుంచీ, దీనికి ఏదో "రియల్" రియాల్టీ షో అన్నట్టు రంగు అద్దాలని ప్రయత్నాలు జరిగాయి. (గాయకులు ఇతర గాయకులని, జడ్జిలని ఛాలెంజ్ చెయ్యడం - అలాంటి "పెట్టుడు" నాటకీయతతో). కొంతవరకు పరవాలేదు. సుమ చాలా రోజులు తన క్రియేటివిటీ తో నెట్టుకొనివచ్చింది ఆంఖర్ గా.. అయితే ఇప్పుడు ఆవిడ అమ్ముల పొదిలో అన్ని అస్త్రాలూ వాడబడి, ఇంకా ఏమి మిగిలినట్టు కనిపించడంలేదు. (ఆవిడ తప్పులేదు.. వారానికి కనీసం నాలుగు గంటలు అదే ప్రజలతో, అదే ప్రోగ్రాం చేస్తూ ఉంటే ఎవరి సృజనాత్మకత ఐనా సరే హరించుకుపోతుంది). ప్రతీ పాట తరవాత, "అద్భుతం", "ఆహా", "ఓహో" అని నచ్చినా నచ్చకపోయినా పొగడడం, గాయకులని ఏదో విధం గా మెచ్చుకోడానికి ప్రయత్నించడం తప్పకుండా చెయ్యమని ఆవిడకి ఆదేశాలు...

మా ఊరిలో చంద్రబోస్ గారు

Image
జూలై నాలుగున జరిగిన తానా సభలకి వచ్చిన శ్రీ చంద్రబోస్ గారు మా ఊరు (డేటన్) కి నిన్న (7/6/2009) విచ్చేశారు. ఇక్కడ ఉండేది పన్నెండో తారీఖు వరకు మాత్రమే అయినా, మధ్యలో మళ్ళీ వేరే ఊర్లలో మరిన్ని ప్రోగ్రాములున్నా, ఒక్క రోజే నోటీసు ఇచ్చి తొందర పెట్టినా సరే, పెద్దమనసు చేసుకొని మాదగ్గరకి రావడం మాకు సంతోషం కలిగించింది. మా ఊరి మొనగాళ్ళు, ముఖ్యంగా విజయ్ బొర్రా, శ్రీనివాస్ భవనం, ఫణి తెల్లా ఒక పట్టుపట్టి, ఒక్కరోజులో మొత్తం ఊరిలో ఉన్న చాలామందికి ఈ విషయాన్ని చేరవేసి, సాహిత్యాభిమానుల్ని బాగానే కూడగట్టారు. చంద్రబోస్ గారు పాటల రచయితగానే కాకుండా, ఈమధ్య ఐడియా సూపర్ సింగర్ లో న్యాయనిర్ణేతగా మనటీవీల ద్వారా ముందు మన ఇళ్ళలోకి, తరవాత ఆ కార్యక్రమంలోని తన సహజ, సుతిమెత్తని ప్రవర్తనద్వారా మా హృదయాలలోకి చొచ్చుకొని రావడం కూడా ఎక్కువమంది ఈ ప్రోగ్రాంకి రావడానికి సహాయం చేసింది. వారిని మంగళ వారం పొద్దున్నే ఊరికి తీసుకొని వచ్చి మా ఊరిలో ఉన్న ఏకైక ఆకర్షణ ఐన ఎయిర్ ఫోర్స్ మ్యూజియంకి తీసుకొనివెళ్లి (తెలియదు కాని, లోపల అంతాకలిపి ఒక రెండు మూడు మైళ్ళు నడక ఉంటుంది) బాగా తిప్పి తీసుకొనివచ్చాడు భవనం. మరి సాయంత్రం ప్రోగ్రాంకి భోజనాలు అ...

సిరివెన్నె(ఎ)లా?

ये जिंदगी నడవాలంటే हस्ते हस्ते నదిలో దిగీ ఎదురీదాలి అంతే అంతే హిరోషిమా ఆగిందా ఆటం బాంబేస్తే चल चकदे चकदे అంటే పడినా లేచొస్తామంతే హకూనా మటాటా అనుకో తమాషగా తలవూపీ వెరైటీగా శబ్దం విందాం అర్ధం కొంచెం సైడ్ కి జరిపి అదే మనం తెలుగు లో అంటే, dont worry bee haapee మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి ... ఆగండాగండి.. సీతారామ శాస్త్రి గారు.. ఏమిటండీ ఇది? "dont worry be happy" అనే వాక్యాన్ని తెలుగు అనుకోమంటారా (మళ్ళీ "మన" తెలుగు అని కూడా అన్నారు)? మీరు రాసింది త్రివిక్రమ్ తిరగారాశాడా లేక దేవిశ్రీ దిద్దుబాటు చేశాడా లేక మీకే అలా అనిపించిందా?? బాగుంది!! :).

మీనా బిస్కట్లు - రుక్మిణీ రీఫిళ్ళు.

మామూలుగా స్కూళ్ళ ముందర పిల్లల్ని ఊరించడానికి కొన్ని చోట్ల ఐస్ క్రీమ్ లు, మరి కొన్ని చోట్ల పీచు మిఠాయి, సోం పాపిడి, ఇంకొన్ని చోట్ల "మామ్మలు" మామిడికాయ పెచ్చుల మీద కారం రాసి, వేరు సెనగ కాయల్ని తంపడ వేసి, అమ్ముతుండడం జరుగుతుంది కదా.. అలాగే మా అభ్యుదయ పాఠసాల ముందు కూడా అమ్ముతుండే వారు. అవి ఎంత శుభ్రం గా వుంటాయో తెలుసు కాబట్టి, మా జార్జి మేష్టారు, ఆయన భార్య (ఆవిడ హెడ్ మాస్టర్ అన్నమాట) మా ఆరోగ్యం కాపాడడానికి ఒక బృహత్తర పధకం వేశారు. మొగల్తూరు లో మీనా బిస్కట్ కంపెనీ ఒకటి వుండేది. రోజూ ఒక టెంపో లాంటి పెద్ద కార్ లో అక్కడ నుంచి భీమవరం కి (అనుకుంటాను) ఒక కారుడు బిస్కట్ లు రవాణా అవుతూ వుండేవి. పిల్లల దృష్టి ఆ స్కూల్ బయట అమ్మే వస్తువుల నుంచి మరల్చడానికి మా టీచర్ లు రోజూ ఆ మీనా బిస్కట్ కంపెనీ నుంచి ఒక పెద్ద ప్యాకెట్ తీసుకొని వచ్చి అన్ని క్లాస్ ల లోనూ అమ్ముతూ వుండే వారు (బిస్కట్ 5 పైసా లకి - "నువ్వు ఈ కాలం వాడివి కాదురా బాబూ అంటారా? మీ తప్పు లేదు). ఆ ఐడియా మా జీవితాలని ఐతే ఏమి మార్చెయ్యలేదు గాని, మాకు మళ్ళీ కొట్టు మీదకి వెళ్లి బిస్కట్ లు కొనే బాధ తప్పించింది. దానికి తోడు, "స్కూల్...

మాష్ ఆ స్మాష్ ఆ (Mash or Smash)?

ఈ మధ్య మన వాళ్లు ఇలా మొదలెట్టారేమో తెలియదు గాని, మాటీవీ లో మాఊరివంట చూస్తుంటే బాగా తెలుస్తోంది.. "ఇప్పుడు మనం ఈ ఉడికిన బంగాళదుంపల్ని బాగా స్మాష్ చేసుకోవాలి" అంటూ :). "అవును.. అందులో తేడా ఏమి వుంది?" అంటారా? అనొచ్చు. ఎందుకంటే అది ఈ మధ్య బాగా అలవాటు అయిపోతే వాళ్ళు దేని బదులు స్మాష్ అంటున్నారో మరిచిపోయే అవకాశం కూడా వుంది. స్మాష్ అంటే (మరీ Webster పదకోశం అవీ తిరగెయ్యకండి గాని) స్థూలం గా "నాశనం చెయ్యడం" లాంటి అర్ధం వస్తుంది. మీకు తెలిసే వుంటుంది. ఆంగ్ల భాష లో "మాష్" అని వేరే పదం వుంది.. "చిదమడం" అనే అర్ధం లో. ఇప్పుడు అర్ధం అయింది కదా.. బంగాళ దుంపని స్మాష్ చేస్తే పెద్దగా ఏమీ మిగలదు తినడానికి అని :).అలాగే ఈ వంటల కార్యక్రమాల్లో "ఉప్పు", "పంచదార" అనే మాటలు విని చాల కాలం అయింది. అందరూ "సాల్టు", "సుగరు" (అహ నా పెళ్ళంట లో జంధ్యాల గారు వ్రాసినట్టు "సాల్టూ.. సాంబారు - నువ్వు కలుపుకోరా వెంకన్నా!" అన్నట్టు). ఇంగ్లీష్ లో ఒక వాక్యం మొదలు పెట్టడం.. మధ్యలో మిడిల్ డ్రాపు అయిపోవడం (ఆ వాక్యాన్ని పరాయి భాష లో ఎ...

తెలుగుబిజ్ కి ఏమయింది?

చాల రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా!. సైట్ డౌన్ అయిందేమో, లేదా వేరే పేరు తో వస్తోందేమో అనుకుంటూ.. నాకు తెలిసీ, ఇంటర్నెట్ లో పెద్ద ఎత్తున తెలుగు సినిమా సాహిత్యం దొరికే ప్రదేశం తెలుగుబిజ్. చాల సార్లు అందులోంచి సాహిత్యం ప్రింట్ చేసుకొని మిత్రులందరం కలసి బోలెడన్ని పాటలు పాడుకున్న జ్ఞాపకం వుంది. అర్ధాంతరంగా అంతర్జాలం లోంచి అంతర్ధానం అయింది. చూడబోతే మళ్ళీ అదే పేరు తో సైట్ వచ్చే అవకాశాలు సన్నగిల్లుతూ వున్నట్టు అనిపిస్తోంది. చక్రి, అను గార్లు - మీరు ఈ పోస్ట్ చూస్తే ఏమి జరుగుతోందో తెలియజెయ్యండి. లేదా, ఎవరైనా సరే, ఈ విషయం మీద ఏ మాత్రం సమాచారం వున్నా కామెంట్ ఇవ్వండి. ఒక వేళ వారికి ఆ సైట్ ను హోస్ట్ చెయ్యడం వీలు కాకపొతే వేరొకరు హోస్ట్ చెయ్యడమో, తెవికి లో దానిని ఉంచడమో చెయ్యవచ్చు. Streaming లేకపోయినా ఆ సైట్ విలువ ఏ మాత్రం తగ్గదు అని నా వుద్దేశ్యం.

భలే భలే ఇలియానా

నిన్న రాత్రి వచ్చింది ఈ ప్రోగ్రాం. ఏంఖర్: ఈ సినిమా లో మీ క్యారెక్టర్ ఏమిటి? ఇలియానా: నాది చాల బబ్లి క్యారెక్టర్ (సైడ్ లో వ్రేలాడుతున్న జుట్టు మొహం మీద పడకపోయినా సరే చేతితో వెనక్కి తోసుకుంటూ.. మళ్ళీ గట్టిగా తోస్తే ఎక్కడ వెనక్కి వెళ్ళిపోయి ముందరకి రాదో అన్నట్టు, కొంచెం తోసీ తోయ్యనట్టు గా లైట్ గా). ఏం: How did you enjoy acting in the movie? ఇలి: I enjoyed a lot. ఏం: మీరు తెలుగు లో చాలా సినిమాలు చేసేసారు కదా.. మరి తెలుగు లో ఎప్పుడు మాట్లాడడం మొదలు పెడతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.. ఇలి: (English లో నే లెండి) ఒకప్పుడు నేర్చుకుందాము అనుకున్నాను కాని, (తెలివైన ప్రేక్షకులు) ఖతర్నాక్, ఆట ఫ్లాపు చెయ్యడం తో ఇంట్రస్టు పోయింది. మళ్ళీ ఇప్పుడు జల్సా ఆడుతోంది కదా నేర్చుకోడానికి ట్రై చేస్తా. ఏం: How did you enjoy acting with lover boy Tarun? ఇలి: Lover boy ఆ.. ("ఇంకా ఈ జుట్టు మీద పడదేమిటీ? - నేను వెనక్కి నెడదాము అనుకుంటుంటే" అనుకుంటూ) ఏం: అదేనండీ.. ఇక్కడ అందరికీ తరుణ్ లవర్ బాయ్ కదా!. ఇలి: I enjoyed a lot. ఏం: ఇప్పుడు మీరు తెలుగు లో అందరికంటే ఎక్కువ రేమునేరషన్ తీసుకుంటున్నారు కదా.. ఇలి: wo...