మొన్న నోబెల్ ప్రైజులు ఒకటొకటిగా అనౌన్స్ అవుతూ ఉంటే "నోబెల్ ప్రైజులు అన్నీ అమెరికా వాళ్ళకీ యూరోప్ వాళ్ళకే వస్తాయేమో" అని మా నాన్నగారు అనడం నన్ను ఆలోచింపజేసింది. అదే సమయంలో శ్రీ వేమూరి వెంకటేశ్వర రావు గారు వ్రాసిన "భవిష్యత్తులో భారత దేశానికి మరో స్వర్ణ యుగం ఉందా?" అనే వ్యాసం చదవడం కూడా జరిగింది. అందులో ప్రస్తుత స్థితి కి కారణాలని చాలా బాగా విశ్లేషించారు. వాతావరణం తేలిక చెయ్యడానికీ కాదు కాని, ఇక్కడ ఒక సరదా జోక్ గుర్తుకి వస్తుంది:
Sometimes I lie awake at night, and I ask, "Where have I gone wrong?"/ Then a voice says to me, "This is going to take more than one night." -Charles M. schulz
ఈ జోకులో లాగా, కర్ణుడి చావు లాగా, దీనికి కోటి కారణాలు.వేమూరి గారు చెప్పిన విధం గా మన విద్య ఉద్యోగాలు సంపాదించడానికి, ఉన్న దానిని వాడుకోవడానికి (లాంగ్వేజ్ ఉపయోగించి ప్రోగ్రాం రాసినట్టు (vs. లాంగ్వేజ్ నే కనిపెట్టకుండా)) పనికొస్తోంది తప్ప, కొత్తది కనిపెట్టే దిశగా ప్రోత్సాహం మన దగ్గర తక్కువ. సమాజం లో కూడా ఎవరైనా ఏ డాక్టరేట్ ఓ చేస్తాను అంటే, అలాంటి వ్యక్తిని ఏదో ఇతరగ్రహం నుంచి వచ్చిన వాడిని చూసినట్టు చూడడం కద్దు. పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు కంపెనీ లు కూడా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలని బాగా ప్రోత్సహిస్తాయి (ప్రొఫెసర్ ల కి గ్రాంట్స్ అవీ బాగా ఇవ్వడం ద్వారా) అందుకని వాళ్ళు ఇతరత్రా ఏ ఇబ్బందులూ లేకుండా తలలు పరిశోధనల్లో దూర్చి నిశ్చింతగా పని చేసుకోగలుగుతారు. ఇప్పుడిప్పుడే కార్పొరేట్ కల్చర్ మన దగ్గర ప్రబలుతోంది కాబట్టి, ఇటుపై మన దగ్గర కూడా ఈ ధనప్రవాహం ఉంటుందని కోరుకోవడం లో అత్యాశ లేదు. కంపెనీ లు కూడా ఇంకోడి టెక్నాలజీ ని ఉపయోగించి పని చేసే కంటే, టెక్నాలజీ ని కనిపెట్టడం లో పెట్టిన ఖర్చు మీద లాభం దానిని అమ్మడం ద్వారా వస్తుంది అని గ్రహించాలి. IIT ల లాంటి విద్యా పీఠాలు కూడా ఎక్కువ redtapism లేకుండా కార్పొరేట్ లతో నేరుగా deal చెయ్యగలిగితే ఈ పని తొందరగా జరుగుతుంది. పరిశోధనలకి డబ్బు ఎక్కువ కేటాయిస్తే, అంతో ఇంతో తెలివైన బుర్రలు "అటు వెడితే డబ్బు కూడా లేదు" అనుకోకుండా అటు వెళ్లడానికి సిద్ధపడతారు.
పెద్దల ఆలోచనల్లో కూడా ఎంతో కొంత మార్పు రావాల్సి ఉంది. మార్కుల కోసం ఉన్నది బట్టీయం వెయ్యమని పిల్లల్ని పుష్ చెయ్యకుండా, ఎన్ని మార్కులు వచ్చాయన్నది కాకుండా, ఏమి నేర్చుకున్నాము అన్నది ముఖ్యం అని తెలియజెప్పాలి. నా స్వానుభవం ప్రకారం పిల్లలని ఒక సారి ఆ దారిలో పెడితే ఆ attitude జీవితాంతం వెంట ఉంటుంది. పిల్లలకి "వాట్" కంటే "వై" మీద ఎక్కువ concentrate చెయ్యాలని పెద్దలు బోధించిన నాడు మనకి కూడా పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఒకటి రెండు తరాల్లో తప్పకుండా పెరుగుతారు.
లోతైన భావాలు – ఆధునిక వ్యక్తీకరణల ‘జెన్నీ’!
1 week ago
6 comments:
నోబెల్ బహుమతులు సామ్రాజ్యవాద దేశాల వాళ్ళ కోసమే కానీ ఇండియన్స్ లాంటి స్లమ్ డాగ్స్ కోసం కాదు. నోబెల్ బహుమతి ఇప్పుడో పెద్ద జోక్. ఒబామాకి నోబెల్ ప్రదానం ఆ విషయం తెలియ చేసింది.
ఎక్జాక్ట్‌లీ. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు జరగాల్సింది విశ్వవిద్యాలయాల్లోనే. యునిక్స్ దగ్గర్నుండి గూగుల్ దాకా యూనివర్సిటీల్లో పుట్టినవే. మనదేశంలో దానికి వ్యతిరేకంగా ఉంది. కొత్తవి కనిపెట్టటం ఉద్యోగాలు చేసే సైంటిస్టుల పని అన్నట్లు తయారైంది!
మీరు చెప్పిన దానిలో కొంచెం నిజం ఉండకపోలేదేమో - కానీ, మన ప్రయత్నం (తద్వారా కృషి) మానకుండా ప్రయాణిస్తూ ఉండడమే. (టైటిల్ ఐతే "మనకి నోబుళ్ళు రావా/ఇవ్వరా" అని మార్చాలేమో) :).
నోబుల్లు,ఆస్కార్లు మనకోసం కాదు.అవి వాళ్ళకు మాత్రమే!
చాలా బాగా చెప్పారు , వేమూరి గారి వ్యాసం ఎప్పటినుంచో నా లో ఉన్న ప్రశ్నలు కు సమాధానం కొంచం దొరికింది. వేల సంవత్సారాల క్రితమే ఎన్నో కనుక్కున్న భారతీయులు గత వందల సంవత్సారాలలో ఏ విధం గానూ శాస్త్ర విజ్ఞానం లో పాల్గొన లేదు. ఇప్పటికీ మార్పు సూచనలు కనబడట్లేదు , మార్పు ఏ విధంగా వస్తుందో, ఎలా తీసుకు రావచ్చో అర్ధం కావట్లేదు
మనకు నోబెల్ ప్రైజ్ రావాలంటే ...కావాలంటే వీటికి వస్తాయి .
అవినీతి నోబెల్ - మన ఘనత వహించిన రాజకీయ నాయకులకి
సిగ్గు లేని వారి నోబెల్ - మనందరికీ ( ఎందుకంటే వెధవలని తెలిసి , ప్రత్యామ్నాయం వుంచుకొని కూడా ఓట్లు వేయని సిగ్గు మాలిన మనందరికీ )
ఇజాల గోల నోబెల్ - అసలు సమస్యలు వదిలేసి ఏదో ఒక ఇజం లో వోలలాడే వెధవలకి
మాతృక చచ్చిన జాతి నోబెల్ - అసలు మాతృక (original) ఆలోచనలు లేని దరిద్ర జాతి గ మనకీ ...
కుల నోబెల్ - కులం పేరుతో ఎప్పుడు కొట్టుకొని చచ్చే వారికి నోబెల్ ( మన సమాజానికే)
దద్దమ్మల నోబెల్ - ఇన్ని తెలిసి దద్దమ్మల్లా ( నాతో సహా) బ్రతుకుతున్న మన అందరికి
ఇలా ఎన్నో నోబెల్ ఇవ్వనవసరం లేకుండా ...మనవే అని గర్వంగా ( ఇది వ్యంగం ) వుంది ....
Post a Comment