Posts

కనులతో రాసే తొలి కవిత

వేదం సినిమా రిలీజ్ అప్పుడు అనుకుంటాను - "ఈ సినిమా లో పాటలు మీ స్టైల్ లో లేవు" అన్నందుకు శిల్పా చక్రవర్తి కి మా టీవీ ముఖం గా కీరవాణి చిన్న క్లాసు పీకేరు :). "నేను ఎవరికోసం మ్యూజిక్ చేస్తే అది వాళ్ళ స్టైల్ లో ఉంటుంది" అని. అది కూడా చాలా వరకు నిజమే అనిపిస్తుంది నాకు ఐతే. అన్నమయ్య కి, అల్లరి అల్లుడు కి, ఒకరికి ఒకరు కి, पहली नजर में కి వేర్వేరు విధాలుగా సంగీతం వినిపిస్తుంది. కానీ కొన్ని పాటల్లో కీరవాణి మార్కు తప్పనిసరి (పాత రోజుల్లో (తొంభైల్లో అన్నమాట) ఒక స్టాండర్డ్ డప్పు (మరీ మాస్ కాకుండా - క్లాసు కాకుండా), అదేదో జంత్ర వాయిద్యం - వినడానికి చాలా సుఖం గా ఉంటుంది అది - దాని పేరు నాకు తెలియదు ("అల్లరి ప్రియుడు" లో "అందమా నీ పేరేమిటి అందమా" లో మొట్ట మొదట వినిపించే వాయిద్యం). ఈ మధ్య వచ్చిన కీరవాణి పాటల్లో ఇది నాకు చాలా బాగా నచ్చింది: "కనులతో రాసే తోలి కవిత" - యంగ్ ఇండియా సినిమా నుంచి. దాన్ని వింటే ఎక్కడా ఆయన చేసిన పాట లాగ ఉండదు. దానికి తోడు కార్తీక్ - మరి చెప్పక్కర్లేదు కదా? అనంత శ్రీరాం కూడా వెళ్ళేకొద్దీ మరీ నచ్చేస్తున్నాడు.. చక్కని పాట: వినకపో...

వేటూరి కి నివాళి.

ఈ రోజే వేటూరి గారి మరణ వార్త తెలిసింది. వరుడు ఆడియో రిలీజ్ లో, ఆ తరవాత మా టీవీ ఇంటర్వ్యూ లో ఆయన ఇంకా మాట్లాడుతున్నట్టే ఉంది - ఇంతలో ఎంత పని జరిగింది!. ఆయన పాట ఏది విన్నా "ఇది వేటూరి పాట" అని యిట్టె తెలిసిపోయే ముద్రలు ఆయన పాటల నిండా ఎన్నో. ముఖ్యం గా ఒకే పదానికి రెండు అర్ధాలు వచ్చేలా వెంట వెంటనే రెండు లైన్స్ లో రాయడం.. ఎన్ని వేల పాటలు రాసిన, ఎన్ని విధాలుగా ఎన్నో పదాలని వాడినా, ప్రతీ కొత్త పాటలోనూ మళ్ళీ ఇంకో కొత్త పద ప్రయోగం తో ముందుకొచ్చి మనల్ని ఆశ్చర్యపరచం ఆయనకీ వెన్నతో పెట్టిన విద్య. కోరుకునే వాళ్ళ అభిరుచి, విజ్ఞత లని అనుసరించి ఎవరు ఏది అడిగితే వారికి అది రాసిపెట్టే లక్షణం ఆయన సొంతం. అందుకే కొన్ని పాటలు వింటే "ఈయన ఇలాగే రాస్తాడు" అని విసుక్కున్నా, వెంటనే మరో ఆణిముత్యం లాంటి పాటతో మనల్ని మురిపించి "ఆ ముందు పాట పాపం నాతో రాయించుకున్న వాళ్ళదే కాని నాది కాదర్రా" అంటూ చెబుతున్నట్టు అనిపిస్తుంది. నిన్నే ఈ మధ్య ప్రసారం అయిన "పాడుతా తీయగా" చూస్తుంటే అందులో "యమహా నగరి" పాట గురించి మణిశర్మ చెప్పారు - ఆ పాట ని ముందుగా రెండు చరణాలు గానే రాసారనీ, రి...

అట్ల పెనం

Image
మాకైతే ఇప్పుడే జ్ఞానోదయం అయిందేమో తెలియదు మరి, చాలా మందికి ఇప్పటికే తెలిస్తే మాకు ఇప్పటికైనా తెలిసినందుకు (, లేకపోతె అందరికీ తెలియజేసే అవకాశం మాకు వచ్చినందుకు) సంతోషిస్తూ ఈ పోష్టేస్తున్నా. ఇండియా లో మన అందరి ఇళ్ళలో అట్లు వెయ్యాలి అంటే ప్రత్యేకం గా అట్ల పెనం ఉంటుంది కదా.. నిఖార్సైన ఇనుముతో, చక్కటి నగిషి (స్మూత్ సర్ఫేసు అన్నమాట) తో, చిన్న దొన్నె లా మధ్యలో కొంచెం కిందకి వంచబడిన పోత తో. దానిని చక్కగా ఇటక పొడి పెట్టి తోమి, వేడెక్కించి, ఒక అర చెంచాడు నూనె జల్లి దానిమీద దోసో, మజ్జిగ అట్టో వేసుకుంటే మరి పండగే. ఐతే, అమెరికా లో ఇలాంటివి చెయ్యాలి అంటే కరెంటు తో నడిచే నాన్ స్టిక్ పెనాలు దొరుకుతాయి. ఐతే, ఇనప పెనం మీద అట్టు వేసుకోవడానికి అలవాటు పడిన ప్రాణం దాని మీద వేసుకున్న అట్టు తింటేనే లేచి వస్తుంది (ముఖ్యం గా మజ్జిగ అట్టు). ఎవరో చెప్పగా విన్నాను - మన మెదడుకి కావాల్సి వచ్చే ఇనుము, ఈ అట్టు పెనం తయారు చేసే ఇనుము ఒకటే అని, ప్రతీ అట్టులోను కొన్ని ఇనుము రేణువులు ఈ రూపేణా మింగేస్తే మనకి కావాల్సిన ఇనుము అదే వచ్చేస్తుంది అనీను (సిటేషన్ నీడెడ్డు). ఆ మాట ఎలా ఉన్నా, మందపాటి ఇనుప పేనాలు వేడిని ఎక్కువ దాచుక...

వేటూరి ఇంటర్వ్యూ

మొన్ననే "మా" టీవీ లో వచ్చిన వేటూరి గారి ఇంటర్వ్యూ. - చాలా రోజుల తరవాత మా టీవీ లో మాకు నచ్చిన ఒక ప్రోగ్రాం ఇది (లెట్స్ టాక్, వెలుగు వెలిగించు కూడా బాగున్నాయి). " గుర్తుకొస్తున్నాయి " అనుకుంటూ వందలకి వందల ఎపిసోడ్లు ఒకే వ్యక్తి తో తీసి బోర్ కొట్టించే కంటే ఇలాంటి "సరుకున్న" మనిషి అనుభవాలు, ఆలోచనలు అందరికీ తెలియజేస్తే అది రాబోయే తరాలకి ఉపయోగిస్తుంది. ఈ కార్యక్రమం మరిన్ని భాగాలు రావాలని కోరుకుందాం.

"స్వరపేటిక" మీద అదుపు

కొంతమంది ఏమి అంటున్నామో అని చూసుకోకుండా ఎంతొస్తే అంత గబుక్కున అనేస్తుంటారు. అవతలి వారి మీద అది ఎలా పని చేస్తుందో అని ఒక్కసారైనా ఆలోచిస్తే వాళ్లకి ఈ మాటల వల్ల కలిగే బాధని కొంతైనా నివారించవచ్చు. మనిషికి దేముడిచ్చిన పెద్ద ఆయుధం నోరే. రాయిని ఎలాగైతే దేముడి బొమ్మ చెయ్యడానికీ, ఇంకోడి తల బద్దలు కొట్టడానికీ వాడొచ్చో అలాగే, దీనిని కూడా ఇంకొకళ్ళని ఆహ్లాదపరచడానికీ (ఫీల్ గుడ్ చెయ్యడానికి), బాధ పెట్టడానికీ సమానంగా వాడొచ్చు. విషయం ఏమిటంటే కిందటి శనివారం ఒక స్నేహితుల ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి అని పిలిచేరు, వెళ్ళాము. పదిన్నరకి వ్రతం అని పిలిస్తే చాలామంది భోజనానికి మాత్రమే పిలిచినట్టుగా నెమ్మదిగా లేచి పన్నెండు అయిందో లేదో చూసుకొని మరీ వచ్చారు అనుకోండి. అందులో కొంతమంది ఆస్తికులు వస్తూనే , "వ్రతం అయిపోయిందా (లేదా)" అని కూడా confirm చేసుకోవడానికి ప్రయత్నించారు. మా మటుకు మాకు ఎవరైనా ఇటువంటి సందర్భాలలో పిలిస్తే వాళ్ళు పీటల మీద కూర్చొనే సమయానికి వెళ్ళి కాస్త వాళ్ళని సంతోషపెట్టాలని వుంటుంది. ముఖ్య కార్యక్రమం వ్రతం కదా!. బిక్కుబిక్కుమంటూ భార్య, భర్త కూర్చుని ఒక పక్క "ఎవరూ రావట్లేదు" అన...

మన పిల్లలు - వాళ్ళ పిల్లలు..

Image
ఈ మధ్య పిల్లల మీద పోస్టులు ఎక్కువ అయ్యాయి కదా? నాకు కూడా అలాగే అనిపించింది.. కాని తప్పదు :). ఈ టపా కి ఇన్స్పిరేషన్ తల్లిదండ్రులే. "doting parents" అని అంటారు కదా.. అలా అన్నమాట. ఇలాంటి వాళ్ళు - ఎవరైనా తమ ఇంటికి వచ్చారు అనుకోండి, వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి కొత్తగా నేర్చుకున్న మాటలు, పాటలు, ఆటలు చూపిస్తారు. వాళ్ళు మన ఇంటికి వచ్చారు అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి కొత్తగా నేర్చుకున్న మాటలు, పాటలు, ఆటలే చూపిస్తారు. రెంటిలోనూ తప్పు లేదు కాని, చాలా మంది వాళ్ళ పిల్లలే పిల్లలని, మిగిలిన వాళ్ళు ఎవరూ తమ అనుగ్రహ వీక్షణాలకి పాత్రులు కారనీ అన్నట్టు ప్రవర్తిస్తారు. పిల్లలు అందరూ పిల్లలే కదా? వాళ్ళ పిల్లలతో బాటు వేరే పిల్లల వైపు కూడా ఒక సారి చూస్తే పోయేదేముంది? అదీ, మనం మన పిల్లల్ని పక్కన పెట్టి వాళ్ళ పిల్లల్ని ముద్దు చేసినా కూడా!. పిల్లలతో నాకు బాగా నచ్చే నానుడి ఒకటి ఉంది (మా అమ్మగారు చెప్పినది) - "పిల్లల్ని చేరదీస్తే వస్తారు, కసిరితే పోతారు" అని. వాళ్లకి ఏమి తెలియదు కదా.. ఒక సారి తిట్టినా, వెంటనే పిలిస్తే భేషజాలు లేకుండా చిరునవ్వు మొహాలతో దగ్గరకి వచ...

పిల్లల్ని నిద్రపుచ్చడం

చంటి పిల్లలు సాధారణంగా రోజుకి ఇరవై గంటలు పడుకుంటారు (అది average అనుకోండి - కొందరు తక్కువ పడుకుంటారు. వాళ్ళ శరీరధర్మాన్ని బట్టి ఇది మారుతుంది). అందుకని వాళ్ళని పడుకోబెట్టడం అనేది సాధారణంగా మనం ప్రత్యేకించి చెయ్యాల్సిన పనిగా ఉండదు. నిద్రపోకుండా ఉంటే (ఒకటి-రెండు నెలలు ఉన్న పిల్లలు) కాళ్ళూ చేతులూ కదుపుతూ ఆడుకోవడమో, కబుర్లు చెబుతూ ఉండడం (ఉక్కు, ఉంగా లాంటివి), వస్తువులని చూస్తుండడం, మనుషులని ఫాలో అవుతూ ఉండడం చేస్తూ కాలక్షేపం చేస్తారు. ఐతే, కొన్నిసార్లు వాళ్లకి నిద్ర వచ్చినా తిక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు పడుకున్నంత సేపు ఎక్కడ ఉన్నారు అనేది తెలియదు కాని, ఏడిస్తే మాత్రం టాపు లేపెయ్యడం ఖాయం. వాళ్ళ ఏడుపులో "treble" పాలు ఎక్కువ ఉండడం వల్ల అది వినేవాళ్ళకి ఒక లెవెల్లో ఇరిటేషన్ కలిగిస్తుంది (మరి "bass" లో ఏడిస్తే ఎవరికీ వినిపించదని దేముడు ఆ సెట్టింగ్ ఇచ్చాడు అని మనం అర్ధం చేసుకోవాలి). ఇలా తిక్క ఏడుపు తీర్చడానికి మామూలు లాలిపాటలు, ఉయ్యాలల కంటే దగ్గరకి తీసుకొని పట్టుకోవడం ఉత్తమమని మా అనుభవం. మాకు పని చేసిన రెండు మూడు కిటుకులు: ఎత్తుకున్నప్పుడు మన మోచేతి ఒంపులో వాళ్ళ మెడ పైభా...