ఇంటర్నెట్ లో తెలుగు లో వ్రాయడం ఈ మధ్య సులభం కావడం చాలా మంది తెలుగు తెలిసిన వాళ్ళకి తెలుగులో వ్రాయాలనే ఉత్సాహం కలిగిస్తోంది - ఇది శుభ పరిణామం. మా బ్లాగ్ చూసో, మేము తెలుగు లో పంపించే వేగులు (ఈమైల్స్) చూసో చాలా మంది ప్రయత్నిద్దామని అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కరికీ ఒకోవిధంగా ఈమెయిలు లో వివరించే కంటే, ఒక చోట ఉంటే అందరికీ బాగుంటుంది అని ఈ ప్రయత్నం. ఇంటర్నెట్ లో ఈ సమాచారం అంతా ఉన్నా, కొన్ని సార్లు ఎక్కువ సమాచారం కూడా మనల్ని భయపెడుతుంది - ప్రయత్నించడం నుండి దూరం గా ఉంచుతుంది. అందుకని, సింపుల్ గా, తెలుగు లో ఈమెయిలు/చాట్ వ్రాయడం, అంతగా కావాలంటే వర్డ్ డాకుమేంట్ లో తెలుగు లో సేవ్ చేసుకోవడం ఎలా అనే విషయాల మీద ఇక్కడ దృష్టి కేంద్రీకరించాను. ట్రాన్స్లిటరేషన్ ఉపకరణాలు: ఇవి మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తూ పోతూ ఉంటే, తెలుగు లోకి మారుస్తాయి. అంటే, "telugu" అని టైపు చేసి స్పేస్ కొట్టగానే "తెలుగు" గా మారుస్తాయి. 1. గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్: http://www.google.com/transliterate/indic/telugu 2. క్విల్ప్యాడ్: http://www.quillpad.com/telugu/editor.html 3. లేఖిని http://lekhini.org వీటిలో మీర...
Comments
మీరు చెప్పిన దానితో నేను చాలా వరకు ఏకీభవిస్తున్నాను. నా ఆక్రోశం అంతా మా టీవీ మీదే కాని, అక్కినేని మీద కాదని మీరు గమనించాలి. అక్కినేని లేజేండే (సెలెబ్రిటి కంటే గొప్ప :) ) నేను కాదనను - అలాగే, ఎన్టీఆర్ తో ఇలాంటి ప్రోగ్రాం ఒకటి లేకపోవడం వల్ల తరవాతి తరాలకి ఆయన అనుభవాలు అతని నోటి నుంచి వినే అదృష్టం లేకుండా పోయింది అది కూడా నిజమే. ఐతే, అక్కినేని తో ఇదే ప్రోగ్రాం ని ఒక ఏడాది పాటు చెయ్యడం వల్ల చిత్రసీమ లో ని కనీసం ఇంకో ఇరవై మంది కళాకారుల అనుభవాలని వినే అవకాశం లేకుండా మా టీవీ ఎఫ్ఫెక్టివే గా ఆపేసింది అనేదే నా పాయింట్. కావాలంటే అక్కినేని తో వేరే "అక్కినేని అనుభవాలు" అనో, మరోటనో చెయ్యల్సింది - ఈ లోగా "గుర్తుకొస్తున్నాయి" ని మిగిలిన వారికి కూడా పంచి. ఉదాహరణకి, ఏ గుమ్మడి గారితోనో, శోభన్ బాబు గారితోనో గుర్తుకొస్తున్నాయి చేసి ఉంటే, ఇప్పుడు అవి వెలలేని నిధులుగా మిగిలి ఉండేవి కదా!.