కొన్ని వారాల నుంచి "మా" లో (ఆ ఛానల్ వాళ్ళు సినిమా ప్రకటనలు, కొత్త సినిమా వాళ్ళతో ఇంటర్వ్యూలు అవీ వెయ్యడానికి ఏదో ప్రొబ్లెంస్ వచ్చీ అనేకానేక వింత కార్యక్రమాలతో ప్రేక్షకుల మనసుల్ని దోచేసుకుందామని ప్రయత్నిస్తునడంతో) "అదృష్టం" అని ఒక ప్రోగ్రాం మొదలు అయింది. మా అదృష్టం అడుగంటి, అమెరికాలో ఉండిపోవడం, వచ్చే నాలుగు చానెళ్ళలో (ఆ మిగిలినవి జెమిని, తేజ మరియు "దృశ్య శ్రవణ యంత్రం - తొమ్మిది" (tv9) - వీటి సంగతి ఇంకెప్పుడైనా చెప్పుకుందాము) ఇదే కొంచెం బెటర్ అనిపించడంతో, అప్పుడప్పుడు ఈ షోకి దొరికిపోతున్నాము. ఇది అమెరికాలో NBC అనే ఛానల్లో చాలా పాపులర్ అయిన "Deal Or No Deal" అనే కార్యక్రమానికి చాలా పేద (పూర్) కాపీ. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి "ఓంకార్" అనే కుర్రాడిని తీసుకొచ్చారు (ఈ టీవీ లో ఏదో ప్రోగ్రాంలో దుమ్ము దులిపిన కారణంగా అతడిని ఇందులో ఇరికించారు అని ఎక్కడో చదివా). ఉండడానికి ఆ కుర్రాడు బాగానే ఉన్నాడు, భావవ్యక్తీకరణ, భాష అన్నీ బాగానే ఉన్నాయి కాని - "ఇలాంటి షోలు నడపాలి అంటే నువ్వు పిచ్చ సీరియస్ గా ఉండాలిరా అబ్బాయి" అని ఎవరో తప్పుదారి పట్టించినట్టు ఉన్నారు. ఇన్ని వారాల్లో ఇప్పటివరకు ఒకసారే నవ్వాడు (అది కూడా నేను చూడలేదు - శాంతి చెప్పింది) - అప్పటికీ యండమూరి వచ్చిన షోలో అనుకుంటాను, యండమూరి మిత్రుడు ఒక ఆయన అడిగాడు కూడాను - "మీరు అలా సీరియస్ గా ఉండకపోతే వచ్చే నష్టం ఏమిటి" - అని. Deal or No Deal లో ఒక మిలియన్ డాలర్లు బహుమతి ఐతే ఇక్కడ ఐదు లక్షలు. ఎంత చెట్టుకి అంత గాలి కాబట్టి పరవాలేదు. కానీ మరీ నీరసంగా "ఇన్-ది-సెట్" ప్రేక్షకులు కూడా లేకుండా, గిఫ్టులు reveal చేసే డబ్బాలు కూడా మరీ అట్టవి పెట్టేసి కొంచెం పీనాసితనం చూపిస్తున్నారు.
అన్నీ ఒక ఎత్తు, ఓంకార్ ఈ షోలో ఆడుతున్న వారితో డీల్ చేస్తున్న విధానం ఒక ఎత్తు. ప్రతీ మనిషికీ ఒక "పర్సనల్ స్పేస్" ఉంటుంది అని ఎవరైనా ఇతనికి చెబితే బాగుణ్ను. కళ్ళల్లో కళ్ళు పెట్టేసి, ఊపిరి తగిలేంత మీదకి వచ్చి "నీ అదృష్టం నేను డిసైడ్ చేస్తా" అనుకుంటూ - ఇబ్బందిగా నవ్వుతుండే గెస్ట్ ల మీద సైకలాజికల్ (అని అనుకుంటూ) ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. మొన్న ఒక షోలో రశ్మి (అప్పుడు "యువ", ఇప్పుడు "లవ్") వచ్చినప్పుడు కొరకొరా చూస్తూ మాట్లాడుతుంటే ఆవిడకి ఏమనిపించిందో కానీ మాకు మాత్రం "అయ్యో" అనిపించింది.
మీరు ఇవన్నీ చూడాలి అంటే తొందరగా ఈవారమో వచ్చే వారమో ప్లాన్ చేసుకొని చూసేయ్యడం బెట్టరు. "కీడెంచి మేలు ఎంచాలి" అనే నానుడి ప్రకారం నాకు ఐతే కొన్నాళ్ల తరవాత ఈ షో ఉండదేమో అనిపిస్తోంది :).
To his defense - ఓంకార్ "ఛాలెంజ్" అని ఒక షో లో కూడా వస్తున్నాడు.. అది బాగానే ఉంది మళ్ళీ (at least అతని పార్ట్) - అందుకని అతనిని కాకుండా, ఈ "అదృష్టాన్ని" ఫైర్ చేస్తే "మా", "మేము" అందరం బయటపడతాము.
కింద వీడియోలో చూడండి (రశ్మి కాదు కాని, కథ మాత్రం అదే).
లోతైన భావాలు – ఆధునిక వ్యక్తీకరణల ‘జెన్నీ’!
1 week ago
4 comments:
ఈకార్యక్రమంలో ఒక పేద కుర్రవాడొచ్చాడు ఈమధ్య. తండ్రి ఏదో షాపులో గుమాస్తాగా నెలకు మూడువేలు సంపాదిస్తున్నాడు. ఏదో అదృష్టం బాగుండి ఎంతోకొంత ఈకార్యక్రమం ద్వారా సంపాదిస్తే ఉపయోగపడుతుందని వాళ్ళ ఆశ, దాపరికాల్లేకుండా ఆవిషయం ముందే ఒప్పుకున్నారు కూడా. అయితే ఆ పిల్లాడిని ఓంకార్ ఆడుకున్న తీరు చూస్తే అతనిలో ఏమూలనో ఒక శాడిస్టు దాగివున్నాడని మీరనుకోకపోతే ఒట్టు. ఆ అబ్బాయిని చూస్తే జాలివేసింది. అప్పట్నించీ ఈ కార్యక్రమం చూడకూడదని ఒట్టు పెట్టుకున్నా
మీరు అమెరికాలో వుండి బ్రతికిపోయారండీ. కానీ మేము పడే హింస ఎవరితో చెప్పుకోము? మీరు మొదటి సారిగా అతన్ని మాటివి లోనే చూసినట్టున్నారు దేవుడి దయ వల్ల. స్థూలంగా అతని ప్రస్థానం చెప్పాలంటె జెమిని మ్యూజిక్ నుండి జీ తెలుగు అక్కడి నుండి మాటివి ప్రస్తుతానికి. నాకు తెలిసి ఈ పాపంలో ఈటివి ఏ సంబంధము లేదనే అనుకుంటున్నాను.ఆట(dance show) అని మొదలుపెట్టి ఇప్పుదు ఆట నాలుగో, ఇదో చేసేస్తున్నాడు జీ తెలుగులో. concept, producer, director అన్నీ తనేనట.ఒక్కొక్క ప్రొగ్రాంలో ఒక్కోరకమైన హింస. ప్రస్తుతం జీ తెలుగు చానల్ పేట్టామో అయిపోయామే. ఆటే కాకుండా ఏవో చిన్నపిల్లల ప్రోగ్రాములు కూడానూ.జీ తెలుగుకి సర్వం అతనే.
:-)
హబ్బో.. మేము ఒక్కళ్ళమే అనుకున్నాము.. ఐతే, ఈయన బాధితులు ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉన్నారు అన్నమాట :). ఇండియా లో ఉన్న వాళ్ళది ఒక రకం బాధ, ఇక్కడ ఇంకోటి. అక్కడ ఏ ఛానల్ పెట్టినా ఏదో హింస, ఇక్కడ పెట్టిన ఒక ఛానల్ లోను అదే హింస. అదీ ఒకందుకు మంచిదేలెండి - "అతి సర్వత్రా వర్జయేత్" అని తొందరలో తీరుతుందేమో.
నేను కూడా నిన్న చూసాను - concept, anchor and director అని అతని పేరే వేసారు.
Post a Comment