చాలా మంది మిత్రులతో, తెలిసినవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం దొర్లుతూ వుంటుంది - ముఖ్యంగా ఇక్కడ (అమెరికా లో). "పిల్లలు పుట్టినప్పుడు మూలకణాలు (స్టెం సెల్స్) దాచాలా వద్దా అని ఆలోచిస్తున్నాము" అని, "మీరు దాచారా" అనీ. తెలియని వాళ్ళ కోసం (మళ్ళీ తర్జుమా లో అర్ధం మారిపోకుండా చూసింది చూసినట్టు) - courtesy http://www.cordblood.com/cord_blood_faqs/cord_blood.asp :
Cord blood is the blood that remains in your newborn's umbilical cord after birth. Cord blood, like bone marrow, is an invaluable source of a type of stem cell that can be used in a variety of medical treatments.
Stem cells are the body's "master cells" because they are the building blocks of organ tissue, blood, and the immune system. Stem cells from bone marrow were first used to regenerate blood and immune cells for patients who had received chemotherapy for cancer. In the late 1980s, doctors started using cord blood stem cells to treat diseases that had previously been treated with bone marrow transplantation.
Today, cord blood stem cells are successfully being used and saving many lives. And they are being researched in an exciting new area of medicine called regenerative medicine, where scientists are using cord blood stem cells in experimental treatments for brain injury and juvenile diabetes.
Cord blood stem cells are biologically younger and have unique qualities and advantages compared to other stem cell sources like bone marrow:
There is less risk of complications when used in transplants.
They are immediately available, and early treatment can minimize disease progression.
Freezing them "stops the clock" and protects them from environmental damage, age, and common viruses that will impact the stem cells in our bodies over time.
Collection of cord blood is simple, safe, and painless.
ఆరోగ్య విజ్ఞానం ఊహిచనంత వేగం తో అభివృద్ది చెందుతోంది - ఒక పదేళ్ళు బ్రతికితే ఇంకో పదేళ్ళు బ్రతికించడానికి సరిపడా మందులు, పరికరాలు, చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. అటువంటప్పుడు "ఎందుకు పనికి వస్తుంది" అనుకోకుండా వీలుంటే ఇటువంటి వాటిని అందిపుచ్చుకోవడమే సబబుగా తోస్తుంది. ఎవరూ తమకి, తమ పిల్లలకి ప్రాణాంతక రోగాలు రావాలని కోరుకోరు. కాని, ఎప్పుడైనా అటువంటివి ఎదురైతే మాత్రం ఒక ఆసరా ఉంది అన్న ధైర్యం చాలా బలాన్నిస్తుంది. ఎక్కువ మంది దగ్గర విన్న ఆర్గుమెంట్ ఏమిటంటే, "ఇంత ఖర్చు పెట్టడం కష్టమండీ" అని. అది వింటే కోపం కంటే జాలి వేస్తుంది. ఎన్ని అనవసర ఖర్చులు పెడతాము మనం? నెలకి ఎనభై డాలర్లు పెట్టి కేబులు, వందలు పెట్టి బయట తినడమో చేస్తూనే ఉంటాము కదా? ఆరునెలలు అవి మానుకుంటే బిడ్డ కార్డ్ బ్లడ్ దాచచ్చు. "రేపు దాని ఉపయోగం ఏమిటో తెలియకుండా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టడం రిస్కు కదా" అని కూడా విన్నాను. ఏది రిస్కు? ఇప్పుడు రెండువేలు ఖర్చుపెట్టడమా లేక రేపు కష్టపడడమా? మా తాత గారి చద్దిమూట లోంచి ఒక ముద్ద: "డబ్బు దాచినప్పుడు దాచాలి, ఖర్చు వచ్చినప్పుడు మాత్రం చూసుకోకూడదు". నిజంగా. కొన్ని సార్లు లాజిక్కులు లాగకుండా ఏది సరి ఐనదో అది చెయ్యడమే తెలివైన పని. ఇప్పటికే స్టెం సెల్స్ ఉపయోగించి అనేక జబ్బుల్ని నయం చేయవచ్చని, పాడైన అవయవాల స్థానం లో కొత్తవి సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు. రేపు పొద్దున్న ఇంతకంటే మంచి విధానం ఇంకోటి రావచ్చు. కాని, ఇప్పుడు అందుబాటులో ఉన్న దీన్ని వాడుకోవడమే ఉత్తమం.
లోతైన భావాలు – ఆధునిక వ్యక్తీకరణల ‘జెన్నీ’!
1 week ago
1 comment:
ఖర్చుకు లోభించి భవిషత్తు పాడు చేసుకోరాదు.
Post a Comment