నా గూగుల్ మెయిల్ కి ఒక పెద్ద ఈస్తటిక్ ప్రాబ్లం వచ్చింది (వాడకుండా వుండలేను, ఎందుకంటే, తెలుగు లో మెయిల్ కొడితే యాహూ లో ఒక సారి తెలుగు లోను, మరొక సారి అదేదో కంకిరి పింకిరి భాష లోను వస్తోంది). నా గూగుల్ ఇన్ బాక్స్ సెలవు రోజు నాటి పూర్ణా మార్కెట్ లాగ "conversations" తో కిక్కిరిసి పోతోంది రోజులు గడిచే కొద్దీ.. నిన్న ఈ "archive" బటన్ ఏమి చేస్తుందో చూద్దాము అని కుతూహలం తో కొన్ని మెసేజ్ లు ఎంచుకొని, ఆ బొత్తాన్ని వత్తేను. వెంటనే నేను ఎంచిన సంవాదాలు అన్నీ మాయమైపోయి నా ఇన్ బాక్స్ మళ్ళీ స్లిమ్ము గా, ట్రిమ్ము గా రెడీ అయింది. (తరవాత గూగుల్ మెయిల్ హెల్ప్ లో ఇవి అన్నీ రాసేరు అన్న విషయం చూసాను అనుకోండి).
మాకు ఈ విషయం ముందే తెలుసు అంటారా? సరే. కాచుకోండి.
క్రిందటి సంవత్సరం అనుకుంటాను.. NPR Morning Edition కార్యక్రమం లో రాజమండ్రి లో పన్నులు వసూలు చెయ్యడానికి "డప్పుల మోత" కార్యక్రమం నిర్వహించారని, దానిలో భాగంగా, పన్నులు బకాయి ఉన్న మొండి వాళ్ళ ఇళ్ళకి వెళ్లి, ఆ వీధిలో అందరూ వినేలా, వాళ్లు "మేము బకాయిలు చెల్లిస్తాము కమీషనరు గారూ" అని అనేదాకా, ఆపకుండా డప్పులు వాయించారుట అని చెప్పారు. మళ్ళీ ఇవాళ "ఈనాడు" లో అమలాపురం లో అదే పని చేసి, ఒక నెల రోజుల్లో రికార్డు స్థాయి లో 65 లక్షల రూపాయల బకాయిలు వసూలు చేసారు అని ప్రకటించారు. (చూడబోతే డప్పులు వాయించడం అనేది పెద్ద ఉపాధి కల్పనా మార్గం గా వున్నట్టుంది).
ఇది కూడా తెలుసా? సరే.. ఇంకొకటి.
బ్రిటిష్ వారి కాలం నుంచి వస్తున్న ఒక వింత సంప్రదాయమట!. పోలీస్ శాఖ లో ఎవరైనా పై అధికారులు కొత్తగా విధుల్లో చేరితే కింద వాళ్లందరూ వాళ్ళ చేతికి పువ్వో, పండో కాకుండా "నిమ్మకాయలు" (అవి కూడా పసుపు రంగువి) ఇస్తారుట!. పసుపు శుభసూచకం అని బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టి అలా సెట్ చేసారుట.. మనం స్టిల్ ఫాలోయింగ్. అదీ సంగతి.
"ఆ.. చదివేసాం." అంటారా? ఫైనల్ గా ఇంకోటి.
www.picnik.com అనే సైట్ కి వెడితే మీరు ఎంత టాలెంట్ వుపయోగించి పాడు చేసిన ఫోటోలనైనా సరే, బాగుచెయ్యవచ్చు. Contrast, lighting, color, sharpness ఇత్యాది విషయాలతో బాటుగా, cropping, rotating, resizing లాంటివి కూడా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, red eye reduction లాంటివి చాల సులువుగా చెయ్యవచ్చు. అన్నిటికంటే ముఖ్య విషయం - ఇంద్ర లో బ్రహ్మానందం చెప్పినట్టు ఈ సైట్ "మీకు ఫ్రీ"!! :).
ఇది కూడా తెలుసా? సరే.. మిమ్మల్ని బాగు చెయ్యడం నా వల్ల కాదు :)
లోతైన భావాలు – ఆధునిక వ్యక్తీకరణల ‘జెన్నీ’!
1 week ago
1 comment:
హహ్హహ్హా...
Post a Comment