వ్యాయామ కండూతి
కండూతి అనే మాట ఈ వ్యవహారం లో వాడొచ్చో లేదో తెలియదు గాని, జంధ్యాల చెప్పినట్టు "మాట బాగుంది అని వాడేసాను". చాల ఆశ్చర్యం అనిపిస్తుంది. మా శ్రీహర్ష గాడు పుట్టి నాలుగు నెలలయింది. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, తిక్క వచ్చినా, తోచకపోయిన సరే, అప్రతిహతం గా కాళ్ళు, చేతులు అలా కొట్టేసుకుంటూనే వుంటాడు. చూడబోతే దేముడు మన శరీరం లో వ్యాయామానికి కావాల్సిన instinct అంతా program చేసి పంపిస్తాడు కామోసు. అందుకే (వీడే కాదు.. అందరు) పిల్లలూ ఇలా వీర లెవెల్లో కాళ్ళు చేతులు వూపేస్తూ మొత్తం శరీరాన్ని వ్యాయామం చేయిస్తూ వుంటారు :). కాలం గడిచే కొద్దీ (అంటే exercise అవసరం అయ్యే కొద్దీ) మనకి ఇహ లోక వ్యవహారాలు ఎక్కువ అయి, వ్యాయామానికి తిలోదకాలు ఇచ్చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాము అనిపిస్తుంది.
Comments
ఒక చేప మరిక చేపతో ఈవిధంగా అంటోందట.. "మనదీ ఒక జీవితమే .. ఒక ప్రేమ లేదు.. ఒక ఎదుగుదల లేదు.. ఒక స్నేహితుడు లేడు.. నీకు నేను నాకు నువ్వు తప్ప.. మనం ఎప్పటికి ఈ స్క్రీన్ సేవర్ నుంచి బయట పడతామో గానీ.. అప్పటి వరకూ మన జీవితాలు ఇంతే.."
కాబట్టి.. మీరు త్వరత్వరగా .. ఎప్పటికప్పుడు, లేటెస్టుగా మీవాడు చేసే పనులన్నీ ఒకదాని తరువాత ఒకటిగా పేర్చి మా అందరికి తెలియజేయగలరని మనవి. లేదనుకోండి, మీవాడిని ఎప్పటికీ ఇలాగునే మేమందరమూ మది గదిలో ఇక్కడున్నట్లుగా భంధించుకోవలసి వస్తుంది.. మీ వాడు ఎప్పటికీ నాలుగునెలల వాడిగానే ఉండిపోతాడు .. తస్మాత్ జాగ్రత్త..