నిన్న రాత్రి మధుమాసం (ఈ సినిమా గురించి చూసిన తరువాత రాస్తాను) చూసిన తరువాత ఏమి లేస్తాములే అని టీవీ ముందర కూర్చునేసరికి జల్సా సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షను రావడం మొదలు అయ్యింది "మా" లో.. ఈ మధ్య ఆడియో ఫంక్షన్స్ కూడా శతజయంతి ఉత్సవాలలాగా జరగడం (అందులో పెద్ద హీరో లవి అయితే మరీను) సాధారణం అయింది కాబట్టీ ఇది కూడా ఇంచు మించు అలాగే వుంటుంది అని అనుకున్నాను. దానికి తగ్గట్టు గానే అభిమానులు, సినిమారంగ ప్రముఖులతో బాటు చిరు, ఆయన కుటుంబ సభ్యులు కూడా అందరూ హాజరయ్యారు. కొన్ని డాన్సులు, మధ్య మధ్య లో అలీ, సునీల్ ల కబుర్లతో కార్యక్రమం నడిచింది. సునీల్ ఎందుకో (అంటే మరీ అసాధారణం కాదు గానీ ఆయన ఎప్పుడూ బయట వుండేప్పుడు సినిమాల లో వుండేంత ఫ్రీ గా, కామెడి గా వుండడం చూడలేదు - ఎందుకో చాల uncomfortable గా వుంటాడు వేదికలపై (నేను కూడా సునీల్ ఫ్యాన్ నే నండీ.. కాకపోతే మరి నిజం చెప్పాలి కదా)) కొంచెం out of place గా కనిపించాడు. అలీ పాత్ర ఏమిటంటే ఈ సినిమా గురించి నెగటివ్ గా మాట్లాడడం (కావాలనే అనుకోండి) - మిగిలిన వాళ్లు వచ్చి ఆయనకీ సమాధానం చెప్పడం లాగ design చేసారు ప్రోగ్రాం ని. కొన్ని సందర్భాల్లో (ఈ సినిమా తియ్యడానికి రెండేళ్ళు పట్టింది అన్నప్పుడు, పవన్ కల్యాణ్ డైరక్షన్ గురించి మాట్లాడినప్పుడు) అరవింద్ నిజం గానే కొంచెం ఫీల్ అయినట్టు కనిపించారు.
దేవి శ్రీ ప్రసాద్ ఇక్యనైనా శంకర్ దాదా ని వదిలిపెట్టాలి అని చూసిన ఎవరికైనా అనిపించడం సహజం.. ఎన్నాళ్ళు జనాల్ని "హూ హా.. హూ హా" అనిపిస్తారు చెప్పండి? కాని ఏ మాటకీ ఆ మాటే చెప్పుకోవాలి. దేవి మాత్రం స్టేజి మీద స్టెప్ లు "ఇరగదీస్తున్నాడు" అంటే, మన హీరో లు కొంతమంది వెయ్యడానికి కూడా చేతకాని స్టెప్ ల ని చాల సులువుగా వేసేస్తున్నాడు .. ఆలి చెప్పినట్టు సినిమాలలోకి రాబోతున్నాడేమో :). వేచి చూద్దాము.
ఏది ఏమైనా పాటలు మాత్రం బాగున్నట్టు అనిపిస్తున్నాయి. సిడి కొనుక్కొని సావకాసం గా విని చూస్తే చాలా నచ్చుతాయి అనిపిస్తోంది.
(ఈ బ్లాగు కి తెలుగు లో స్పందన తెలియజేయాలంటే http://lekhini.org కి గాని, http://www.google.com/transliterate/indic/Telugu కి గాని వెళ్లండి).
కేతు… తలపులలో! – స్మృతి సంచిక
1 week ago
2 comments:
ఫంక్షన్ కన్నుల పండుగగా వుంది కానీ ఆలీ మాటలు[కేకలు అనాలేమో?]పరమ రోత పుట్టించాయి.విషయానికి సంబంధం లేకుండా పిచ్చి పిచ్చి గా మాట్లాడాడు.
బ్లాగులకు అప్పుడే వర్డ్ వెరిఫికేషన్ అవసరం లేదనుకుంటానండి.అది తీసేస్తే కామెంట్లు రాసేవారికి సౌకర్యం గా వుంటుంది.ఇప్పటికి ఈ కామెంటు ని 3 సార్లు రాయాల్సొచ్చింది.
thank you :)
Post a Comment