కావలసిన పదార్థాల పట్టిక | |||
సంఖ్య | పదార్థం | పరిమాణం | కొలత |
1 | దాల్చిన చెక్క | 6 | ఒక అంగుళం ముక్కలు |
2 | లవంగాలు | 6 | సంఖ్య |
3 | ఏలక్కాయలు | 4 | సంఖ్య |
4 | ఉల్లిపాయలు | 2 | పెద్దవి |
5 | అల్లం-వెల్లుల్లి ముద్ద | 3 | టీ స్పూన్ |
6 | కొత్తిమీర | ¼ | కట్ట |
7 | పుదీనా | 12 | ఆకులు |
8 | వేరుశనగగుడ్లు | 1 | గుప్పెడు(ళ్ళు) |
9 | నువ్వులు | 1 ½ | టేబుల్ స్పూన్ |
10 | ధనియాలు | 1 ½ | టేబుల్ స్పూన్ |
11 | మెంతులు | ½ | టీ స్పూన్ |
12 | జీలకర్ర | 1 | టీ స్పూన్ |
13 | గసగసాలు | 1 ½ | టేబుల్ స్పూన్ |
14 | ఎండుమిరపకాయలు | 4 | సంఖ్య |
15 | కొబ్బరికోరు | 3 | టేబుల్ స్పూన్ |
16 | టమాటో ముద్ద | ½ | డబ్బా |
17 | చింతపండు గుజ్జు | 1 | టీ స్పూన్ |
ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి, కాగాక మిరపకాయలు/వంకాయలు వేసి, కొద్దిగా ఉప్పు కూడా వేసి మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. మెత్తగా కాకుండా మూడు వంతులు ఉడికేక పొయ్య ఆపెయ్యాలి.
ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి, కాగాక దాల్చినచెక్క, లవంగాలు, ఏలక్కాయలు వేసి వేగిన తరువాత ఉల్లిపాయలు వెయ్యాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అల్లం-వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పుదినా కూడా వేసి ఉల్లిపాయలు బాగా వేగేవరకు వేయించాలి.
ఈ క్రింది వస్తువులన్నింటినీ విడివిడిగా నూనె లేకుండా పొడిగా వేయించాలి: మెంతులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, వేరుశనగ గుడ్లు, గసగసాలు, ఎండుమిరపకాయలు, కొబ్బరికోరు.
పచ్చివాసన పోయే వరకు వీటిని వేయించి, చల్లరేక పొడిగా తిప్పాలి. దీనిలో వేయించిన ఉల్లిపాయలు వేసి, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి, కొద్దిగా నీరు పోసి ముద్దలా తిప్పుకోవాలి. (బాగా మెత్తగా కాకుండా కొద్దిగా మొరెంగా తిప్పుకోవాలి.)
ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసుకుని కాగాక, తిప్పుకున్న ముద్ద వేసుకుని కాసేపు వేయించాలి. ఇప్పుడు టమాటో ప్యూరీ (లేదా టమాటోలను ముద్ద చేసుకుని) కలపాలి. ఇంక కొద్దిగా పుల్లగా ఉండాలి అంటే కొద్దిగా చింతపండు గుజ్జు కలుపుకోవచ్చు. రుచి చూసుకుని కావలిస్తే ఉప్పు, కారం, ధనియాల పొడి కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక పది నిముషాలు ఉడికించి, దీనిలో మిరపకాయలు/వంకాయలు చేర్చుకుని తక్కువ మంట మీద బాగా ఉడకనివ్వాలి.
[మిరపకాయలు/వంకాయలు చేర్చుకున్న తరువాత పొయ్య మీద బదులు ఓవెన్ లో కూడా ఉడికించుకోవచ్చు. ఉష్ణోగ్రత 250F - 300F మధ్య పెట్టి నూనె కూర నించి విడివడే వరకు బేక్ చేసుకోవాలి.]
No comments:
Post a Comment