Posts

Breakfast that kids love:

Image
Here is something that worked with our 15 month old. We tried various recipes for breakfast - but one thing that kids always want is "change". If you try to give them something without a break, they turn away and you can never force them to eat - that is the rule. But well, there are exceptions to rules - such as this. Whole grains is always good, both for you and your kid. We took a couple of whole grain cereals - Raisin Bran and Honey Bunches of Oats. Mix them in equal amounts (dont worry if you dont stock up on both, it will work even if you choose one of these - but usually, the taste of "honey" in the Bunches of Oats helps them adapt to this quickly). Remove raisins from the Raisin Bran and Almond pieces from the Honey Bunches if you think he can't chew on them. Crush the cereal with your fingers so that it turns into little pieces (not so much as to make a powder). Add Soy Milk (Natural Silk, for example, as shown, which is available everywhere, need not n...

పొద్దుతిరుగుడు గింజల పొడి

పొద్దు తిరుగుడు గింజలు ఉత్తివి తింటే మరీ మట్టిలా వుంటాయి అని నా స్వంత అభిప్రాయం. ఐతే, మరి వాటిలో వున్న మంచి గుణాలు (http://www.nutritiondata.com/facts/nut-and-seed-products/3079/2) రావాలి అంటే తినక తప్పదు కదా.. ఇది ట్రై చెయ్యండి. మాకు ఐతే మహా బాగా నచ్చింది. పొద్దు తిరుగుడు గింజలు : 250 గ్రాములు ఎండు మిరపకాయలు : తగినన్ని ఉప్పు: తగినంత (ఇంక రేసిపె ఏమి వుంది అంటారా? :) - "పొద్దు తిరుగుడు గింజలతో పొడి చేసుకోవచ్చు" అని చెప్పడమే దీని ఉద్దేశ్యం) ముందుగా గింజలని తీసుకొని, ఒక మూకుట్లో దోరగా వేయించండి. (నూనె వెయ్యక్కర్లేదు). అయిన తరవాత, పక్కకి తీసుకొని, ఎండు మిరపకాయలని తీసుకొని వాటిని కొంచెం (చాల కొంచెం అన్నమాట) నూనెతో వేయించండి. ఇవి రెండూ చల్లారిన తరవాత మిక్సీ లో వేసుకొని మరీ ఎక్కువ కాకుండా (ముక్క-చెక్క లాగ) తిప్పుకొని, రుచిని బట్టి ఉప్పు చేర్చండి. అన్నం లో వేసుకొని తింటే అధ్బుతం గా వుంటుంది. మిక్సీ పట్టేప్పుడు మాత్రం జాగ్రత్త.. ఎక్కువ తిరిగింది అంటే నూనె ఊరి, ముద్ద అయిపోతుంది. ఈ పొడిని నూపొడి కి ప్రత్యామ్నాయం గా కూడా వాడుకోవచ్చు. మరింక ఎంజాయ్ చేసుకోండి. (ఇదే రేసిపె ని గుమ్మడి కాయ గిం...

బిర్యానీ పాటలు..

ఈ మధ్య నాకు బాగా నచ్చిన పాటల్లో ఈ ఆవకాయ్ బిర్యాని పాటలున్నాయి. ముందు విన్నప్పుడు సంగీతం బాగుందనీ, పాటలు బాగా పాడారు (ముఖ్యం గా కార్తీక్ వల్ల) అని అనిపించింది - కానీ, వినేకొద్దీ ఈ పాటల లోతు మరింత తెలవడం మొదలు పెట్టింది. సంగీత దర్శకుడు మణికాంత్ saxophone ప్లేయర్ ఏమో తెలియదు - మరి అలా కావడం వల్లో, లేదా, తన తండ్రి (కద్రి గోపాలనాధ్) saxophone విద్వాంసుడు కావడం వల్లో తెలియదు.. చాలా పాటల్లో రాగాలన్నీ (రాగం అంటే, పాట base అయిన రాగం కాదు - పాటలో గాయకులు "తీసే" రాగం) ఎంతో చక్కగా, సాఫ్ట్ గా, saxophone తో వాయించినట్టు వీనులవిందు గా వున్నాయి. ఇంకొన్ని సార్లు వినేకొద్దీ ఈ tunes అన్నీ కూడా చాలా కాంప్లెక్స్ గా అనిపించడం మొదలు పెట్టాయి. అంటే, సంగీత పరం గా కాదు (అవునేమో నాకు తెలియదు), సాహిత్యాన్నీ ఎంతో చక్కగా, ముందు రచయితకి చాలా స్వతంత్రం ఇచ్చి రాయించినట్టు, తరవాత ఆ సాహిత్యాన్ని, భావం కోల్పోకుండా tunes లో అత్యంత ప్రతిభ తో సర్దినట్టు, ఇంక ఏమేమో!!. అప్పుడు ఈ సాహిత్యాన్నీ మరికొంచెం క్లోజ్ గా వినడం మొదలు పెట్టాను.. వనమాలి పాటలు ఇదివరకు విన్నాము కానీ, ఇంట భావగర్భితం గా వ్రాయడం చూడలేదు.. భవిష్యత్తుల...

మిర్చి/వంకాయ కా సాలన్

ఈ బ్లాగర్ HTML తో ఇంకా కుస్తీ పడుతున్నా.. ప్రస్తుతానికి scroll down చేసి చూడండి. కావలసిన పదార్థాల పట్టిక సంఖ్య పదార్థం పరిమాణం కొలత 1 దాల్చిన చెక్క 6 ఒక అంగుళం ముక్కలు 2 లవంగాలు 6 సంఖ్య 3 ఏలక్కాయలు 4 సంఖ్య 4 ఉల్లిపాయలు 2 పెద్దవి 5 అల్లం-వెల్లుల్లి ముద్ద 3 టీ స్పూన్ 6 కొత్తిమీర ¼ కట్ట 7 పుదీనా 12 ఆకులు 8 వేరుశనగగుడ్లు 1 గుప్పెడు(ళ్ళు) 9 నువ్వులు 1 ½ టేబుల్ స్పూన్ 10 ధనియాలు 1 ½ టేబుల్ స్పూన్ 11 మెంతులు ½ టీ స్పూన్ 12 జీలకర్ర 1 టీ స్పూన్ 13 గసగసాలు 1 ½ టేబుల్ స్పూన్ 14 ఎండుమిరపకాయలు 4 సంఖ్య 15 కొబ్బరికోరు 3 టేబుల్ స్పూన్ 16 టమాటో ముద్ద ½ డబ్బా 17 చింతపండు గుజ్జు 1 టీ స్పూన్ ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి, కాగాక మిరపకాయలు/వంకాయలు వేసి, కొద్దిగా ఉప్పు కూడా వేసి మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. మెత్తగా కాకుండా మూడు వంతులు ఉడికేక పొయ్య ఆపెయ్యాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి, కాగాక దాల్చినచెక్క, లవంగాలు, ఏలక్కాయలు వేసి వేగిన తరువాత ఉల్లిపాయలు వెయ్యాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అల్లం-వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పుదినా కూడా వేసి ఉల్లిపాయలు బాగా...

బొమ్మన చందన..

(ఇది వ్రాసి చాలా రోజులు అయిపొయింది కానీ, అభిప్రాయం మాత్రం మారలేదు). వీకెండ్ లో బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ సినిమా చూసాము. EVV సమర్పించేసుకున్నాడు అని తెలియగానే కొంచెం ఖంగారు పడిన మాట వాస్తవమే కాని, ఇతర ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరూ లేకుండా మేమిద్దరమే చూడడం వల్ల ప్రమాదం ఏమి లేదు అని సమాధానపడి కూర్చున్నాము. సినిమాని కొంచెం నెమ్మదిగా మొదలు పెట్టినా, మధ్య మధ్యలో కొంచెం బోర్ కొడుతోందేమో అని అన్పించినా, మొత్తానికి కామెడీతో చాల బాగా నెట్టుకొని వచ్చేసాడు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి. అల్లరి నరేష్ శ్రీరామదాసు పేరడీ కొంచెం తగ్గించినా పెద్ద ప్రాబ్లం ఏమి అయి వుండేది కాదు. కొంచెం శ్రుతి మించుతోంది అనిపించగానే అది వదిలేసి కధలోకి వచ్చాడు. కృష్ణ భగవాన్ ఎప్పటిలాగే సంభాషణల రచయిత బలం మీద నెగ్గుకొని వచ్చేసాడు. ఐతే, కొన్ని పంచ్ లు ముందుగా వ్రాస్తారో లేక కృష్ణ భగవాన్ అప్పటికప్పుడు పుట్టిస్తాడో తెలియదు గాని, చెవులు రిక్కించి వింటే తప్ప వినపడని పంచులు చాల వాడేడు సినిమాలో. కోవై సరళ ఓవర్ ఆక్షన్ చెయ్యకుండా భరణి successful గా అడ్డు పడ్డాడు అనే చెప్పాలి. సినిమా చివర్లో మాత్రం ఆవిడ కామెడీ బాగా చేసింది. రెగ్యులర్ కమెడియన్...

కొత్త బంగారు లోకంలో..

నాకైతే ఇందులో పాటలు వింటుంటే భలే నిద్ర వస్తుంది. ముఖ్యం గా, "నిజంగా నేనేనా", "నేనని నీవని", "నీ ప్రశ్నలు" పాటలు వింటుంటే, అందులోనూ "నేనని నీవని" తో ఐతే మరీను. (ఈ పాటలు ఎలా వుంటాయో చాలామందికి ఈ పాటికి తెలిసి వుండడం, ఎక్కడైనా అప్లోడ్ చేయడం వల్ల పైరసీ ని పెంచిపోషించడం అవడం వల్ల ఆ mp3 లు ఇవ్వడం లేదు - రాగలహరి లాంటి చోట్ల ఎలాగు రియల్ ప్లేయర్ వెర్షన్ లు వున్నై కదా). "నీ ప్రశ్నలు" లో ఐతే బాలు గారు "బతుకంటే బడి చదువా..." అంటూ దీర్ఘం తీస్తుంటే అప్పుడే నిద్ర లేచిన వాడు కూడా మళ్ళీ deep sleep లో పడిపోయే అవకాశం ఎంతైనా వుంది. మొత్తానికి మిక్కి J మాయర్ నిలదొక్కుకునే మ్యూజిక్ డైరెక్టర్ లాగానే కనిపిస్తున్నాడు నాకు. హ్యాపీ డేస్ లో కొన్ని పాటలకి ఒకే బాణీని ఉపయోగించినా వెరైటీ చూపించాడు. కొత్త బంగారు లోకంలో మాత్రం అన్ని పాటలు వినసొంపుగానే వున్నాయి (కొన్ని సంగీతం, సాహిత్యం రెండూ బాగుంటే, మరికొన్ని సంగీతమే). "కళాశాలలో" పాట ఏ అనంతశ్రీరాంకో, రామజోగయ్యశాస్త్రికో ఇవ్వాల్సింది అనిపించింది. డైరెక్టర్ తన సినిమాలో పాటలు తనే రాసెయ్యడం అనే ప్రయత్నం ...

ఆయన స్టైలే వేరు

కలెక్టర్ కూడా సామాన్య ఆసుపత్రికే (ఈనాడు తూర్పు గోదావరి లో ఈ రోజు వచ్చిన కధనం - కొంచెం కూర్పు జరిగింది - విషయం మాత్రం అదే)." అది కాకినాడ సర్వజన ఆసుపత్రి. సమయం మధ్యాహ్నం 12:30జిల్లా కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేది వాహనం మెయిన్ గేటు ద్వారా ఆసుపత్రి ఔట్ పేషెంట్ విభాగం వద్దకు వచ్చి ఆగింది. ఇది గమనించిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పరుగులు తీసారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలకు వచ్చారేమోనని బెంబేలెత్తారు. ఇంటికి వెళ్ళిపోదామని సిద్ధమవుతున్న వైద్యులు, సిబ్బంది కూడా లోపలకి వెనుదిరిగారు. ఇంతలొ ఆ వాహనం నుంచి కలెక్టర్తో సహా మరో వృద్ధ జంట దిగింది. కలెక్టర్ వెంటే నడుస్తూ 18 వ నెంబర్ లో వున్న కంటి చికిత్సా విభాగానికి చేరుకున్నారు.మరోపక్క ఆసుపత్రి అధికారులు కలెక్టర్ ఎక్కడున్నారోనని వెదుకులాట మొదలుపెట్టారు. కలెక్టర్ మాత్రం తన వెంట వచ్చిన వృద్ధ దంపతులకు వైద్య పరీక్షలకోసం ఔట్ పేషెంట్ లో పేర్లు నమోదు చెయ్యాలని సిబ్బందిని కోరారు. ఆ దంపతులు తమపేర్లు హరివంశి ద్వివేది, తారాదేవి ద్వివేది గా వైద్యులకు తెలిపారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కలెక్టర్ తమ తల్లితండ్రులనే ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలుస...