మాష్ ఆ స్మాష్ ఆ (Mash or Smash)?

ఈ మధ్య మన వాళ్లు ఇలా మొదలెట్టారేమో తెలియదు గాని, మాటీవీ లో మాఊరివంట చూస్తుంటే బాగా తెలుస్తోంది.. "ఇప్పుడు మనం ఈ ఉడికిన బంగాళదుంపల్ని బాగా స్మాష్ చేసుకోవాలి" అంటూ :). "అవును.. అందులో తేడా ఏమి వుంది?" అంటారా? అనొచ్చు. ఎందుకంటే అది ఈ మధ్య బాగా అలవాటు అయిపోతే వాళ్ళు దేని బదులు స్మాష్ అంటున్నారో మరిచిపోయే అవకాశం కూడా వుంది. స్మాష్ అంటే (మరీ Webster పదకోశం అవీ తిరగెయ్యకండి గాని) స్థూలం గా "నాశనం చెయ్యడం" లాంటి అర్ధం వస్తుంది. మీకు తెలిసే వుంటుంది. ఆంగ్ల భాష లో "మాష్" అని వేరే పదం వుంది.. "చిదమడం" అనే అర్ధం లో. ఇప్పుడు అర్ధం అయింది కదా.. బంగాళ దుంపని స్మాష్ చేస్తే పెద్దగా ఏమీ మిగలదు తినడానికి అని :).అలాగే ఈ వంటల కార్యక్రమాల్లో "ఉప్పు", "పంచదార" అనే మాటలు విని చాల కాలం అయింది. అందరూ "సాల్టు", "సుగరు" (అహ నా పెళ్ళంట లో జంధ్యాల గారు వ్రాసినట్టు "సాల్టూ.. సాంబారు - నువ్వు కలుపుకోరా వెంకన్నా!" అన్నట్టు). ఇంగ్లీష్ లో ఒక వాక్యం మొదలు పెట్టడం.. మధ్యలో మిడిల్ డ్రాపు అయిపోవడం (ఆ వాక్యాన్ని పరాయి భాష లో ఎలా పూర్తి చెయ్యాలో తెలియక).. చెప్పాలంటే చిరాకు కలిగించే విషయాలు చాలా వున్నాయి.. వీలు వెంబడి చెప్పుకుందాము.

Comments

Anil Dasari said…
వచ్చీ రాని భాష మాట్లాడి రెండు భాషలనీ నాశనం చెయ్యకుండా శుభ్రంగా తెలుగులోనే చెప్పొచ్చుగదా. ఎప్పటికి తెలుసుకుంటారో వీళ్లు.

http://anilroyal.wordpress.com
I pity our Telugu people. 'Aandhrulu aarambha shoorulu' is right in the context of English speaking. Start a sentence, and a middle drop follows.

2 Telugu bloggers: Help me to blog in Telugu. Give me instructions to blog in Telugu. My E-mail is an.ancient.saint@gmail.com

Sathyameva Jayate.

Thank you.
లేఖిని యొక్క సరైన చిరునామా: lekhini.org.
రామ said…
వీవెన్ గారి వ్యాఖ్య వల్ల సవరించబడినది: వీవెన్ గారికి నెనర్లు.

గీతాచార్యులవారు,
తెలుగు లో బ్లాగు వ్రాయడం చాల సులువు. మొదటగా, http://www.lekhini.org కి గాని, http://www.google.com/transliterate/indic/Telugu కి వెడితే, అక్కడ మీరు తెలుగు లో వ్రాయడం మొదలు పెట్టవచ్చు.. అప్పుడు ఇలాంటి బ్లాగు కామెంట్ లు అవీ తెలుగు లో వ్రాయడానికి వీలు అవుతుంది. తరవాత, గూగుల్ వారి బ్లాగ్స్పోట్ .కం http://www.blogspot.com (or wordpress at http://www.wordpress.com) లో బ్లాగ్ ఎకౌంటు తీసుకుంటే (ఉచితం) మీ బ్లాగు కి layout అవీ ఎంచుకొని వ్రాయడమే. చాల వరకు అందులో పనులు intuitive గానే వుంటాయి.
అలాగే, గూగుల్ గ్రూప్స్ (గ్రూప్స్.గూగుల్.కం) లో telugublog అని ఒక గ్రూప్ వుంది. దానిలో, తెలుగు లో వ్రాయడం ఎలా, మరియు బ్లాగ్ ను ప్రారంభించడం ఎలా, అనే విషయాల మీద చాల విపులమైన పత్రములు దొరుకుతాయి. (http://groups.google.com/group/telugublog).
జయీభవ!!.

Popular posts from this blog

పాలకూర అన్నం

కంప్యూటర్ లో తెలుగు వ్రాయడం (Telugu in your computer)

మంచి మనిషి.