నిన్నటి ఐడిల్ బ్రెయిన్ లో శ్రీనివాస్ కంచిభొట్ల వ్రాసిన వ్యాసంలోంచి ("GRE English" పదాలు ఉపయోగించి రాసే చాలా పొడవైన వాక్యాలని మినహాయిస్తే ఇతడు వ్రాసే ఆర్టికల్స్ నాకు నచ్చుతాయి :) ): "The producer needs to be rapped on the knuckles for letting the production run amuck." అంటే, ఏమంటున్నారంటే, అల్లు అరవింద్ ని మాస్టారు బల్ల దగ్గర కి రమ్మని, చెయ్యి తిరగవేసి వుంచి, వేళ్ళ మీద బెత్తం తో (లేదా స్కేల్ తో) "ఈ సినిమా కి ఇన్ని కోట్లు పెట్టడం తప్పేనా?" అంటూ రెండు మూడు వెయ్యమని. ఊహించుకుంటే భలే నవ్వు వస్తుంది. అరవింద్ అన్నాను కాబట్టి నవ్వుతున్నాం కాని, చిన్నప్పుడు కొంతమంది శాడిస్ట్ మాస్టర్లు మా క్లాస్ లో పిల్లల్ని ఇలా శిక్షిస్తే నాకు పిచ్చ కోపం వచ్చేది. తలుచుకుంటే ఇప్పటికీ వస్తుంది. మనసు లో నే శాపనార్ధాలు పెట్టేవాడిని. కొంతమందికి తగిలే వుండొచ్చు. ఐతే ఇప్పుడు అలాంటి వాళ్ళు తగ్గారు అనే అనుకుంటాను.
Figurative గా రాసేరు కాబట్టి కంచిభొట్ల మీద కోపం లేదు లెండి :).
ఒక యోగి జీవన గాథ
5 days ago
1 comment:
mee blog lo vishayalu baagunnayi.
ilage continue cheyandi.
Post a Comment