Friday, August 5, 2011

ఇష్టం అంటే...

"నాన్నంటే నాకిష్టం"
"నాకు కూడా శ్రీహర్షబాబంటే బోలెడంత ఇష్టం"
"నాన్నా.."
"ఊ..."
"ఇష్టం అంటే?"
".................. ఇష్టం అంటే, నువ్వు ఎప్పుడైనా తమ్ముని కొట్టడం, తోసెయ్యడం చేస్తావు కదా.. అప్పుడు నాన్న 'హన్నా.. అలా చెయ్యకూడదు' అని కేకలేస్తారు కదా.. కాని వెంటనే ఇలా పట్టేసుకుంటారు - అదీ ఇష్టం అంటే" నాన్నకి ఏమి చెప్పాలో తెలియలేదు.

"ఓహో...." శ్రీహర్ష బాబుకి మాత్రం చక్కగా అర్ధం అయింది!! :).

5 comments:

Vandana said...

బాగుంది అండి. ఫోటో యిటు వైపు తిప్పి వుంటే యింకా బాగుండేది.

రామ said...

వందన.. అంటే, కొంచెం కవి హృదయం చూపించడానికి ప్రయత్నించాను :).

Vandana said...

బాగుంది. మణిరత్నం సినిమాలలో లాగా వెరైటీ గా వుంది.

రామ said...

అలా అన్నావా? నేను మణి'రత్నం' కాదు కదా మణి'రాయి' ని కూడా కాదు :)

ఎందుకో ? ఏమో ! said...

miku manchi manasunnadi

marokariki margam chuputhunnaru

anni postu laki kalipi ee commet ni sweekarinchagalaru

nice effort

?!