కావలసిన పదార్థాలు: బియ్యం - 3 రైస్ కప్పులు. పాలకూర - ఒక పెద్ద కట్ట. ఉల్లిపాయలు - పెద్దది ఒకటి. పచ్చిమిరపకాయలు - 6. జీడిపప్పు - 1/2 కప్పు. మిరియాలు - 1/2 చెంచా. లవంగాలు - 4. మినప్పప్పు - 1 చెంచా. ఆవాలు - 1/2 చెంచా. జీలకర్ర - 1 చెంచా. ఉప్పు - తగినంత. గరం మసాలా పొడి - 1/2 చెంచా. తయారు చేయు విధానం: ముందుగా అన్నం వండుకోవాలి. మిరియాలని పొడి చేసుకోవాలి. పాలకూరని శుభ్రంగా కడిగి, తరగాలి. ఈ పాలకూర తరుగు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు మిక్సీలో వేసి ముద్దలా తిప్పాలి. మూకుట్లో నూనె వేసి లవంగాలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేయించి అవి బాగా వేగాక ఈ పాలకూర ముద్దని వేసి బాగా కలపాలి. ఇప్పుడు మంటని కాస్త తగ్గించి ఈ ముద్దని 10-15 నిముషాలు బాగా ఉడకనివ్వాలి. తరువాత ఇందులో తగినంత ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన అన్నం వేసి అంతా బాగా కలపాలి. మంట మరికాస్త తగ్గించి, మధ్య మధ్యలో కలుపుతూ ఒక 15 నిముషాలు ఉంచాలి. ఉప్పు అవీ చూసుకుని ఇంక ఆపెయ్యచ్చు. ఇది తయారు అయ్యాక ఒక ప...
Comments
ప్రవీణ్ శర్మ/శంకర్ .. మేము పుట్టినప్పటినుంచీ డిగ్రీ, పెళ్లి అయ్యి అమెరికా వచ్చే వరకు ముంగండలోనే. మధ్యలో వెడుతూ వస్తూ ఉన్నా ఈ ఏడాది ఒక నాలుగు నెలలు మకాం వేసాను (నేను, పిల్లలు). మా వాడు అంతకు ముందే నేర్పిన తెలుగు కి మరింత పదును పెట్టుకున్నాడు. ఫలితం ఇదీ :). మేము విష్ణువాలయం వీధిలో ఉంటాము. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ఆ చక్కటి పల్లెలోనే. -- శాంతి.
ప్రవీణ్.. మేము జగ్గన్నపేట లో రెండేళ్ళు ఉన్నాము. -- రామ.