కావలసిన పదార్థాలు: బియ్యం - 3 రైస్ కప్పులు. పాలకూర - ఒక పెద్ద కట్ట. ఉల్లిపాయలు - పెద్దది ఒకటి. పచ్చిమిరపకాయలు - 6. జీడిపప్పు - 1/2 కప్పు. మిరియాలు - 1/2 చెంచా. లవంగాలు - 4. మినప్పప్పు - 1 చెంచా. ఆవాలు - 1/2 చెంచా. జీలకర్ర - 1 చెంచా. ఉప్పు - తగినంత. గరం మసాలా పొడి - 1/2 చెంచా. తయారు చేయు విధానం: ముందుగా అన్నం వండుకోవాలి. మిరియాలని పొడి చేసుకోవాలి. పాలకూరని శుభ్రంగా కడిగి, తరగాలి. ఈ పాలకూర తరుగు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు మిక్సీలో వేసి ముద్దలా తిప్పాలి. మూకుట్లో నూనె వేసి లవంగాలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేయించి అవి బాగా వేగాక ఈ పాలకూర ముద్దని వేసి బాగా కలపాలి. ఇప్పుడు మంటని కాస్త తగ్గించి ఈ ముద్దని 10-15 నిముషాలు బాగా ఉడకనివ్వాలి. తరువాత ఇందులో తగినంత ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన అన్నం వేసి అంతా బాగా కలపాలి. మంట మరికాస్త తగ్గించి, మధ్య మధ్యలో కలుపుతూ ఒక 15 నిముషాలు ఉంచాలి. ఉప్పు అవీ చూసుకుని ఇంక ఆపెయ్యచ్చు. ఇది తయారు అయ్యాక ఒక ప...
Comments
మీరు చెప్పిన దానితో నేను చాలా వరకు ఏకీభవిస్తున్నాను. నా ఆక్రోశం అంతా మా టీవీ మీదే కాని, అక్కినేని మీద కాదని మీరు గమనించాలి. అక్కినేని లేజేండే (సెలెబ్రిటి కంటే గొప్ప :) ) నేను కాదనను - అలాగే, ఎన్టీఆర్ తో ఇలాంటి ప్రోగ్రాం ఒకటి లేకపోవడం వల్ల తరవాతి తరాలకి ఆయన అనుభవాలు అతని నోటి నుంచి వినే అదృష్టం లేకుండా పోయింది అది కూడా నిజమే. ఐతే, అక్కినేని తో ఇదే ప్రోగ్రాం ని ఒక ఏడాది పాటు చెయ్యడం వల్ల చిత్రసీమ లో ని కనీసం ఇంకో ఇరవై మంది కళాకారుల అనుభవాలని వినే అవకాశం లేకుండా మా టీవీ ఎఫ్ఫెక్టివే గా ఆపేసింది అనేదే నా పాయింట్. కావాలంటే అక్కినేని తో వేరే "అక్కినేని అనుభవాలు" అనో, మరోటనో చెయ్యల్సింది - ఈ లోగా "గుర్తుకొస్తున్నాయి" ని మిగిలిన వారికి కూడా పంచి. ఉదాహరణకి, ఏ గుమ్మడి గారితోనో, శోభన్ బాబు గారితోనో గుర్తుకొస్తున్నాయి చేసి ఉంటే, ఇప్పుడు అవి వెలలేని నిధులుగా మిగిలి ఉండేవి కదా!.