Friday, July 18, 2008

సెన్సార్ కత్తెర

సెన్సార్ కత్తెరని ఈమధ్య మార్కెట్ లోకి తీసుకొని వెళ్లి పదును పెట్టించి తీసుకొని రావడానికి ప్రయత్నాలు జరిగాయని తెలిసి సంతోషించాను. దాని వల్ల ఏమి ఒరుగుతుంది, ఏమి ఒరగదు అనేదానికన్నా ముందు, ప్రయత్నం జరగడం హర్షణీయం. అందులో నాకు నచ్చినవి రెండున్నాయి. ఒకటి కులం పేరు మీద వ్యంగ్యం, లేదా కులానికి సంబంధించిన రెఫెరెన్సుల మీద సీరియస్ గా వుండాలి అని నిర్ణయించుకోవడం. బయట కొట్టుకు చచ్చేది కాక మళ్ళీ సినిమాలలో కూడా కులం గోల ఎందుకు? మనం సినిమాలలో చూపించేది (చెడు మాత్రం) తు.చ. తప్పకుండ పాటించడానికి ఏళ్ళనుంచీ అలవాటు పడ్డాము. మంచి చెప్పకపోతే పోయే, చెడు నేర్పకుండా వుంటే చాలు అనుకునే టైం వచ్చింది. ఇది కొంచెం స్లో పాయిసన్ లాంటిది. వెంటనే effect చూపించకపోయినా, సమాజంలో మనం ప్రవర్తించే తీరుని తప్పక ప్రభావితం చేస్తుంది. అందుకని, దానిని కొంచెమైనా కంట్రోల్ చేద్దామని అనుకోవడం మంచిదే. రెండోది వ్యక్తుల physical disabilities ని వెక్కిరించే పిలుపులు, తిట్లు. "పోట్టోడా, గుడ్దోడా, కుంటోడా, ముసలోడా" లాంటి పిలుపులు. ఎవడైనా ఇంకొకడిని వాడి రూపు రేఖలని, అవిటి తనాన్ని బట్టి పిలవడం ఒక మానసికరుగ్మత!. ఏం? ఇవాళ చక్కగా ఉన్నవాడు రేపు ఏ యాక్సిడెంటో అయితే "కుంటోడో, గుడ్దోడో" అవడా? ఇంక పదేళ్ళు పొతే ఇవాళ ఇతరులని పిలిచే వాడు రేపు "ముసలోడు" అవడా? దానిని ముందు సినిమాలలోనుంచి బయటకి పంపిస్తే తరవాత జనాలు ఉపయోగించడం తగ్గిస్తారు (ఇది కూడా పైన చెప్పిన కారణం వల్లనే - మనం సినిమాలని గంగిరెద్దుల్లా ఫాలో అయే అలవాటు వున్నవాళ్ళం కావడం వల్ల). అలాగే, కత్తులతో పొడుచుకోడాలు , గొడ్డళ్ళతో నరుక్కోడాలు, వెకిలితనం (as in vulgarity) వున్న సినిమాలకి కూడా కళ్ళెం వేస్తె సమాజం సగం బాగుపడుతుంది.

2 comments:

Kathi Mahesh Kumar said...

మీరు చాలా ఆశావాదుల్లా ఉన్నారు. ఈ విషయంపై నేను రాసిన టపా చూడగలరు.
http://parnashaala.blogspot.com/2008/07/blog-post_19.html

Sujata M said...

బావుందండీ. మరి లావు గా ఉన్న వాళ్ళను వెక్కిరించొచ్చంటారా ? :D అయినా, ఇలా సినిమా ల మీద కంట్రోల్ పెడితే, 'మా సృజనాత్మకత ను దెబ్బ తీస్తున్నరు - కధ పరంగా అలానే చెయ్యాలి ' అంటారు. పెట్టక పోతే, రెచ్చిపోతారు. ఇవన్నీ ఆచరణాత్మకాలా - కష్టమే లెండి. మంచి విషయం రాసారు.