Posts

Showing posts from April, 2008

Passport and PIO Card for your baby.

We recently had to go through this whole exercise and were surprised to find out that there are no resources on the net explaining some of the confusing aspects. Here is the process (This assumes that your's is a "normal" case - you and your spouse is Indian-born, Indian Citizens, holding Indian Passports, living in USA on H-1 or Green Card and this Passport and PIO card is for your new born baby). Passport: We thought that this is a very straight forward process and mostly it is, except for the passport photos. The USPS web site indicates that most of the post offices have facilities to make your passport photograph, but when we went to our local post office, they told us that they no longer offer this service for infants!. They said that it is because the pictures they take for infants are not coming out well. We went to CVS Pharmacy and got ours. So, it is a good idea to inquire ahead of time whether a certain place offers this service. The travel.gov web site has wel...

భలే భలే ఇలియానా

నిన్న రాత్రి వచ్చింది ఈ ప్రోగ్రాం. ఏంఖర్: ఈ సినిమా లో మీ క్యారెక్టర్ ఏమిటి? ఇలియానా: నాది చాల బబ్లి క్యారెక్టర్ (సైడ్ లో వ్రేలాడుతున్న జుట్టు మొహం మీద పడకపోయినా సరే చేతితో వెనక్కి తోసుకుంటూ.. మళ్ళీ గట్టిగా తోస్తే ఎక్కడ వెనక్కి వెళ్ళిపోయి ముందరకి రాదో అన్నట్టు, కొంచెం తోసీ తోయ్యనట్టు గా లైట్ గా). ఏం: How did you enjoy acting in the movie? ఇలి: I enjoyed a lot. ఏం: మీరు తెలుగు లో చాలా సినిమాలు చేసేసారు కదా.. మరి తెలుగు లో ఎప్పుడు మాట్లాడడం మొదలు పెడతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.. ఇలి: (English లో నే లెండి) ఒకప్పుడు నేర్చుకుందాము అనుకున్నాను కాని, (తెలివైన ప్రేక్షకులు) ఖతర్నాక్, ఆట ఫ్లాపు చెయ్యడం తో ఇంట్రస్టు పోయింది. మళ్ళీ ఇప్పుడు జల్సా ఆడుతోంది కదా నేర్చుకోడానికి ట్రై చేస్తా. ఏం: How did you enjoy acting with lover boy Tarun? ఇలి: Lover boy ఆ.. ("ఇంకా ఈ జుట్టు మీద పడదేమిటీ? - నేను వెనక్కి నెడదాము అనుకుంటుంటే" అనుకుంటూ) ఏం: అదేనండీ.. ఇక్కడ అందరికీ తరుణ్ లవర్ బాయ్ కదా!. ఇలి: I enjoyed a lot. ఏం: ఇప్పుడు మీరు తెలుగు లో అందరికంటే ఎక్కువ రేమునేరషన్ తీసుకుంటున్నారు కదా.. ఇలి: wo...

పంచాంగ వీరంగం

కిందటి శనివారం మా ఊరి తెలుగు అసోసియేషన్ ఉగాది కార్యక్రమం లో అతిథులు విన్న పంచాంగం ఇది. శాస్త్రం తెలియక సభికులని ఆకట్టుకోవడానికి చేసిన చిన్న ప్రయత్నంగా మాత్రమే చదవమని మనవి. రాజకీయాలు, క్రీడలు, సినిమా ల గురించిన వ్యాఖ్యల్ని "దిల్" కి తీసుకోవద్దు - విని మరిచిపొండి :). అందరికీ సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు.బాబూ.. కొంచెం ఆ కార్డ్ లెస్సో, ఆ క్లిప్ మైకో ఇస్తారా? This is very inconvenient you know? ఏమిటి? లేదా? దీన్లోనే చెప్పాలా? సరే!. (audience తో).. Cost Cutting అనుకుంటా.ఏదో పంచాంగ శ్రవణం చెయ్యమని తీసుకొని వచ్చారు - కానిద్దాం!. నా పేరు దైవజ్ఞ శాస్త్రి .net. పేరలా వుందని ఖంగారు పడకండి. ఇప్పుడంతా ఇంటర్నెట్ కదా.. అందుకని చివర్లో అలా తగిలించేను. ఈ యేడాది వివిధ రాశుల వారికి ఉండబోయే రాజపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం వివరాలు ఇలా వున్నాయి. ఏమిటీ.. రాజపూజ్యం అంటే మిమ్మల్ని రాజుల్లా పూజించడం అనుకుంటున్నారా? "పూజ్యం" అంటే తెలుసు కదా!! . నిండు సున్నా అన్నమాట. అంటే మిమ్మల్ని రాజుల్లా చూసేవారు పూజ్యం. అవమానం మాత్రం డెఫినెట్టు. ఈ యేడాది మిమ్మల్ని ఎవరైనా లాగి జెల్ల కొట్టేసే అవకాశం...

Thursdays are fun again!

Earl did last week and The Office is doing this week, coming back that is!. They are on a new season, bringing back cheer to Thursdays. Watched Earl yesterday and it was as hillarious as ever!. For a change, Joy started with a flat-belly (she always seems to carry a 45-week pregnancy). If Earl's brother Randy is on one end of the dumbo spectrum, the other end has - Dunder Mifflin's Michael from The Office. If you get NBC (in US), watch these if you are not already watching - sure worth your time.

జల్సా ఖర్చు

నిన్నటి ఐడిల్ బ్రెయిన్ లో శ్రీనివాస్ కంచిభొట్ల వ్రాసిన వ్యాసం లోంచి ("GRE English" పదాలు ఉపయోగించి రాసే చాలా పొడవైన వాక్యాలని మినహాయిస్తే ఇతడు వ్రాసే ఆర్టికల్స్ నాకు నచ్చుతాయి :) ): "The producer needs to be rapped on the knuckles for letting the production run amuck." అంటే, ఏమంటున్నారంటే, అల్లు అరవింద్ ని మాస్టారు బల్ల దగ్గర కి రమ్మని, చెయ్యి తిరగవేసి వుంచి, వేళ్ళ మీద బెత్తం తో (లేదా స్కేల్ తో) "ఈ సినిమా కి ఇన్ని కోట్లు పెట్టడం తప్పేనా?" అంటూ రెండు మూడు వెయ్యమని. ఊహించుకుంటే భలే నవ్వు వస్తుంది. అరవింద్ అన్నాను కాబట్టి నవ్వుతున్నాం కాని, చిన్నప్పుడు కొంతమంది శాడిస్ట్ మాస్టర్లు మా క్లాస్ లో పిల్లల్ని ఇలా శిక్షిస్తే నాకు పిచ్చ కోపం వచ్చేది. తలుచుకుంటే ఇప్పటికీ వస్తుంది. మనసు లో నే శాపనార్ధాలు పెట్టేవాడిని. కొంతమందికి తగిలే వుండొచ్చు. ఐతే ఇప్పుడు అలాంటి వాళ్ళు తగ్గారు అనే అనుకుంటాను. Figurative గా రాసేరు కాబట్టి కంచిభొట్ల మీద కోపం లేదు లెండి :).

అబ్బో !! మీకిన్ని తెలుసా!!?

నా గూగుల్ మెయిల్ కి ఒక పెద్ద ఈస్తటిక్ ప్రాబ్లం వచ్చింది (వాడకుండా వుండలేను, ఎందుకంటే, తెలుగు లో మెయిల్ కొడితే యాహూ లో ఒక సారి తెలుగు లోను, మరొక సారి అదేదో కంకిరి పింకిరి భాష లోను వస్తోంది). నా గూగుల్ ఇన్ బాక్స్ సెలవు రోజు నాటి పూర్ణా మార్కెట్ లాగ "conversations" తో కిక్కిరిసి పోతోంది రోజులు గడిచే కొద్దీ.. నిన్న ఈ "archive" బటన్ ఏమి చేస్తుందో చూద్దాము అని కుతూహలం తో కొన్ని మెసేజ్ లు ఎంచుకొని, ఆ బొత్తాన్ని వత్తేను. వెంటనే నేను ఎంచిన సంవాదాలు అన్నీ మాయమైపోయి నా ఇన్ బాక్స్ మళ్ళీ స్లిమ్ము గా, ట్రిమ్ము గా రెడీ అయింది. (తరవాత గూగుల్ మెయిల్ హెల్ప్ లో ఇవి అన్నీ రాసేరు అన్న విషయం చూసాను అనుకోండి). మాకు ఈ విషయం ముందే తెలుసు అంటారా? సరే. కాచుకోండి. క్రిందటి సంవత్సరం అనుకుంటాను.. NPR Morning Edition కార్యక్రమం లో రాజమండ్రి లో పన్నులు వసూలు చెయ్యడానికి "డప్పుల మోత" కార్యక్రమం నిర్వహించారని, దానిలో భాగంగా, పన్నులు బకాయి ఉన్న మొండి వాళ్ళ ఇళ్ళకి వెళ్లి, ఆ వీధిలో అందరూ వినేలా, వాళ్లు "మేము బకాయిలు చెల్లిస్తాము కమీషనరు గారూ" అని అనేదాకా, ఆపకుండా డప్పులు వాయించారుట ...

మంత్ర - ఎ ఫిల్మ్ బై అరవింద్?

మొత్తానికి మొన్న మంత్ర చూశాము. "ఇన్నాళ్లకా" అనుకోకండి. ఏ వంట చేసుకుంటూనో, పిల్లాడిని అడిస్తూనో సినిమా లు చప్పరించెయ్యడం కంటే, కాస్త తీరిక దొరికినప్పుడు, చక్కగా కూర్చొని, దృష్టి పెట్టి చూడడం అంటే మాకిష్టం వల్ల డీవీడీ వచ్చే వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. అందులోనూ, హారర్ సినిమా లు ఫుల్ సౌండ్ తో భయపడుతూ చూస్తే బాగుంటుంది కదా! ... (మీరు ఇప్పటికీ చూడకపోతే కింది పేరా చదవద్దు). ఈ సినిమా కి, ఇదివరలో వచ్చిన "ఎ ఫిల్మ్ బై అరవింద్" కి పోలికలు కనిపించాయి (క్లైమాక్స్ లో ఐతే తప్పకుండా). ఐతే ఈ సినిమా లో ఎవరు చేసారో చెప్పి, ఎందుకు చేసారో విశదం చెయ్యడం వల్ల సినిమా ని పూర్తి గా చూసి, ఆ మిస్టరీ ఏదో మనమే సాధించిన ఫీలింగ్ వచ్చింది. (అరవింద్ లో చివర్లో విలన్ ఫలానా అని చూపించారు కాని, అలా ఎందుకు జరుగుతోంది అన్న విషయం మీద వివరణ లేదు). దానికి తోడు, సంగీత పరంగా, నటన పరంగా కూడా ఈ సినిమా ఒక ఆకు ఎక్కువ చదివింది అని చెప్పవచ్చు. కధ జరుగుతున్నంత సేపూ, అత్మహత్యలని కూడా "దెయ్యమే" చేసింది అనుకోవడం, చివర్లో ఆ మిస్టరీ ని చేదించడం కూడా బాగుంది. ఒక దశలో మంత్రే దెయ్యమని మనల్ని ఆల్మోస్ట్ నమ్మిస్తా...