పిల్లలకి ఒక ఏడాది వయసు వచ్చేసరికి మొదట నెమ్మదిగా కప్ లోనుంచి తాగడం అలవాటు చేస్తాము. చిన్న నోళ్ళు కాబట్టి పీల్చుకోవడానికి చాలా సార్లు కప్ కి స్ట్రా కలిసి ఉండే విధంగా వాళ్ళు అమ్మడం, మనం కొనడం పరిపాటి. దీనితో పిల్లలకి స్ట్రాతో కావలసినంత పీల్చుకోవడం, సొంతంగా తాగడం అలవాటు అవుతుంది. ఐతే చాలాసార్లు ఈ స్ట్రాలు స్ట్రైట్ గా కాకుండా మధ్యలో డిజైన్లు (
ఇక్కడ చూపించిన విధం గా) ఉంటాయి. దానివల్ల స్ట్రా సులువుగా వంగుతుంది కాని, వాడేకొద్దీ (ముఖ్యంగా పాలతో) దానిలో "మోల్డ్" చేరి అనేక అనారోగ్యాలకి కారణం అవుతుంది. మరి స్ట్రా లోపల శుభ్రం చెయ్యడం ఎలా? దానికోసం మాకు ఈ మధ్య ఒక పరికరం దొరికింది. "Babys R Us",
అమజాన్ లాంటి చోట్ల దొరుకుతుంది. (bRUs లో ఖరీదు ఎక్కువ అన్న విషయం మళ్ళీ నేను చెప్పనక్కర్లేదు). దీనితో స్ట్రా లు శుభ్రం గా శుభ్రం అయిపోతాయి.