వేదం సినిమా రిలీజ్ అప్పుడు అనుకుంటాను - "ఈ సినిమా లో పాటలు మీ స్టైల్ లో లేవు" అన్నందుకు శిల్పా చక్రవర్తి కి మా టీవీ ముఖం గా కీరవాణి చిన్న క్లాసు పీకేరు :). "నేను ఎవరికోసం మ్యూజిక్ చేస్తే అది వాళ్ళ స్టైల్ లో ఉంటుంది" అని. అది కూడా చాలా వరకు నిజమే అనిపిస్తుంది నాకు ఐతే. అన్నమయ్య కి, అల్లరి అల్లుడు కి, ఒకరికి ఒకరు కి, पहली नजर में కి వేర్వేరు విధాలుగా సంగీతం వినిపిస్తుంది. కానీ కొన్ని పాటల్లో కీరవాణి మార్కు తప్పనిసరి (పాత రోజుల్లో (తొంభైల్లో అన్నమాట) ఒక స్టాండర్డ్ డప్పు (మరీ మాస్ కాకుండా - క్లాసు కాకుండా), అదేదో జంత్ర వాయిద్యం - వినడానికి చాలా సుఖం గా ఉంటుంది అది - దాని పేరు నాకు తెలియదు ("అల్లరి ప్రియుడు" లో "అందమా నీ పేరేమిటి అందమా" లో మొట్ట మొదట వినిపించే వాయిద్యం).
ఈ మధ్య వచ్చిన కీరవాణి పాటల్లో ఇది నాకు చాలా బాగా నచ్చింది: "కనులతో రాసే తోలి కవిత" - యంగ్ ఇండియా సినిమా నుంచి. దాన్ని వింటే ఎక్కడా ఆయన చేసిన పాట లాగ ఉండదు. దానికి తోడు కార్తీక్ - మరి చెప్పక్కర్లేదు కదా? అనంత శ్రీరాం కూడా వెళ్ళేకొద్దీ మరీ నచ్చేస్తున్నాడు..
చక్కని పాట: వినకపోతే వెంటనే వినండి. సినిమా అపజయం వల్ల ఈ పాట జనానికి చేరకపోతే too bad!!
http://www.ragalahari.com/newreleasesdetail.asp?newmvname=Young+India