Posts

Showing posts from January, 2010

"స్వరపేటిక" మీద అదుపు

కొంతమంది ఏమి అంటున్నామో అని చూసుకోకుండా ఎంతొస్తే అంత గబుక్కున అనేస్తుంటారు. అవతలి వారి మీద అది ఎలా పని చేస్తుందో అని ఒక్కసారైనా ఆలోచిస్తే వాళ్లకి ఈ మాటల వల్ల కలిగే బాధని కొంతైనా నివారించవచ్చు. మనిషికి దేముడిచ్చిన పెద్ద ఆయుధం నోరే. రాయిని ఎలాగైతే దేముడి బొమ్మ చెయ్యడానికీ, ఇంకోడి తల బద్దలు కొట్టడానికీ వాడొచ్చో అలాగే, దీనిని కూడా ఇంకొకళ్ళని ఆహ్లాదపరచడానికీ (ఫీల్ గుడ్ చెయ్యడానికి), బాధ పెట్టడానికీ సమానంగా వాడొచ్చు. విషయం ఏమిటంటే కిందటి శనివారం ఒక స్నేహితుల ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి అని పిలిచేరు, వెళ్ళాము. పదిన్నరకి వ్రతం అని పిలిస్తే చాలామంది భోజనానికి మాత్రమే పిలిచినట్టుగా నెమ్మదిగా లేచి పన్నెండు అయిందో లేదో చూసుకొని మరీ వచ్చారు అనుకోండి. అందులో కొంతమంది ఆస్తికులు వస్తూనే , "వ్రతం అయిపోయిందా (లేదా)" అని కూడా confirm చేసుకోవడానికి ప్రయత్నించారు. మా మటుకు మాకు ఎవరైనా ఇటువంటి సందర్భాలలో పిలిస్తే వాళ్ళు పీటల మీద కూర్చొనే సమయానికి వెళ్ళి కాస్త వాళ్ళని సంతోషపెట్టాలని వుంటుంది. ముఖ్య కార్యక్రమం వ్రతం కదా!. బిక్కుబిక్కుమంటూ భార్య, భర్త కూర్చుని ఒక పక్క "ఎవరూ రావట్లేదు" అన...