తెలుగునాడి
మే-జూన్ 2009 తెలుగునాడి సంచిక సంపాదకీయం చూసి ఖంగారుపడ్డాను. అందులో, తెలుగునాడి వచ్చేనెల నుంచి రాదనీ, ఇంత తక్కువ ఆదరణతో పత్రిక నడపడం సాధ్యం కాదనీ తెలియజేసారు. ఐదేళ్ళ క్రితం మొదలు అయినప్పటినుంచీ తెలుగునాడి పత్రికను (చందా చెల్లించే) చూస్తున్నాను. ఏదో ఒక థీమ్ కింద కాకుండా, అందరికీ నచ్చే అన్ని అంశాలు (పాత కాలపు పద్యాల మొదలుకొని, అలనాటి కధ, సీరియల్, పిల్లల సెక్షన్, కార్టూన్లు, ప్రత్యేక వ్యాసాలూ, అలనాటి సినిమా, ఈనాటి సినిమా ల వరకు) గుదిగుచ్చి అందిస్తూ వచ్చారు. ఏ దశలోను కూడా పత్రిక క్వాలిటీ పెరిగిందనే తప్ప తగ్గిందని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఐతే, మొదటినుంచీ కూడా, సరిపడినందరు చందాదారులు లేకపోవడం అనేది ఈ పత్రికకి ఉన్న ఎటర్నల్ సమస్యగా కనిపించింది. అంటే, అమెరికాలో ఒక తెలుగు పత్రిక survive అవడానికి సరిపడినంతమంది తెలుగువాళ్ళు లేరా? (ఇది వరకు ఎప్పుడో 1000 మంది చందా దారులు ఉన్నట్టు పత్రికలో ప్రచురించిన నోటీసులో చూసిన గుర్తు). ఇన్ని వేలమంది తెలుగు కుటుంబాల్లో ఒక్క వేయి మనదేనా? సిగ్గు కదూ? ప్రతీ వాళ్ళు, "ఇండియాని మిస్ అయిపోతున్నాము, తెలుగుని, పండగలని, సరదాలని కోల్పోతున్నాము" అనే వాళ్ళే తప్ప (అ...