Posts

పాలకూర అన్నం

కావలసిన పదార్థాలు:   బియ్యం - 3 రైస్ కప్పులు. పాలకూర - ఒక పెద్ద కట్ట. ఉల్లిపాయలు - పెద్దది ఒకటి. పచ్చిమిరపకాయలు - 6. జీడిపప్పు - 1/2 కప్పు. మిరియాలు - 1/2 చెంచా. లవంగాలు - 4.  మినప్పప్పు - 1 చెంచా. ఆవాలు - 1/2 చెంచా. జీలకర్ర - 1 చెంచా. ఉప్పు - తగినంత. గరం  మసాలా పొడి - 1/2 చెంచా. తయారు చేయు విధానం: ముందుగా అన్నం వండుకోవాలి. మిరియాలని పొడి చేసుకోవాలి. పాలకూరని శుభ్రంగా కడిగి, తరగాలి. ఈ పాలకూర తరుగు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు మిక్సీలో వేసి ముద్దలా తిప్పాలి. మూకుట్లో నూనె వేసి లవంగాలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేయించి అవి బాగా వేగాక ఈ పాలకూర ముద్దని వేసి బాగా కలపాలి. ఇప్పుడు మంటని కాస్త తగ్గించి ఈ ముద్దని  10-15 నిముషాలు  బాగా ఉడకనివ్వాలి. తరువాత ఇందులో తగినంత ఉప్పు, మిరియాల పొడి,  గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన అన్నం వేసి అంతా బాగా కలపాలి. మంట మరికాస్త తగ్గించి, మధ్య మధ్యలో కలుపుతూ ఒక 15 నిముషాలు ఉంచాలి. ఉప్పు అవీ చూసుకుని ఇంక ఆపెయ్యచ్చు. ఇది తయారు అయ్యాక ఒక ప...

బొడ్డుతాడు లో బంగారం

Image
చాలా మంది మిత్రులతో, తెలిసినవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం దొర్లుతూ వుంటుంది - ముఖ్యంగా ఇక్కడ (అమెరికా లో). "పిల్లలు పుట్టినప్పుడు మూలకణాలు (స్టెం సెల్స్) దాచాలా వద్దా అని ఆలోచిస్తున్నాము" అని, "మీరు దాచారా" అనీ. తెలియని వాళ్ళ కోసం (మళ్ళీ తర్జుమా లో అర్ధం మారిపోకుండా చూసింది చూసినట్టు) - courtesy http://www.cordblood.com/cord_blood_faqs/cord_blood.asp : Cord blood is the blood that remains in your newborn's umbilical cord after birth. Cord blood, like bone marrow, is an invaluable source of a type of stem cell that can be used in a variety of medical treatments. Stem cells are the body's "master cells" because they are the building blocks of organ tissue, blood, and the immune system. Stem cells from bone marrow were first used to regenerate blood and immune cells for patients who had received chemotherapy for cancer. In the late 1980s, doctors started using cord blood stem cells to treat diseases that had previously been treated with bo...

మంచి మనిషి.

Image
ఇంజనీరింగ్ అయిన వెంటనే ఏమి చెయ్యాలా అన్న విషయం ఇంజనీరింగ్ చేస్తున్నన్నాళ్ళూ పెద్దగా ఏమి అనుకోలేదు. అందరూ గేటు రాస్తున్నారంటే నేను కూడా రాసా.. ఏదో జరిగి మార్కులూ బాగానే పడ్డాయి - ఐ ఐ టీ మిస్ అయి మద్రాస్ లో అన్నా యూనివర్సిటీ లో చేరాను కంట్రోల్ సిస్టమ్స్ లో. అసలే ఇంటి బయట ఉండడం మొదటి సారి, మన భాష/ఊరు కాని ప్రదేశం, ముఖ్యం గా ముందు గా తెలిసి ఉన్న స్నేహితులు లేకపోవడం (అందుకే తరవాత ఇంకా ఎక్కువ దూరం అయిన అమెరికా వచ్చినా కూడా ఇక్కడ అప్పటికే తెలిసిన స్నేహితులు ఉండడం తో అస్సలు ఇబ్బంది లేకుండా కలిసిపోయాను), నన్ను అక్కడ ఉండనివ్వలేదు. దానికి తోడు చీకటి గుయ్యారాల లాంటి హాస్టల్ రూములు, రోజుకొకసారి కనిపించే ఈనాడు పేపర్, రుచీ పచీ లేని హాస్టల్ భోజనం - మనకి ఒకటి నచ్చక పొతే అన్నీ భూతద్దాలలోంచి కనిపిస్తాయి కదా - మొత్తానికి ఈ కాలేజీ మనకోసం కాదు అన్న విషయం నిర్ణయం అయిపొయింది. దానికి తోడు, అక్కడ చేరిన ఒక వారం రోజులకి విశాఖపట్నం గీతం లో నాతో చదివిన స్నేహితుడు అమెరికా వీసా కి రావడం, అతని ద్వారా జీ ఆర్ ఈ కి ఎలా తయారవాలి తదితర విషయాలు తెలుసుకోవడం వల్ల అమెరికా పురుగు గట్టిగా కుట్టింది. మనం ఏదైనా పని చెయ్యడానికి...

చర్చి దర్శనం.

Image
నిన్న చర్చి కి వెళ్ళాము. అమెరికా లో చాలా కాలం నుంచీ ఉన్నా, ఎందుకో వెళ్ళడానికి సమయం సందర్భం కలిసి రాలేదు. పెళ్ళికాకముందు ఒకసారి మా మేనేజర్ గారు చర్చి కోరస్ లో పాటలు పాడతాను అంటే వెళ్ళాము కాని, ఆ కోటి మంది కోరసుల్లో ఆయన గొంతు గుర్తు పట్టలేదు. ఇన్నాళ్ళకి మళ్ళీ నా పక్కసీటు లో పాలు గారు ("కే. ఏ." కాదు) చర్చి లో మత ప్రవచనం ఇవ్వడానికి ఏవో కోర్సులు చేసి, పరీక్షలు రాసి పాసై, అర్హత సంపాదించి మొదటి సారి ప్రవచిస్తున్నా మీరందరూ రావాలి అని అనేక విధాల (మౌఖికం గా, ఈమైలికం గా, ముఖపుస్తక రూపకం గా) చెప్పడం తోను, ఎన్నాళ్ళ నుంచో శాంతి కోరుతూ ఉండడం తోను ఇక బయల్దేరాము. ఇక్కడ మా పాలు గారి గురించి కొంచెం చెప్పుకోవాలి. ఏభై ఏళ్ళ మనిషి అయినా ఇంటా బయటా అన్ని వయసుల వాళ్ళతోనూ కలసి మెలసి తెగ హడావిడి గా ఉంటాడు. ఆయన చెప్పే కబుర్లు విని నేనే "నీ జీవిత చరిత్ర రాస్తే చెప్పు - మొదటి పుస్తకం నేనే కొంటా" అని కూడా హామీ ఇచ్చాను (ఆయన ఇంకా మొదలు పెట్టినట్టు లేదు అనుకోండి). విధి వశాన నాలుగు పెళ్ళిళ్ళు, బోలెడు పిల్లలు, అప్పులు, అనేక జీవితానుభవాలు పుష్కలం గా ఉన్న వ్యక్తి పాల్. దానికి తోడు తన ఇరవై ఆరో ఏట మాని వేస...

ఇష్టం అంటే...

Image
"నాన్నంటే నాకిష్టం" "నాకు కూడా శ్రీహర్షబాబంటే బోలెడంత ఇష్టం" "నాన్నా.." "ఊ..." "ఇష్టం అంటే?" ".................. ఇష్టం అంటే, నువ్వు ఎప్పుడైనా తమ్ముని కొట్టడం, తోసెయ్యడం చేస్తావు కదా.. అప్పుడు నాన్న 'హన్నా.. అలా చెయ్యకూడదు' అని కేకలేస్తారు కదా.. కాని వెంటనే ఇలా పట్టేసుకుంటారు - అదీ ఇష్టం అంటే" నాన్నకి ఏమి చెప్పాలో తెలియలేదు. "ఓహో...." శ్రీహర్ష బాబుకి మాత్రం చక్కగా అర్ధం అయింది!! :).

నీళ్ళెలా తాగాలి?

Image
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి విమానం మారుతున్నప్పుడు ఈ వాటర్ ఫౌంటెన్ నాకు స్వాగతం చెప్పింది. చూడబోతే ఇది ఫౌంటెన్ (నీళ్ళు కింద నుంచి పైకి చిమ్మే)లా కాకుండా "కుళాయి" (నీళ్ళు పై నుంచి కిందకి పడే)లాగ ఉంది. కళ్ళతో చుట్టూ వెదికాను దగ్గరలో కాగితం గళాసులు ఏమైనా ఉన్నాయేమో అని. కనిపించలా. పక్కన కాసేపు నక్కి గమనించాను ఎవరైనా దానితో తాగడం చూసి ఎలా తాగాలో నేను కూడా నేర్చుకుందామని. అందరూ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు వెళ్ళిపోతున్నారు తప్ప ఆగి అది వాడడం లేదు. పక్కనే ఒకాయన ఇద్దరు పిల్లలతో వెడుతూ నాలాగే అనుమానం గా దానికేసి చూస్తున్నాడు. "ఇదెలా..." అని నేను పూర్తి చేసేలోగా "హి హ్హి" అని మల్లిక్ కార్టూన్ లో లాగ నవ్వి మౌనం వహించాడు. అప్పుడు ఇంక లాభం లేదు అని, అటుగా వెడుతున్న ఒక ఎయిర్ పోర్ట్ ఉద్యోగినిని అడిగా "దీనిలో నీళ్ళు తాగడం ఎలాగండి" అని - ఆవిడ ప్రశ్న ని తెలుగు లో అర్ధం చేసుకొని ఇంగ్లీష్ లో సమాధానం చెప్పడానికి ప్రయత్నించింది. "You put head under" అంటూ.. నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఎందుకంటే, సామాన్య పీక నిర్మాణం కలిగిన మానవుడు ఎవడూ నేల మీద రెండు కాళ్ళూ...

(మా) రాజమండ్రి విమానాశ్రయం.

Image
చిన్నప్పుడెప్పుడో ఒకసారి (అంటే ఇంచుమించు 1986 అనుకుంటా) - రాజమండ్రి నుంచి వాయుదూత్ విమానంలో హైదరాబాద్ వెళ్ళాము. విమానం ఎక్కడం అదే మొదటిసారి - ఆ వాయుదూత్ లో అంత ప్రమాదం ఉంటుంది అని తెలియదు - విమానం ఎక్కాలి అనే సరదాయే తప్ప. ప్రమాదం అని ఎందుకు అన్నానంటే మేము ఎగిరిన చాలా రోజుల తరువాత వేరే వాయుదూత్ విమానం కూలి పాపం అందులో వాళ్ళు అందరూ పోయారు. వెంటనే ప్రభుత్వం వారు మేల్కొని మొత్తం వాయుదూత్ నే రద్దు చేసారు అనుకోండి అది వేరే విషయం. అప్పుడు ఇప్పటిలా విరివిగా విమాన సర్వీసులు, వాటిమీద ప్రభుత్వ నిఘా ఉండేది కాదు. రాజమండ్రి విమానాశ్రయానికి బయల్దేరి, సగం దూరంలో మా వాహనం (ఆటో లెండి) చెడిపోతే అటుగా వెడుతున్న విమానాశ్రయం వారి జీప్ లో ఎక్కడం, అందులో ఉన్న ఆఫీసర్ - ఎంత పెద్ద ఉద్యోగమో మనకి తెలియదు కాని, ఆ ఎయిర్ పోర్ట్ అంతా తనదేననీ, విమానాలు ఎక్కడానికి వచ్చేవాళ్ళకి తను విమానం ఎక్కే అవకాశం ఉచితం గా ఇస్తూ మహా సేవ చేసేస్తున్నాననీ - అందువలన గారంటీ గా స్వర్గానికే వెడతాననీ నమ్మకం పెట్టుకున్నవాడిలా మొహం వేసుకొని మా వైపు మహా చిరాకుగా చూడడం ఇంకా గుర్తు :). అన్నట్టు ఆ ఫ్లైట్ లో కూర్చొని ఆ విశేషాలు వర్ణిస్తూ మా అమ్మగార...